ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా | Ileana D'Cruz's boyfriend all set for Bollywood debut | Sakshi
Sakshi News home page

ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా

Published Thu, Jul 17 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా

ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో నటి ఇలియానా ప్రేమలో పడ్డారంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇలియానా నటిస్తున్న చిత్రాల షూటింగ్ లొకేషన్స్‌లో ఆండ్రూ కనిపించడం ఈ వార్తకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న హిందీ చిత్రాల్లో ఒకటైన ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రం లొకేషన్‌కు ఆండ్రూ తరచుగా వెళుతున్నారట. లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పుడు ఆండ్రూ దర్శనమివ్వని రోజు లేదని సమాచారం.

అంతే కాదు... ఈ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర కూడా చేశారట. చిత్రదర్శకులు డీకే కృష్ణ, రాజ్ నిడుమోరు అడగ్గానే ఆండ్రూ కాదనకుండా ఈ పాత్ర చేశారనీ, తన ప్రేయసి (?) ఇలియానాతో కలిసి ఆయన ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తారనీ భోగట్టా. కెమెరా పట్టుకుని ఫొటోలు తీయడం తప్ప కెమెరా ముందు నటించడం తెలియని ఆండ్రూకు ఇలియానా స్వయంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement