వరుణ్‌ది కత్తిలాంటి బాడీ! | Varun Dhawan, Ileana's date with Jaipur | Sakshi
Sakshi News home page

వరుణ్‌ది కత్తిలాంటి బాడీ!

Published Mon, Apr 14 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

వరుణ్‌ది కత్తిలాంటి బాడీ!

వరుణ్‌ది కత్తిలాంటి బాడీ!

 ఎవరి గురించైనా అదే పనిగా మాట్లాడితే.. ఆ వ్యక్తి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏదో ఉన్నట్లే. అలా ఇలియానాకి హీరో వరుణ్ ధావన్ మీద ‘ఏదో’ ఉందని బాలీవుడ్‌వారు అంటున్నారు. దానికి కారణం ఇలియానా మాట్లాడుతున్న మాటలే. ఆ మధ్య ఓ సందర్భంలో వరుణ్‌లాంటి భర్త రావాలని కోరుకుంటున్నా అని ఇలియానా బహిరంగంగానే అన్నారు. ఇతగాడి సరసన ఇలియానా నటించిన ‘మై తేరా హీరో’ ఇటీవల విడుదలైంది. ఈ షూటింగ్ సమయంలో అతనితో ఇలియానా చాలా చనువుగా ఉండేవారట. అది మాత్రమే కాదు.. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా వరుణ్‌తో ఇలియానా సన్నిహితంగా మెలగడం నలుగురి కంట్లోనూ పడింది.
 
  ఆ విషయాలను పక్కన పెడితే.. తాజాగా వరుణ్ శరీరాకృతి గురించి ఇలియానా మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. వరుణ్‌ది కత్తిలాంటి బాడీ అని, తన దేహదారుఢ్యం భలే ఉంటుందని ఇలియానా అన్నారు. తనది ఎనిమిది పలకల దేహం అని, శరీరం చాలా ఫిట్‌గా ఉంటుందని కూడా వరుణ్‌ని ప్రశంసించారు. ఫిట్‌గా ఉండటం అంటే తనకు చాలా ఇష్టమని, ఎవరైనా అలా ఉంటే వాళ్లనే చూస్తుంటానని కూడా పేర్కొన్నారు ఇలియానా. రణబీర్‌కపూర్, షాహిద్‌కపూర్ కన్నా వరుణ్ చాలా ఫిట్‌గా ఉంటాడని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. అది మాత్రమే కాదు.. వరుణ్‌ది సిక్స్ ప్యాక్ బాడీ అయితే.. నాది ఫోర్ ఫ్యాక్ అంటూ తన మీద తను జోకేసుకుంది. ఈ స్థాయిలో మాట్లాడారు కాబట్టే, వరుణ్ మీద ఇలియానా మనసు పడ్డారేమో అని కొంతమంది ఊహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement