ఇలియానా అమ్మ అయ్యింది
ఇలియానా అమ్మ అయ్యింది
Published Sun, Jan 26 2014 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఇలియానా ‘అమ్మ’ అయ్యారు. ఇంతవరకూ పెళ్లే కాలేదు. ఏంటీ దారుణం? అనుకుంటున్నారా! ఇంతకీ ఇలియానాను తల్లిని చేసిందెవరో చెప్పలేదు కదూ. బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్. ఏంటి... ఇదంతా నిజమే... అనుకుంటున్నారా! అయితే వివరాల్లోకెళ్లాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇలియానా ‘మై తేరా హీరో’ అనే సినిమా చేస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘కందిరీగ’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా లొకేషన్లో తోటి నటీనటులందర్నీ ఇలియానా కంటికి రెప్పలా చూసుకుంటున్నారట. ఆహారం, ఆరోగ్యం విషయాల్లో అందరికీ సలహాలు ఇస్తున్నారట.
అవసరం లేకపోయినా... ఇలా అందరి బాగోగులూ చూసుకోవడం చూసి, వరుణ్‌ధావన్ ఆమెను ‘మమ్మీ’ అని పిలవడం మొదలుపెట్టాడట. దాంతో లొకేషన్లో ఉన్న అందరూ కూడా సరదాగా ఇలియానాను ‘మమ్మీ.. మమ్మీ’ అని ఆట పట్టిస్తున్నారట. ఇలాగే... ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ షూటింగ్‌లో కూడా ఆ చిత్ర హీరో షాహిద్‌కపూర్... ఇలియనాని ‘హౌస్ వైఫ్’ అంటూ ఏడిపించాడు. హౌస్ కీపింగ్ విషయంలో ఆమె అతి జాగ్రత్తని చూసి షాహిద్ అలా ఆటపట్టించాడట. మొత్తంమీద లొకేషన్లో మాత్రం ఇలియానా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఇస్తున్నారని అనుకుంటున్నారు.
Advertisement
Advertisement