మాధురీతో పోటీ | Alia Bhatt and Madhuri Dixit to perform a grand Kathak | Sakshi
Sakshi News home page

మాధురీతో పోటీ

Published Sun, Sep 9 2018 2:03 AM | Last Updated on Sun, Sep 9 2018 2:03 AM

Alia Bhatt and Madhuri Dixit to perform a grand Kathak - Sakshi

మాధురీ దీక్షిత్, ఆలియా భట్‌

ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం బల్గేరియాలో ఉన్నారు కథానాయిక ఆలియా భట్‌. ఈ షెడ్యూల్‌ కంప్లీట్‌ అవ్వగానే ఆమె ఏం చేస్తారంటే ‘కళంక్‌’ సినిమా సెట్‌లో జాయిన్‌ అవుతారు. ‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ మూవీ ‘కళంక్‌’. సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, వరుణ్‌ ధావన్, ఆదిత్యారాయ్‌ కపూర్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ పీరియాడికల్‌ మూవీలో మాధురీ దీక్షిత్, ఆలియా భట్‌ కాంబినేషన్‌లో కథక్‌ డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సాంగ్‌ ఉందట. ఆల్రెడీ పండిట్‌ బిర్జు మహారాజ్‌ వద్ద మాధురి కథక్‌ నేర్చుకున్నారు.

ఇక ఆలియా భట్‌ కూడా ఈ సాంగ్‌ కోసం ఎప్పటి నుంచో కథక్‌ నేర్చుకుంటున్నారట. అంతేకాదు సాంగ్‌ షూట్‌ టైమ్‌ దగ్గర పడుతుండటంతో రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నారట ఆలియా. ఏమైనా డౌట్స్‌ వస్తే మాధురి దగ్గర క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారట. సీనియర్‌తో ఈ పోటీలో ధీటుగా నిలవాలనుకుంటున్నారట. మరి.. ఈ సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందనేది వెండితెరపై చూడాల్సిందే. ‘కళంక్‌’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. అలాగే అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్‌ కపాడియా ముఖ్య తారలుగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్‌ పార్ట్‌ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement