ఆ ఉంగరం వెనుక సీక్రెట్! | Ileana D'Cruz ' 'ring picture' sparks engagement speculation | Sakshi
Sakshi News home page

ఆ ఉంగరం వెనుక సీక్రెట్!

Published Thu, Oct 1 2015 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ ఉంగరం వెనుక సీక్రెట్! - Sakshi

ఆ ఉంగరం వెనుక సీక్రెట్!

నాజూకు నడుము ఇలియానా ఎంగేజ్‌మెంట్ రహస్యంగా అయిపోయిందా?... ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న వార్త ఇది. ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఇలియానా వేలికి మెరుస్తున్న ఓ ఉంగరమే ఈ చర్చలకు కారణమైంది. ఆ ఉంగరానికి ఉన్న స్టోన్ తళుకులు చూస్తుంటే, ఖరీదైన వజ్రంలా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఇలియానా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం అయ్యుంటుందనే ఊహాగానాలు ఉన్నాయి.
 
 ఇటీవల ఓ ముంబై విలేకరి ఈ ఉంగరం వెనక ఉన్న కథను బయటకు లాగుదామని ప్రయత్నించగా, ఇలియానా చాలా తెలివిగా తప్పించుకున్నారట. ‘మీ వేలికి ఉన్న ఉంగరం గురించి చెబుతారా?’ అని ఆ విలేకరి అడిగితే, ‘ఉంగరం గురించా? చాలా బ్యుటిఫుల్‌గా ఉంది’ అని అందరూ అంటున్నారని ఇలియానా అన్నారట. ఆ సమాధానానికి ఎలా రియాక్ట్ కావాలో ఆ విలేకరికి అర్థం అయ్యుండదని ఊహించవచ్చు. ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని ఇలియానా ఇన్‌డెరైక్ట్‌గా ఇలా తెలివిగా సమాధానం చెప్పి ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement