అవునా! ఇలియానా తప్పులు చేశారా? అవేంటో అనుకుంటున్నారా? ఇలియానా మాటల్లోనే చెప్పాలంటే.... ‘‘గతంలో స్క్రిప్ట్ గురించి, అందులో నా పాత్రకున్న ప్రాముఖ్యత గురించి ఆలోచించకుండా కొన్ని తెలుగు, తమిళ సినిమాలు చేశా. అప్పట్లో నా తెలివితేటలను సరిగ్గా ఉపయోగించలేదేమో అనిపిస్తోంది. అవాయిడ్ చేయాల్సిన కొన్ని సిన్మాలను చేయలేదని ఫీలవుతున్నా.
ఇకపై అటువంటి తప్పులు చేయను’’. అదీ సంగతి! ఇప్పట్నుంచి స్క్రిప్టులో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేయాలని ఇలియానా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట! ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క హిందీ సినిమా... అజయ్ దేవగన్ ‘రైడ్’ ఉంది.
సినిమాల సంగతి పక్కన పెడితే... వారం నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నారీ బ్యూటీ. అందులో బాయ్‌ఫ్రెండ్ ఆండ్యూ నీబోన్‌కి ముద్దుపెడుతున్న ఫొటోకి ‘ఎ మూమెంట్. ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ అని కోట్ చేయడం స్పెషల్. ఆండ్రూ, ఇలియానాలది అంత ప్రేమ పిచ్చి అనుకోవాలేమో!!
అప్పట్లో తప్పులు చేశా... ఇప్పుడు చేయను!
Published Mon, Sep 25 2017 12:06 AM | Last Updated on Mon, Sep 25 2017 1:45 AM
Advertisement
Advertisement