సంచలనం రేపిన ఫొటోషూట్ | ileana hot photoshoot | Sakshi
Sakshi News home page

సంచలనం రేపిన ఫొటోషూట్

Published Fri, Apr 11 2014 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సంచలనం రేపిన ఫొటోషూట్ - Sakshi

సంచలనం రేపిన ఫొటోషూట్

కెరీర్‌లో తప్పనిసరి కావడంతో తారలు అభిప్రాయాలను మార్చుకోవడం అత్యంత సహజం. పక్కనున్న చిత్రంలో లాగా ఇలియానా కనిపించడానికి కారణం అదే. ఎనిమిదేళ్ల పాటు దక్షిణాది సినిమాను ఓ స్థాయిలో ఏలింది ఇలియానా. కొన్ని సినిమాల్లో కాస్తంత ఘాటుగా కూడా కనిపించింది.

అయితే... టూ పీస్ బికినీ ప్రస్తావన తెస్తే మాత్రం... ‘ససేమిరా’ అనేది. ‘గ్లామర్ ఒలికించే విషయంలో నాకంటూ కొన్ని పరిధులున్నాయి. హద్దు మీరి అందాలు ఆరబోయాల్సిన అవసరం నాకు లేదు’ అని చాలా సందర్భాల్లో చెప్పింది కూడా.తన ప్రమేయం లేకుండానే కొన్ని సినిమాల్లో తనను అసభ్యంగా చూపించారంటూ ఆమె బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాంటి ఇలియానా ఇప్పుడు ఇలా... టూ పీస్ బికినీ ధరించి, ఓ భారీ ఫొటో సూట్‌లో పోజులిచ్చారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశం. బాలీవుడ్ కెరీర్ కాస్తంత ఆశాజనకంగా కనిపించడంతో తన పాత అభిప్రాయాలను అటకెక్కించేసింది ఈ గోవా భామ. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మరి. ఏది ఏమైనా సాగరతీరంలో ఇలియానా టూ పీస్ బికినీ స్టిల్స్ యువతరంలో సంచలనం రేపుతున్నాయి.
 
మరోపక్క ఈ ఫొటోషూట్ పుణ్యమా అని బాలీవుడ్‌లో ఇలియానా మరిన్ని అవకాశాలు కొట్టేయడం ఖాయమని మీడియా కోడై కూస్తోంది. గత వారమే ఇలియానా నటించిన ‘మై తేరా హీరో’ చిత్రం విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్నట్లు బాలీవుడ్ టాక్. అందులోనూ ఇలియానా గ్లామ రస్‌గా నటించారు. ఆమె పాత్రపై స్పందన సానుకూలంగా ఉంది. మరో పక్క సైఫ్ ఆలీఖాన్‌తో ‘హ్యాపీ ఎండింగ్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఏమైనా, మున్ముందు బాలీవుడ్‌లో ఇలియానా ప్రభ వెలిగిపోతుందని కొందరి భావన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement