My Tera Hero
-
చిలిపి పాత్రలంటే ఇష్టం
వరుణ్ ధవన్ ముంబై: వరుణ్ ధవన్... నటించింది రెండు సినిమాల్లోనే అయినా యవతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అల్లరి పనులు చేసే చిలిపి పాత్రలంటే ఇష్టపడే ధావన్ తాను అటువంటి పాత్రలకు సరిగ్గా సరిపోతానని ‘మై తేరా హీరో’ సినిమాతో నిరూపించాడు. తాజాగా ‘హంప్టీ శర్మా కి దుల్హనియా’లో కూడా దాదాపుగా అదేరకమైన పాత్ర దక్కింది. ‘సరిగ్గా నేను ఎటువంటి పాత్రలనైతే ఇష్టపడతాను అటువంటి పాత్రల్లోనే నటించే అవకాశం వస్తోంది. హంప్టీ శర్మా...లో నేను చురుకైన రొమాంటిక్ హీరోలా కనిపించినా ఎంతో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రమది. సాధారణ ప్రేమకథా చిత్రాలు చూసి ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. అందుకే హంప్టీ శర్మా కి దుల్హనియా ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కాస్త భిన్నంగా చూపించాలనుకున్నాం. ఈ ఏడాది ఉత్తమ ప్రేమకథా చిత్రంగా మా సినిమా నిలుస్తుందని భావిస్తున్నాన’ని చెప్పాడు. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ నటి ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆలియాతో కలిసి నటించడం భలే సరదాగా ఉంటుందని, అయితే తొలి చిత్రానికి, ప్రస్తుత చిత్రానికి ఆమెలో ఎంతో మార్పు కనిపించిందన్నాడు. మనిషిగా ఆమెలో ఏ మార్పు లేకున్నా నటిగా ఆలియాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఆమె అద్భుతంగా నటిస్తోందని, ఆమెతో కలిసి నటించడాన్ని తాను ఆస్వాధిస్తున్నానన్నాడు. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ... మేమిద్దరం పోటీ పడుతున్నట్లు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. సిద్ధార్థ్ సినిమా విడుదలయ్యే రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. అతను కూడా అంతే. అతను నాకు సోదరుడిలాంటివాడు. అందుకే నన్ను ఎప్పుడూ ‘మై తేరా హీరో’ అంటూ ఆటపట్టిస్తాడు. నేను అంతే ఎప్పుడూ అతణ్ని ఆటపట్టిస్తుంటాను. ఇద్దరం భలే సరదాగా ఉంటామ’న్నాడు. -
వరుణ్‌ది కత్తిలాంటి బాడీ!
ఎవరి గురించైనా అదే పనిగా మాట్లాడితే.. ఆ వ్యక్తి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏదో ఉన్నట్లే. అలా ఇలియానాకి హీరో వరుణ్ ధావన్ మీద ‘ఏదో’ ఉందని బాలీవుడ్‌వారు అంటున్నారు. దానికి కారణం ఇలియానా మాట్లాడుతున్న మాటలే. ఆ మధ్య ఓ సందర్భంలో వరుణ్‌లాంటి భర్త రావాలని కోరుకుంటున్నా అని ఇలియానా బహిరంగంగానే అన్నారు. ఇతగాడి సరసన ఇలియానా నటించిన ‘మై తేరా హీరో’ ఇటీవల విడుదలైంది. ఈ షూటింగ్ సమయంలో అతనితో ఇలియానా చాలా చనువుగా ఉండేవారట. అది మాత్రమే కాదు.. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా వరుణ్‌తో ఇలియానా సన్నిహితంగా మెలగడం నలుగురి కంట్లోనూ పడింది. ఆ విషయాలను పక్కన పెడితే.. తాజాగా వరుణ్ శరీరాకృతి గురించి ఇలియానా మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. వరుణ్‌ది కత్తిలాంటి బాడీ అని, తన దేహదారుఢ్యం భలే ఉంటుందని ఇలియానా అన్నారు. తనది ఎనిమిది పలకల దేహం అని, శరీరం చాలా ఫిట్‌గా ఉంటుందని కూడా వరుణ్ని ప్రశంసించారు. ఫిట్‌గా ఉండటం అంటే తనకు చాలా ఇష్టమని, ఎవరైనా అలా ఉంటే వాళ్లనే చూస్తుంటానని కూడా పేర్కొన్నారు ఇలియానా. రణబీర్‌కపూర్, షాహిద్‌కపూర్ కన్నా వరుణ్ చాలా ఫిట్‌గా ఉంటాడని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. అది మాత్రమే కాదు.. వరుణ్‌ది సిక్స్ ప్యాక్ బాడీ అయితే.. నాది ఫోర్ ఫ్యాక్ అంటూ తన మీద తను జోకేసుకుంది. ఈ స్థాయిలో మాట్లాడారు కాబట్టే, వరుణ్ మీద ఇలియానా మనసు పడ్డారేమో అని కొంతమంది ఊహిస్తున్నారు. -
సంచలనం రేపిన ఫొటోషూట్
కెరీర్లో తప్పనిసరి కావడంతో తారలు అభిప్రాయాలను మార్చుకోవడం అత్యంత సహజం. పక్కనున్న చిత్రంలో లాగా ఇలియానా కనిపించడానికి కారణం అదే. ఎనిమిదేళ్ల పాటు దక్షిణాది సినిమాను ఓ స్థాయిలో ఏలింది ఇలియానా. కొన్ని సినిమాల్లో కాస్తంత ఘాటుగా కూడా కనిపించింది. అయితే... టూ పీస్ బికినీ ప్రస్తావన తెస్తే మాత్రం... ‘ససేమిరా’ అనేది. ‘గ్లామర్ ఒలికించే విషయంలో నాకంటూ కొన్ని పరిధులున్నాయి. హద్దు మీరి అందాలు ఆరబోయాల్సిన అవసరం నాకు లేదు’ అని చాలా సందర్భాల్లో చెప్పింది కూడా.తన ప్రమేయం లేకుండానే కొన్ని సినిమాల్లో తనను అసభ్యంగా చూపించారంటూ ఆమె బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇలియానా ఇప్పుడు ఇలా... టూ పీస్ బికినీ ధరించి, ఓ భారీ ఫొటో సూట్లో పోజులిచ్చారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశం. బాలీవుడ్ కెరీర్ కాస్తంత ఆశాజనకంగా కనిపించడంతో తన పాత అభిప్రాయాలను అటకెక్కించేసింది ఈ గోవా భామ. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మరి. ఏది ఏమైనా సాగరతీరంలో ఇలియానా టూ పీస్ బికినీ స్టిల్స్ యువతరంలో సంచలనం రేపుతున్నాయి. మరోపక్క ఈ ఫొటోషూట్ పుణ్యమా అని బాలీవుడ్లో ఇలియానా మరిన్ని అవకాశాలు కొట్టేయడం ఖాయమని మీడియా కోడై కూస్తోంది. గత వారమే ఇలియానా నటించిన ‘మై తేరా హీరో’ చిత్రం విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్నట్లు బాలీవుడ్ టాక్. అందులోనూ ఇలియానా గ్లామ రస్‌గా నటించారు. ఆమె పాత్రపై స్పందన సానుకూలంగా ఉంది. మరో పక్క సైఫ్ ఆలీఖాన్‌తో ‘హ్యాపీ ఎండింగ్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఏమైనా, మున్ముందు బాలీవుడ్లో ఇలియానా ప్రభ వెలిగిపోతుందని కొందరి భావన. -
ఇలియానా అమ్మ అయ్యింది
ఇలియానా ‘అమ్మ’ అయ్యారు. ఇంతవరకూ పెళ్లే కాలేదు. ఏంటీ దారుణం? అనుకుంటున్నారా! ఇంతకీ ఇలియానాను తల్లిని చేసిందెవరో చెప్పలేదు కదూ. బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్. ఏంటి... ఇదంతా నిజమే... అనుకుంటున్నారా! అయితే వివరాల్లోకెళ్లాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానా ‘మై తేరా హీరో’ అనే సినిమా చేస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘కందిరీగ’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా లొకేషన్లో తోటి నటీనటులందర్నీ ఇలియానా కంటికి రెప్పలా చూసుకుంటున్నారట. ఆహారం, ఆరోగ్యం విషయాల్లో అందరికీ సలహాలు ఇస్తున్నారట. అవసరం లేకపోయినా... ఇలా అందరి బాగోగులూ చూసుకోవడం చూసి, వరుణ్‌ధావన్ ఆమెను ‘మమ్మీ’ అని పిలవడం మొదలుపెట్టాడట. దాంతో లొకేషన్లో ఉన్న అందరూ కూడా సరదాగా ఇలియానాను ‘మమ్మీ.. మమ్మీ’ అని ఆట పట్టిస్తున్నారట. ఇలాగే... ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ షూటింగ్లో కూడా ఆ చిత్ర హీరో షాహిద్‌కపూర్... ఇలియనాని ‘హౌస్ వైఫ్’ అంటూ ఏడిపించాడు. హౌస్ కీపింగ్ విషయంలో ఆమె అతి జాగ్రత్తని చూసి షాహిద్ అలా ఆటపట్టించాడట. మొత్తంమీద లొకేషన్లో మాత్రం ఇలియానా మంచి ఎంటర్టైన్మెంట్నే ఇస్తున్నారని అనుకుంటున్నారు. -
మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం!
‘ఆఫ్‌బీట్ సినిమాల్లో నటించడం బాగానే ఉంటుంది. కానీ, వరుసగా అవే సినిమాలు చేస్తే ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ‘బర్ఫీ’ తర్వాత నేను కావాలని కమర్షియల్ సినిమాలు ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే కమర్షియల్ సినిమాలకే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది’’ అంటున్నారు ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘మై తేరా హీరో’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ షూటింగ్ మంచి అనుభూతినిచ్చిందని ఇలియానా పేర్కొంది. ఇక, ‘హ్యాపీ ఎండింగ్’ గురించి ప్రత్యేకంగా చెబుతూ - ‘‘ఇందులో సైఫ్ అలీఖాన్ సరసన నటిస్తున్నాను. యూఎస్‌లో ఆ మధ్య ఓ భారీ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. సైఫ్ జెంటిల్‌మేన్. కరీనా కూడా చాలా మంచిది. మా షూటింగ్ లొకేషన్‌కి తను వచ్చేది. అప్పుడు మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం. లంచ్‌కి, డిన్నర్స్కి వెళ్లేవాళ్లం. నాకైతే షూటింగ్ చేస్తున్నట్లుగా లేదు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపించేది. కొన్ని సినిమాలకే ఇలా జరుగుతుంటుంది’’ అన్నారు ఇలియానా.