Happy Ending Movie Teaser Launch Highlights, Deets Inside - Sakshi
Sakshi News home page

Happy Ending: పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ‘హ్యాపీ ఎండింగ్ ’

Published Sat, May 13 2023 5:06 PM | Last Updated on Sat, May 13 2023 5:31 PM

Happy Ending Teaser Launch Highlights - Sakshi

యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ..  ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుందని నిర్మాత అనిల్‌ పల్లాల అన్నారు. 

(చదవండి: ఊ అంటావా మావా.. లాంటి పాటలు నేను చేయను: కృతీ శెట్టి)

 హీరో యశ్ మాట్లాడుతూ.. ‘హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. సినిమా మీద ప్రేమతోనే ఈ హ్యాపీ ఎండింగ్ తీశాం’ అన్నారు. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను అని హీరోయిన్ అపూర్వ రావు  పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మిత తమ్మారెడ్డి భరద్వాజ,  నటుడు కార్తీక్ రత్నం, హీరో తిరువీర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement