Andrew nibon
-
బ్రేకప్ గురించి మాట్లాడను
‘‘యాక్టర్స్ జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు కచ్చితంగా ఉంటుంది. నా గురించి ఏదైనా చెప్పగలను. కానీ, నా రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడలేను. రిలేషన్షిప్ అంటే నేను మాత్రమే కాదు.. నాతో పాటు ఇంకొకరు ఉంటారు. వాళ్ల గురించి నేను మాట్లాడలేను’’ అన్నారు ఇలియానా. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొన్నాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇలియానా ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి తాజాగా ఆమె స్పందిస్తూ– ‘‘రిలేషన్షిప్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఏం మాట్లాడినా అది వాళ్ల గురించి కూడా మాట్లాడినట్టే. అది వాళ్ల్ల ప్రైవసీని (గోప్యత) గౌరవించనట్టే. రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయాలు సరిగ్గా వ్యక్తపరచకపోయినా, ఆ టాపిక్‌లోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని హైలెట్ చే సినా వేరేవాళ్ల ప్రైవసీని ఇబ్బందుల్లో పెట్టినట్టే. వారి ప్రైవసీని గౌరవిస్తాను. నేను విమర్శలు తీసుకుంటున్నాను. వాళ్లను కూడా దీనికి బాధితులను చేయలేను. అందుకే నా రిలేషన్షిప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
నేను గర్భవతిని కాదు
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా. సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు. -
బాయ్‌ఫ్రెండ్ ఎందుకు భరించాలి?
హీరోయిన్ కాబట్టి నాకు తప్పదు. కానీ, అతను (బాయ్‌ఫ్రెండ్) ఎందుకు మాటలు పడాలి? ఎవరెవరో ఏదేదో అంటుంటే ఎందుకు భరించాలి? అంటున్నారు ఇలియానా. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ఎప్పట్నుంచో డేటింగ్ (సహ జీవనం) చేస్తున్నారు. ఇద్దరూ కలసి షికార్లకు వెళతారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, బాయ్‌ఫ్రెండ్ గురించి ఇలియానా ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడింది లేదు. ఎందుకలా? ఇలియానాను అడిగితే... ‘‘నటీనటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ఒక్కోసారి అంతకు రెండింతలు ద్వేషిస్తారు. ఏ కారణం లేకుండానే తిడతారు. ఏవేవో మాటలంటారు. కొన్నిసార్లు వాళ్ల మాటలు మరీ దారుణంగా ఉంటున్నాయి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇవన్నీ నాకు తెలుసు. నటిస్తున్నాను కాబట్టి నాకు తప్పదు. అతనూ మాటలు పడడం మంచిది కాదు. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను’’ అన్నారు. ఇలియానా మాట్లాడకున్నా జనాలు మాత్రం మాట్లాడుతూనే ఉంటారేమో!! -
పగ పెంచుకోవడం సరి కాదు!
ఎండ చల్లగా... వెన్నెల వేడిగా.. తీపి కారంగా.. పులుపు చేదుగా... ఇలా లవర్ చెంత ఉన్నప్పుడు ఏదీ దానిలా అనిపించదు.. కనిపించదు. ప్రేమ మహత్యం అది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అని లవ్‌లో ఉన్నప్పుడు బోల్డన్ని ఊసులు చెప్పుకుంటారు. ఒకవేళ బ్రేకప్ అయ్యారా? ఒకరి గురించి మరొకరు వీలైనన్ని విమర్శలు చేసేస్తారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. బ్రేకప్ అయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఒకర్నొకరు నిందించుకోరు. ఇలియానా ఈ టైపే. ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇల్లీ బేబీకి ఇది ఫస్ట్ లవ్ కాదు. అంతకుముందే లవ్‌లో పడ్డారు. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ - ‘‘ఇన్నిసార్లు ప్రేమలో పడ్డానని లెక్కేసి చెప్పలేను కానీ, గతంలో నేనూ ప్రేమలో పడ్డాను. ఏవో మనస్పర్ధల కారణంగా విడిపోయాం. కానీ, ‘ఇక నుంచి నీ జీవితం బాగుండాలని’ తనూ, అతని జీవితం బాగుండాలని నేనూ చెప్పుకుని మరీ విడిపోయాం. అంతే కానీ, పగ పెంచుకోలేదు. ఏదో రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. అఫ్కోర్స్ మాజీ లవర్స్‌తో నేను స్నేహంగా ఉండటంలేదు. అయితే శత్రుత్వం మాత్రం పెంచుకోలేదు’’ అన్నారు. -
నను వలచిన మొనగాడు!
గోవా ముద్దుగుమ్మ ఇలియానా జతగాడి ప్రేమ కోసం బోర్డర్నే క్రాస్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఎవరూ బహుశా అమ్మడి కంటికి ఆనలేదేమో... ఏకంగా ఆస్ట్రేలియా అందగాడు అండ్రూ నీబోన్పై మనసు పారేసుకుంది. నను వలచిన మొనగాడు... ఆస్ట్రేలియా చిన్నోడంటూ ఖుషీఖుషీగా అతగాడితో చక్కర్లు కొట్టేస్తుందట. వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్‌కు కూడా వెళ్లి వస్తోందనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. అండ్రూతో బాగా క్లోజ్‌గా... ఎంతో ఇదిగా దిగిన ఫొటోలను సామాజిక సైట్లో అప్లోడ్ చేసింది. ఇప్పుడివి నెట్టంతా పాకేశాయి. అండ్రూ, ఇలియానాల మధ్య బోర్డర్‌ను చెరిపేసిన బంధం గురించి రకరకాలుగా కథనాలు అల్లేసుకొంటున్నారు. కొన్ని వెబ్‌సైట్లయితే సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పేస్తున్నాయి. కానీ ఇలియానా సహజంగానే... అండ్రూ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ సింపుల్‌గా సైడైపోతోంది! -
ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో నటి ఇలియానా ప్రేమలో పడ్డారంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇలియానా నటిస్తున్న చిత్రాల షూటింగ్ లొకేషన్స్‌లో ఆండ్రూ కనిపించడం ఈ వార్తకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న హిందీ చిత్రాల్లో ఒకటైన ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రం లొకేషన్‌కు ఆండ్రూ తరచుగా వెళుతున్నారట. లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పుడు ఆండ్రూ దర్శనమివ్వని రోజు లేదని సమాచారం. అంతే కాదు... ఈ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర కూడా చేశారట. చిత్రదర్శకులు డీకే కృష్ణ, రాజ్ నిడుమోరు అడగ్గానే ఆండ్రూ కాదనకుండా ఈ పాత్ర చేశారనీ, తన ప్రేయసి (?) ఇలియానాతో కలిసి ఆయన ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తారనీ భోగట్టా. కెమెరా పట్టుకుని ఫొటోలు తీయడం తప్ప కెమెరా ముందు నటించడం తెలియని ఆండ్రూకు ఇలియానా స్వయంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.