దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన | ileana d'cruz Focus on bollywood movies | Sakshi
Sakshi News home page

దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన

Published Mon, Feb 16 2015 2:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన - Sakshi

దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన

ఇలియాన నీ ఇడుపు మాట అంటూ యువత ఈల పాట పాడుకునేంత  ప్రాచుర్యం పొందిన నటి ఇలియాన. ఇంతకుముందు దక్షిణాదిలో ఏలిన ఈ గోవా సుందరి  ఇప్పుడు ఉత్తరాదిలో నాయకిగా బలపడాలని ఆశపడుతున్నారు. దక్షిణాదిలో పలు విజయాలను  సొంతం చేసుకున్న ఇలియాన అక్కడ అపజయాలను ఎదుర్కొని జయాల కోసం పోరాడుతున్నారు.  దీంతో మళ్లీ దక్షిణాదిపై తిరిగి దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.  ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈ క్రేజీ నాయకితో చిన్న భేటీ....
 
 ప్రశ్న : మీ జీవితం ఊహించని స్థాయిలో నడుస్తోందా?
 జవాబు: అంతకంటే బ్రహ్మాండంగా సాగుతోంది.
 
 ప్రశ్న: జయాపజయాలను ఎలా తీసుకుంటారు?
 జవాబు: జీవితంలో ఆ రెండే అలక్ష్యం చేయలేనివి. విజయం బాధను పోగొడుతుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. బాలీవుడ్‌లో బర్ఫీ చిత్రం నాకలాంటి ఆనందాన్ని అందించింది. ఆ తరువాత చేసిన చిత్రం కొంచెం నిరాశపరచింది. తాజా చిత్రం విజయాన్ని అందిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నా.
 
 ప్రశ్న: మీ సహ నటీమణుల్లో ఎవరిని పోటీగా భావిస్తున్నారు?
 జవాబు: ఎవరిని పోటీగా భావించడం నా కిష్టం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంటుంది. విజయాలు వరిస్తుంటాయి.
 
 ప్రశ్న : ఎవరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు?
 జవాబు: ఒక నటిగా దర్శకులదరితోనూ పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాలోని ప్రతిభను వెలికి తీయగల దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాను.
 
 ప్రశ్న: ప్రేమ విషయంలో మీ అభిప్రాయం?
 జవాబు: ప్రేమ అనేది జీవితంలో ఒక అంగం.  నిజమైన ప్రేమను పొందడం కష్టం. ఒకవేళ అలాంటి ప్రేమ లభించినా, దానిని నిలుపుకోవడం అంతకంటే కష్టం. ఏదేమైనా ప్రేమ, పెళ్లి ఈ రెండింటిపైనా నాకు నమ్మకం.
 
 ప్రశ్న: వివాహ జీవితం సహజీవనం ఈ రెండు విధానాలపై మీ అభిప్రాయం?
 జవాబు: ఇది ఇద్దరు జీవితాలకు సంబంధించిన అంశాలు. వివాహ జీవితంలో పలు అనుబంధాలను కాపాడుకోవాల్సిన నిర్బంధం ఉంటుంది. సహజీవనం (లీవ్ ఇన్ రిలేషన్ షిప్) అలాంటిది కాదు. ఇది ఇద్దరు చేసుకునే ఒప్పందం. ఈ తరహా జీవితంలో ఎప్పుడైనా విడిపోవచ్చు. వివాహ జీవితంలో అలా కుదరదు. ఒక్కమాటలో చెప్పాలంటే వివాహ జీవితం ఫ్లైట్ యానం లాంటిది. సహ జీవనం రైలు ప్రయాణం లాంటిది.
 
 ప్రశ్న: భవిష్యత్తులో ఎలా జీవించాలనుకుంటున్నారు?
 జవాబు: నేను 18 ఏళ్ల వయసులోనే నటినయ్యా ను. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement