తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీయాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి | Komatireddy Venkat Reddy Launched Love Your Father Movie Teaser | Sakshi
Sakshi News home page

తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీయాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Published Mon, Jan 27 2025 3:18 AM | Last Updated on Mon, Jan 27 2025 3:24 AM

Komatireddy Venkat Reddy Launched Love Your Father Movie Teaser

కషికా కపూర్, శ్రీహర్ష, కోమటిరెడ్డి వెంకట రెడ్డి

‘‘ఎక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఆ తర్వాత టికెట్‌ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే.. తక్కువ బడ్జెట్‌లోనే మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. అలా తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్‌తో వస్తున్న ‘ఎల్‌.వై.ఎఫ్‌’ వంటి చిత్రాలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

శ్రీహర్ష, కషికా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్‌.వై.ఎఫ్‌’ (లవ్‌ యువర్‌ ఫాదర్‌). పవన్‌ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్‌ బ్యానర్లపై కిశోర్‌ రాటి, మహేష్‌ రాటి, ఎ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి రిలీజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు బాగుంటాయి. ఇలాంటి చిత్రాలే మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ‘ఎల్‌.వై.ఎఫ్‌’ కూడా అదే విధంగా విజయం సాధించాలి’’ అన్నారు. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్‌ షా, ‘షకలక’ శంకర్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్‌ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement