Boyfriend Andrew nibon
-
ప్రేమతో పిజ్జా!
.. చేసిపెట్టారట అందాల ముద్దుగుమ్మ ఇలియానా. ఎవరికోసమో తెలుసా? ఇంకెవరి కోసం ప్రియుడు ఆండ్రూ కోసం. ప్రియురాలు చేసి పెట్టిన పిజ్జాని ఆండ్రూ ప్రేమగా ఆరగించారట. అది చూసి ఈ గోవా బ్యూటీ తెగ మురిసిపోతున్నారు. ఇటీవల హిందీ చిత్రాలు ‘ముబారకాన్, బాద్షాహో’ చిత్రాల్లో నటించిన ఇలియానా కొంత రిలాక్సేషన్ కోరుకున్నారు. అంతే.. ఆండ్రూతో హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. ముంబై తిరిగొచ్చాక.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇలియానాను ‘మీకు వంట వచ్చా?’ అని ఓ జర్నలిస్ట్ అడిగితే – ‘‘నేనెంత బాగా తింటానో అంతే బాగా వండుతాను. నేను చేసే పిజ్జా అంటే ఆండ్రూకి చాలా ఇష్టం. కుక్కీస్ కూడా బాగా చేస్తాను. రీసెంట్గా యాపిల్ చిప్స్ చేశాను. అవి నా ఫేవరెట్. ఆండ్రూ కూడా వంట చాలా బాగా చేస్తాడు. అతనిదో డిఫరెంట్ స్టైల్. నేను వంట చేయడాన్ని మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. రిలాక్స్ అవ్వడానికి వంట చేయడం ఓ మంచి అలవాటు. బయట పుడ్ ఆర్డర్ చేసుకుని తినడానికి అలవాటు పడినవాళ్లు ఓసారి ఇంట్లో వంట ట్రై చేసి చూడండి. వండటంలో మజా ఏంటో తెలుస్తుంది’’ అన్నారు ఇలియానా. అంతా బాగానే ఉంది. మీకు వంట వచ్చా? అనడిగితే... ఆండ్రూ కూడా వండుతాడని చెప్పడం హైలైట్ అయింది. అడగకపోయినా ఆండ్రూ గురించి మాట్లాడుతున్నారంటే.. అతని గురించి మాట్లాడటం ఇలియానాకు ఆనందంగా ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ మధ్యే ఆండ్రూని ‘బెటరాఫ్’ అని ఇలియానా పేర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది. -
అప్పట్లో తప్పులు చేశా... ఇప్పుడు చేయను!
అవునా! ఇలియానా తప్పులు చేశారా? అవేంటో అనుకుంటున్నారా? ఇలియానా మాటల్లోనే చెప్పాలంటే.... ‘‘గతంలో స్క్రిప్ట్ గురించి, అందులో నా పాత్రకున్న ప్రాముఖ్యత గురించి ఆలోచించకుండా కొన్ని తెలుగు, తమిళ సినిమాలు చేశా. అప్పట్లో నా తెలివితేటలను సరిగ్గా ఉపయోగించలేదేమో అనిపిస్తోంది. అవాయిడ్ చేయాల్సిన కొన్ని సిన్మాలను చేయలేదని ఫీలవుతున్నా. ఇకపై అటువంటి తప్పులు చేయను’’. అదీ సంగతి! ఇప్పట్నుంచి స్క్రిప్టులో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేయాలని ఇలియానా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట! ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క హిందీ సినిమా... అజయ్ దేవగన్ ‘రైడ్’ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే... వారం నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నారీ బ్యూటీ. అందులో బాయ్‌ఫ్రెండ్ ఆండ్యూ నీబోన్కి ముద్దుపెడుతున్న ఫొటోకి ‘ఎ మూమెంట్. ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ మ్యాడ్నెస్’ అని కోట్ చేయడం స్పెషల్. ఆండ్రూ, ఇలియానాలది అంత ప్రేమ పిచ్చి అనుకోవాలేమో!! -
ఆ ఉంగరం వెనుక సీక్రెట్!
నాజూకు నడుము ఇలియానా ఎంగేజ్మెంట్ రహస్యంగా అయిపోయిందా?... ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న వార్త ఇది. ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఇలియానా వేలికి మెరుస్తున్న ఓ ఉంగరమే ఈ చర్చలకు కారణమైంది. ఆ ఉంగరానికి ఉన్న స్టోన్ తళుకులు చూస్తుంటే, ఖరీదైన వజ్రంలా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఇలియానా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం అయ్యుంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల ఓ ముంబై విలేకరి ఈ ఉంగరం వెనక ఉన్న కథను బయటకు లాగుదామని ప్రయత్నించగా, ఇలియానా చాలా తెలివిగా తప్పించుకున్నారట. ‘మీ వేలికి ఉన్న ఉంగరం గురించి చెబుతారా?’ అని ఆ విలేకరి అడిగితే, ‘ఉంగరం గురించా? చాలా బ్యుటిఫుల్గా ఉంది’ అని అందరూ అంటున్నారని ఇలియానా అన్నారట. ఆ సమాధానానికి ఎలా రియాక్ట్ కావాలో ఆ విలేకరికి అర్థం అయ్యుండదని ఊహించవచ్చు. ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని ఇలియానా ఇన్‌డెరైక్ట్‌గా ఇలా తెలివిగా సమాధానం చెప్పి ఉంటారు.