ఆలియా అవుట్‌..జాన్వీ ఇన్‌? | Sakshi
Sakshi News home page

ఆలియా అవుట్‌..జాన్వీ ఇన్‌?

Published Sun, Jan 14 2024 2:13 PM

Bawaal Jodi Varun Dhawan And Janhvi Kapoor To Team Up For Shashank Khaitan Romantic Comedy - Sakshi

హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్‌ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.  ఈ చిత్రాలకు శశాంక్‌ కేతన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్‌ సమాచారం. వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌లను కూడా సంప్రదించారట.

అయితే వరుణ్‌ ధావన్‌ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్‌ జాన్వీ కపూర్‌కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ ఊపందుకున్నాయని టాక్‌. వేసవిలో షూటింగ్‌ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement