సోనాక్షీ సిన్హా, ఆలియా భట్, మాధురీ దీక్షిత్
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బహార్ బేగం, రూప్, సత్యలు వచ్చేశారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో సంజయ్‌దత్, వరుణ్ ధావన్, ఆదిత్యా కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ పీరియాడికల్ మూవీ ‘కళంక్’. 1921 నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలిసింది. గురువారం ఈ సినిమాలోని మేల్ యాక్టర్స్ లుక్స్, రోల్స్ వివరాలను వెల్లడించింది. చిత్రబృందం.
బల్‌రాజ్ చౌదరిగా సంజయ్‌దత్, జాఫర్‌గా వరుణ్ ధావన్, దేవ్‌గా ఆదిత్యాకపూర్‌లు కనిపిస్తారు. శుక్రవారం ఫిమేల్ ఆర్టిస్టుల వివరాలను తెలిపారు. బహార్ బేగం, సత్య, రూప్ పాత్రల్లో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ నటించారు. ఈ ముగ్గురివీ శక్తిమంతమైన పాత్రలని సమాచారం. ఇక్కడున్న ఈ ముగ్గురి ఫొటోలు సినిమాలోని లుక్స్‌కి సంబంధించినవే. హీరోయిన్లు కృతీ సనన్, కియారా అద్వానీలు ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలు చేశారు. దాదాపు 21ఏళ్ల తర్వాత సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన చిత్రమిది. ఇంతకుముందు మాధురి, సంజయ్ 1997లో ‘మహానతా’ అనే సినిమాలో నటించారు. ఇక తాజా చిత్రం ‘కళంక్’ ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment