చిలిపి పాత్రలంటే ఇష్టం | I am attracted to crazy characters: Varun Dhawan | Sakshi
Sakshi News home page

చిలిపి పాత్రలంటే ఇష్టం

Published Sat, Jul 5 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

చిలిపి పాత్రలంటే ఇష్టం

చిలిపి పాత్రలంటే ఇష్టం

వరుణ్ ధవన్
ముంబై: వరుణ్ ధవన్... నటించింది రెండు సినిమాల్లోనే అయినా యవతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అల్లరి పనులు చేసే చిలిపి పాత్రలంటే ఇష్టపడే ధావన్ తాను అటువంటి పాత్రలకు సరిగ్గా సరిపోతానని ‘మై తేరా హీరో’ సినిమాతో నిరూపించాడు. తాజాగా ‘హంప్టీ శర్మా కి దుల్హనియా’లో కూడా దాదాపుగా అదేరకమైన పాత్ర దక్కింది. ‘సరిగ్గా నేను ఎటువంటి పాత్రలనైతే ఇష్టపడతాను అటువంటి పాత్రల్లోనే నటించే అవకాశం వస్తోంది.

హంప్టీ శర్మా...లో నేను చురుకైన రొమాంటిక్ హీరోలా కనిపించినా ఎంతో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రమది. సాధారణ ప్రేమకథా చిత్రాలు చూసి ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. అందుకే హంప్టీ శర్మా కి దుల్హనియా ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కాస్త భిన్నంగా చూపించాలనుకున్నాం. ఈ ఏడాది ఉత్తమ ప్రేమకథా చిత్రంగా మా సినిమా నిలుస్తుందని భావిస్తున్నాన’ని చెప్పాడు. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ నటి ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నాడు.

ఆలియాతో కలిసి నటించడం భలే సరదాగా ఉంటుందని, అయితే తొలి చిత్రానికి, ప్రస్తుత చిత్రానికి ఆమెలో ఎంతో మార్పు కనిపించిందన్నాడు. మనిషిగా ఆమెలో ఏ మార్పు లేకున్నా నటిగా ఆలియాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఆమె అద్భుతంగా నటిస్తోందని, ఆమెతో కలిసి నటించడాన్ని తాను ఆస్వాధిస్తున్నానన్నాడు.

ఇక సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ... మేమిద్దరం పోటీ పడుతున్నట్లు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. సిద్ధార్థ్ సినిమా విడుదలయ్యే రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. అతను కూడా అంతే. అతను నాకు సోదరుడిలాంటివాడు. అందుకే నన్ను ఎప్పుడూ ‘మై తేరా హీరో’ అంటూ ఆటపట్టిస్తాడు. నేను అంతే ఎప్పుడూ అతణ్ని ఆటపట్టిస్తుంటాను. ఇద్దరం భలే సరదాగా ఉంటామ’న్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement