నను వలచిన మొనగాడు!
గోవా ముద్దుగుమ్మ ఇలియానా జతగాడి ప్రేమ కోసం బోర్డర్‌నే క్రాస్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఎవరూ బహుశా అమ్మడి కంటికి ఆనలేదేమో... ఏకంగా ఆస్ట్రేలియా అందగాడు అండ్రూ నీబోన్‌పై మనసు పారేసుకుంది. నను వలచిన మొనగాడు... ఆస్ట్రేలియా చిన్నోడంటూ ఖుషీఖుషీగా అతగాడితో చక్కర్లు కొట్టేస్తుందట. వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్‌కు కూడా వెళ్లి వస్తోందనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. అండ్రూతో బాగా క్లోజ్‌గా... ఎంతో ఇదిగా దిగిన ఫొటోలను సామాజిక సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఇప్పుడివి నెట్టంతా పాకేశాయి. అండ్రూ, ఇలియానాల మధ్య బోర్డర్‌ను చెరిపేసిన బంధం గురించి రకరకాలుగా కథనాలు అల్లేసుకొంటున్నారు. కొన్ని వెబ్‌సైట్లయితే సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పేస్తున్నాయి. కానీ ఇలియానా సహజంగానే... అండ్రూ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ సింపుల్‌గా సైడైపోతోంది!