సైఫ్‌తో హాట్ హాట్‌గా... | Saif Ali Khan-Ileana D'cruz selfies make it to final cut | Sakshi
Sakshi News home page

సైఫ్‌తో హాట్ హాట్‌గా...

Published Tue, Oct 21 2014 11:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సైఫ్‌తో హాట్ హాట్‌గా... - Sakshi

సైఫ్‌తో హాట్ హాట్‌గా...

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా బతకాల్సిందే... అనే సూత్రాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు ఇలియానా. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి చాలామంది భామలే వెళ్లారు కానీ... ఇలియానా అంత వేగంగా అక్కడి పద్ధతుల్ని ఆకళింపు చేసుకున్న తార మాత్రం లేరనే చెప్పాలి. తొలి సినిమా ‘బర్ఫీ’ మినహా ఆ తర్వాత ఇలియానా చేసిన రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. నిజానికి ఇలాంటి అపజయాలు ఎదురైన ఏ హీరోయిన్ అయినా... వెంటనే వెనక్కు వచ్చేస్తారు. కానీ... ఇలియానా అలా కాకుండా, బికినీ ఫొటో షూట్‌తో అక్కడ బోలెడంత పాపులారిటీ తెచ్చేసుకున్నారు. అక్కడి హీరోలతో క్లోజ్‌గా ఉండటమే కాక, కథానాయికలతో దోస్తీ కడుతూ ఉత్తరాది భామగా మారిపోయారు.
 
 ఇదిలావుంటే... ఇటీవలే సైఫ్ అలీఖాన్ జోడీగా ఇలియానా నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ట్రయిలర్స్‌లో ఇలియానా హాలీవుడ్ లుక్ చూసి బాలీవుడ్ జనాలు సైతం ఫిదా అయిపోతున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే... ఈ సినిమా దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకెలు కథ రీత్యా ఇందులో ఓ బెడ్‌రూమ్ సీన్ చిత్రీకరించారట. సైఫ్, ఇలియానా కాంబినేషన్‌లో రూపొందిన ఈ సన్నివేశంలో ఇలియానా హాట్ హాట్‌గా నటించారని యూనిట్ వర్గాల టాక్. ఈ విధంగా... జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్ సంప్రదాయాలను పాటిస్తూ, చకచకా హిందీ తెరపై అగ్ర నాయికల జాబితాకి చేరిపోతున్నారు ఇలియానా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement