మాధురీ దీక్షిత్
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఫ్లైట్‌లో వెళ్లినా రెండుగంటల టైమ్ పడుతుంది. కానీ ‘కళంక్’ టీమ్ మెంబర్స్ మాత్రం అరగంటలోపే వెళ్లగలరు. అందుకోసం దాదాపు 17 కోట్లు ఖర్చుపెట్టారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మేటర్ కంటిన్యూ చేస్తే క్లారిటీ దొరుకుతుంది. హిందీ మూవీ ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అదిత్యా రాయ్ కపూర్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘కళంక్’. ఈ నెల 18న మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ముంబైలోని ఓ స్టూడియోలో ఢిల్లీ సెట్ వేశారు. అదీ అసలు విషయం.
ఢిల్లీ వెళ్లకుండా ముంబైలోనే ఢిల్లీని చూస్తోంది ఈ యూనిట్. శుక్రవారం నుంచి మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘‘కళంక్’ సినిమా సెట్‌లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘బక్కెట్ లిస్ట్’ మూవీ తర్వాత కరణ్ జోహార్‌తో అసోసియేట్ అయిన రెండో చిత్రమిది’’ అన్నారు మాధురీ దీక్షిత్. ఆమె లీడ్ రోల్ చేసిన మరాఠి సినిమా ‘బక్కెట్ లిస్ట్’ వచ్చే నెల 25న రిలీజ్ కానుంది. అంతేకాదు మరాఠీలో ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారామె. ‘కళంక్’ సినిమాతో పాటు ‘టోటల్ ధమాల్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు మాధురీ. ‘టోటల్ ధమాల్’ ఈ ఏడాది డిసెంబర్‌లో, ‘కళంక్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment