మేకప్ లేకుండానే | ileana d'cruz act with Without make-up | Sakshi
Sakshi News home page

మేకప్ లేకుండానే

Published Tue, Nov 25 2014 3:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మేకప్ లేకుండానే - Sakshi

మేకప్ లేకుండానే

ఈ మధ్య కథానాయికల్లో చాలా మార్పు కనిపిస్తోంది. మేకప్ లేకుండా మాములుగా అడుగు బయట పెట్టడానికి సాహసించని ఈ బ్యూటీస్ ఇప్పుడు మేకప్ లేకుండా ఏకంగా తెరపైనే కనిపించాలనుకుంటున్నారు. ఇలాగైనా సహజత్వానికి దగ్గరగా ఉండే మంచి కథా బలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. ఇటీవల నటి సమంత కమర్షియల్ చిత్రాల్లో నటించి బోర్ కొట్టిందని యథార్థ కథా చిత్రాల్లో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. తాజాగా నటి ఇలియానా మేకప్ లేకుండా నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం విశేషం.

మొన్నటి వరకు దక్షిణాది సినీ పరశ్రమను ఏలి తన అందాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ కోసం మరింత బక్క చిక్కిన ఈ భామ, తన నాజూకైన అందాలతో అక్కడి కథనాయకుల్ని ఆకర్షిస్తున్నారు. అలాంటిది మేకప్ లేకుండా ఈమె నటనా ప్రతిభకు ముగ్ధులవుతారా? అయితే ఇలియానా ఈ విషయంలో డోంట్ ఫియర్ అంటున్నారు.  మే తేరా హీరో చిత్రంలో హాస్య ప్రాతలో నటించానని ఇలియాన తెలిపారు. అయితే హాస్యం పండించడం అంత సులభం కాదని అనుభవ పూర్వకంగా గ్రహించానన్నారు.

ఇటీవల విడుదలైన హ్యాపీ ఎండింగ్ చిత్రంలోను ఇంతకుముందు నటించని వైవిధ్య పాత్రను పోషించానని చెప్పారు. ఇకపై కమర్షియల్ చిత్రాల్లో మాత్రమే నటించాలనుకోవడం లేదన్నారు. హైవే చిత్రంలో అలియూభట్ మేకప్ లేకుండానే నటించి మెప్పించారన్నారు. ఆ చిత్రం చూసిన తర్వాత తాను కూడా మేకప్ లేకుండానే నటించాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. మేకప్ లేకుంటే ముఖం ఎలా ఉంటుందో తెలిసినా భ యపడనన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే ఆసక్తిగా నటిస్తానని ఇలియానా అంటున్నారు. అరుుతే చూడటానికి ఆమె అభిమానులు సిద్ధంగా ఉండాలిగా. చూద్దాం ఇలియానా కోరిక తీర్చడానికి ఏ దర్శక నిర్మాత ముందుకొస్తారో.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement