పగ పెంచుకోవడం సరి కాదు! | Ileana D'Cruz on break ups, love and more | Sakshi
Sakshi News home page

పగ పెంచుకోవడం సరి కాదు!

Published Thu, Aug 4 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

పగ పెంచుకోవడం సరి కాదు!

పగ పెంచుకోవడం సరి కాదు!

ఎండ చల్లగా... వెన్నెల వేడిగా.. తీపి కారంగా.. పులుపు చేదుగా... ఇలా లవర్ చెంత ఉన్నప్పుడు ఏదీ దానిలా అనిపించదు.. కనిపించదు. ప్రేమ మహత్యం అది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అని లవ్‌లో ఉన్నప్పుడు బోల్డన్ని ఊసులు చెప్పుకుంటారు. ఒకవేళ బ్రేకప్ అయ్యారా? ఒకరి గురించి మరొకరు వీలైనన్ని విమర్శలు చేసేస్తారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. బ్రేకప్ అయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఒకర్నొకరు నిందించుకోరు. ఇలియానా ఈ టైపే. ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే.

ఇల్లీ బేబీకి ఇది ఫస్ట్ లవ్ కాదు. అంతకుముందే లవ్‌లో పడ్డారు. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ - ‘‘ఇన్నిసార్లు ప్రేమలో పడ్డానని లెక్కేసి చెప్పలేను కానీ, గతంలో నేనూ ప్రేమలో పడ్డాను. ఏవో మనస్పర్ధల కారణంగా విడిపోయాం. కానీ, ‘ఇక నుంచి నీ జీవితం బాగుండాలని’ తనూ, అతని జీవితం బాగుండాలని నేనూ చెప్పుకుని మరీ విడిపోయాం. అంతే కానీ, పగ పెంచుకోలేదు. ఏదో రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. అఫ్‌కోర్స్ మాజీ లవర్స్‌తో నేను స్నేహంగా ఉండటంలేదు. అయితే శత్రుత్వం మాత్రం పెంచుకోలేదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement