
సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళంక్’. ఎన్నో అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయిన ఈ చిత్రం నిరాశపరచించి. ఈ చిత్ర వైఫల్యం గురించి వరుణ్ ధావన్ స్పందించారు. ‘‘కళంక్’ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదంటే అది బ్యాడ్ ఫిల్మ్ అని అర్థం. ఎక్కడో మా టీమ్ అందరూ ఫెయిల్ అయ్యాం. సినిమా అనేది టీమ్ అందరి కష్టం. కేవలం దర్శకుడినో, నిర్మాతనో తప్పుబట్టడం సరికాదు. టీమ్‌లో భాగమైనందుకు నేను కూడా నిందని తీసుకుంటున్నాను. ఫెయిల్యూర్‌ని మన కచ్చితంగా ప్రభావం చూపాలి. లేదంటే మనం చేస్తున్న పనిని ప్రేమతో చేస్తున్నట్టు కాదని నా ఉద్దేశం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment