ఆ విషయాన్ని మాత్రం భరించలేను... | Ileana DCruz on Struggle to Accept Body Type and Felt Fat When I Was Skinny | Sakshi
Sakshi News home page

ఆ విషయాన్ని మాత్రం భరించలేను...

Published Sat, Jun 4 2016 4:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆ విషయాన్ని మాత్రం భరించలేను... - Sakshi

ఆ విషయాన్ని మాత్రం భరించలేను...

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన సొగసరి ఇలియానా. హీరోయిన్ గా వెండితెరపై నాజూకుగా కనిపించేందుకు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. బర్ఫీ, హ్యాపీ ఎండింగ్, మై తేరా హీరో, మరికొన్ని బాలీవుడ్ మూవీలలో నటించి హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన రుస్తుమ్ లో నటిస్తుంది. జీరో సైజ్ అంటూ హీరోయిన్లు చాలా మంది గతంలో బాడీని ఆ ఆకృతిలో మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. అందుకు కారణం ఇల్లీ బేబీనే అని కూడా భావించవచ్చు.

ఎందుకంటే నాజూకు నడుముతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది ఈ గోవా సుందరి. ఒకానొక సమయంలో తాను కాస్త లావుగా ఉండేదాన్నని, చాలా రోజులు బాడీ సమస్యను ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇప్పటికీ చాలా లావుగా ఉన్నాట్లే భావిస్తానని, ఎందుకుంటే తాను అందరిలా కాదని అభిప్రాయపడింది. కాస్త బరువు పెరిగినా, ఓ మై గాడ్.. నేను ఇంత లావుగా ఉన్నానా? అని ఆందోళన చెందుతానని చెప్పుకొచ్చింది. ఓ ఫొటోను తన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన బరువు, నడుము గురించి కొన్ని విషయాలు చెప్పింది.

ఒకవేళ తాను బయటికి వెళ్లినప్పుడు అద్దంలో చూసుకుంటే సాధారణ అమ్మాయి లాగ కనిపిస్తే చాలు, తన అందంపై ఎన్నో కామెంట్లు వస్తాయంటోంది. అయినా కూడా తాను ఎందుకు ఫొటోలలో చాలా స్పెషల్ గా కనిపించాలి, అంత అవసరం లేదని మనసుకు సమాధానం చెప్పుకుంటానంది. మోడల్స్ శరీరాకృతి వేరు హీరోయిన్ల స్టైల్ వేరని, ఎవరికి నచ్చిన తరహాలో వారు ఉండాలనుకుంటారని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement