మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం!
మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం!
Published Fri, Jan 3 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
‘ఆఫ్‌బీట్ సినిమాల్లో నటించడం బాగానే ఉంటుంది. కానీ, వరుసగా అవే సినిమాలు చేస్తే ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ‘బర్ఫీ’ తర్వాత నేను కావాలని కమర్షియల్ సినిమాలు ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే కమర్షియల్ సినిమాలకే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది’’ అంటున్నారు ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘మై తేరా హీరో’ షూటింగ్ పూర్తయ్యింది.
ఈ షూటింగ్ మంచి అనుభూతినిచ్చిందని ఇలియానా పేర్కొంది. ఇక, ‘హ్యాపీ ఎండింగ్’ గురించి ప్రత్యేకంగా చెబుతూ - ‘‘ఇందులో సైఫ్ అలీఖాన్ సరసన నటిస్తున్నాను. యూఎస్‌లో ఆ మధ్య ఓ భారీ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. సైఫ్ జెంటిల్‌మేన్. కరీనా కూడా చాలా మంచిది. మా షూటింగ్ లొకేషన్‌కి తను వచ్చేది. అప్పుడు మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం. లంచ్‌కి, డిన్నర్స్‌కి వెళ్లేవాళ్లం. నాకైతే షూటింగ్ చేస్తున్నట్లుగా లేదు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపించేది. కొన్ని సినిమాలకే ఇలా జరుగుతుంటుంది’’ అన్నారు ఇలియానా.
Advertisement
Advertisement