ఆండ్రూ నీబోన్, ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా.
సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు.
Comments
Please login to add a commentAdd a comment