Constipation
-
మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!
మలబద్ధకం ఉన్నవారికి అది చాలా బాధాకరమైన సమస్యే అయినప్పటికీ... నిజానికి వారికి అదొక్కటే కాకుండా, దాని నుంచి వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. అందుకే ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే చాలా రకాల ఆరోగ్య అనర్థాల నుంచి కాపాడుకోవచ్చు. అందుకే దీని నివారణ అంటే చాలా రకాల జబ్బుల నివారణ అని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం నివారణకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పీచుపదార్థాలు (ఫైబర్) మలబద్ధకాన్ని సమర్థంగా నివారిస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోనూ పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితో పాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. చిక్కుళ్లలో ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతో పాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఇక పండ్ల విషయానికి వస్తే... పీచు ఎక్కువగా ఉండే బొ΄్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. చక్కెర మోతాదులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే పండ్లను డాక్టర్లు డయాబెటిస్ బాధితులకు తినమంటూ సూచిస్తారు. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మంచిది. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల)కు తగ్గకుండా నీళ్లు తాగడం మంచిది. మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితోపాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. -
మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం
మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. మలబద్దకం రకాలు, కారణాలుఅందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది. ఎపుడు అప్రమత్తం కావాలి?జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.మలబద్దకం-నివారణ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.పుష్కలంగా నీరు తాగాలి. ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది. -
ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..?
ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఖర్జూరం తీసుకుంటే మలబద్దకం వస్తుందా?. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉందా?. అంటే ఔననే చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రీజన్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మలబద్ధకం అనేది సాధారణ సమ్య. దీనిని సరైన ఆహారం, జీవనశైలితో సర్దుబాటు చేయవచ్చు. సహజ చక్కెరలకు, ఖనిజాలకు అద్భుతమైన ఈ ఖర్జూరం మలబద్ధకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. దీనిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి..మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీర్ణం కావడం కష్టమవుతుంది. శరీరం లోపల అగ్నిని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాకాకుండా వాటిమీద మక్కువకొద్ది లాగిస్తే సమస్యలు తప్పవని చెబుతున్నారు నిఫుణలు.ఎలా తీసుకుంటే బెటర్..నానాబెట్టిన ఖర్జూరాలు బరువు తగ్గించేందుకు, జీర్ణక్రియకు మంచిది. ఖర్జూరాలు తినే ముందు ఎండు అల్లం పొడిన జోడించండి. పొడి అల్లం లేదా సాంత్ ఆహారాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అత్తిపండ్లతో కూడిన 'ఖజురాధి మంథా'ని తయారు చేయడానికి ఒక కూలింగ్ డ్రింక్ సిద్ధం చేయండి. ఈ రిఫ్రెష్ డ్రింక్ జీర్ణ సమస్యలను నివారించి, హైడ్రేట్‌గా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందాలంటే రోజుకు మూడు ఖర్జూరాలను స్నాక్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యానికి కూడా మంచిందని చెబుతున్నారు. (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగనీటిని ట్రై చేయండి..!) -
మలబద్దకం.. లైట్ తీసుకుంటే బోలెడన్ని సమస్యలు
చాలామంది పైకి చెప్పుకోలేరు కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, దానిని అసలు ఒక సమస్యగా కూడా గుర్తించకపోవడం! మలబద్ధకాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మాత్రం శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల మలబద్ధకం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. అందువల్ల రోజువారీ మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకంతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, తగినన్ని నీరు తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వంటి కారణాల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలం ఉంటే.. కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి ఎన్నో చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి. మీ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఆహారంలో మెంతులు మలబద్ధకం సమస్య ఉంటే.. చెంచాడు మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి లేదంటే పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తాగడం వల్ల తెల్లారేసరికి సుఖ విరేచనం అవుతుంది. పండ్లు, కూరగాయలు ఉదయానే టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం మీకు ఇష్టమైన కూరగాయలతో చేసిన గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉంటారు. బచ్చలికూర, టొమాటో, బీట్రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తాజాపండ్లు ముఖ్యంగా బొప్పాయి పండు తినడం మంచిది. సబ్జానీళ్లు మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం నానబెట్టిన సబ్జా గింజలను చెంచాడు ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్, ఎండు ద్రాక్షలను తీసుకున్నా మంచిది. అంజీర్ అంజీర్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీర్ పేగు కదలికలను సులభతరం చేస్తుంది. బొప్పాయి ప్రతి రోజూ ఉదయం 11 గంటల ప్రాంతంలో, భోజనానికి ముందు కప్పుడు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది. అలాగే జామపండు ముక్కలు, దోసబద్దలు తీసుకున్నా మంచిదే. భోజనానికి అరగంట ముందు గ్లాసు మజ్జిగ, అర స్పూన్ అవిసెగింజలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఓట్స్ ఓట్స్‌లో బీటా–గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్ పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. నెయ్యి నెయ్యికి ఉండే.. సహజమైన జిడ్డు తత్త్వం పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది. రోజూ ఆహారంలో నెయ్యి వేసుకని తింటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు. జామపండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్లు మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటాయి కాబట్టి అవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిది. -
మలబద్దకానికి ఇలా చెక్ పెట్టండి!
మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఫిజికల్ ఇన్ ఆక్టివిటీ ఇలా మొదలైన కారణాల వల్ల కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. దీనికి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లేదు. తాజాగా ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని సైంటిస్టులు తేల్చారు. ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది అమెరికన్లు మలబ్దకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రోజువారి బిజీలైఫ్‌లో సరైన లైఫ్‌స్టైల్ అనుసరించకపోవడం ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే మలబద్దకం వల్ల సమస్య తీవ్రమైన గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. తాజాగా జియాంగ్నాన్,హైనాన్తో పాటు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మలబద్దకానికి సరైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని తేల్చారు.ప్రోబయోటిక్స్ జీర్ణాశయంలోని ప్రయోజనకరమైన బాక్టీరియా. ఇది గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపర్చడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియాలోని Bలాంగమ్లోని కొన్ని జన్యువులు, abfA జన్యు సమూహాన్ని కలిగి ఉన్నాయని ఇది ప్రేగు కదలికలను పెంచి డైజెస్టిన్ హెల్త్‌కి సహాయపడుతుందని పేర్కొన్నారు. బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ రీసెర్చ్ కోసం మలబద్ధకం ఉన్న ఎలుకలకు abfA క్లస్టర్ లేకుండా B.లాంగమ్ ఇచ్చినప్పుడు, ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీన్ని బట్టి abfA క్లస్టర్ మలబద్దకానికి చికిత్సకు కీలకమని కనుగొన్నారు. -
మలబద్దకం నివారణ మార్గాలు ఇవే.!
-
మలబద్ధకమా! కాయం చూర్ణ ఇక గ్రాన్యూల్స్ రూపంలో
హైదరాబాద్: మలబద్ధకానికి ఔషధంగా గత 50 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న తమ ప్రతిష్టాత్మక ‘కాయం చూర్ణ’ ఇక గ్రాన్యూల్స్ (గుళికలు లేదా పలుకులు) రూపంలోనూ అందుబాటులోనికి రానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ అడ్వాన్స్డ్ ఫార్ములా వల్ల చూర్ణ గొంతులో అతుక్కుపోవడం, అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయని భావ్‌నగర్ కేంద్రంగా ఈ ఉత్పత్తిలో ఉన్న సేథ్ బ్రదర్స్ సంస్థ వివరించింది. జీలకర్ర రుచితో ఉండే ఈ కొత్త ప్రొడక్ట్ కడుపును శుద్ధి చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటన పేర్కొంటూ.. ఆముదం, గులాబీ ఆకుల మేళవింపుతో ప్రొడక్ట్ రూపొందడం దీనికి కారణమని వివరించింది. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
Health: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే..
Health Tips In Telugu- Constipation (Malabaddakam): మలబద్ధకం అన్నది ఉదయాన్నే చాలామందిని బాధపెడుతుంది. సాఫీగా విరేచనం జరగకపోతే పొద్దున్నే లేచింది మొదలు రోజంతా ఇబ్బందికరంగానే గడుస్తుంది. అయితే మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటుంటే మల బద్ధకం సమస్య చాలా సులువుగానే దూరమవుతుంది. అయితే ఈ మార్గాలతో కేవలం మలబద్ధకం నివారణ మాత్రమే కాకుండా అనేక అదనపు ప్రయోజనాలూ ఒనగూరతాయి. జీర్ణాశయం మార్గం శుభ్రంగా పీచు మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య దరిచేరదన్న విషయం తెలిసిందే. ఆ ఆహారాలు కేవలం మలబద్ధకాన్ని నివారించడం మాత్రమే కాదు... పూర్తి జీర్ణాశయం మార్గాన్నీ శుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం భోజనంలో ఎక్కువమొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి. చక్కెర మోతాదులు నియంత్రణలో వీటితో పాటు పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. వీటితో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే... అవి తేలిగ్గా విరేచనమయ్యేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెర మోతాదుల్ని నియంత్రణలో ఉంచడానికీ తోడ్పడతాయి. సలాడ్స్ రూపంలో.. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ దోహదపడతాయి. అలాగే వాటిలోని పీచుపదార్థాలూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. క్యారట్, బీట్రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి అవి కూరలుగా అంతగా నచ్చకపోవచ్చు. అలాంటివారు సలాడ్స్ రూపంలో లేదా సూప్‌గానూ తీసుకోవచ్చు. చర్మ నిగారింపునకై పీచుపదార్థాలుండే ఆహారాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ మార్గమూ శుభ్రపడుతుంది. దేహం హైడ్రేటెడ్‌గానూ ఉంటుంది. ఫలితంగా మలబద్ధక నివారణే కాదు చర్మానికి మంచి నిగారింపుతో కూడిన మెరుపును ఇవ్వడంతో పాటు మరెన్నో జబ్బుల నివారణకూ ఈ అంశం తోడ్పడుతుంది మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇక్కడ పేర్కొన్న మార్గాలు కేవలం మలబద్ధకం నివారణ కోసం మాత్రమే కాకుండా... దాదాపు ప్రతి ఒక్కటి మన వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థలోని పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌ను) రక్తంలోకి ఆలస్యంగా వెలువడేలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం, మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం వంటి పనులూ చేస్తాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. -
Health: పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? ఉడికించిన పప్పు తింటే
Health Tips In Telugu: మన జీవన శైలి సరిగా లేకపోవడం వలన వచ్చే అనారోగ్యమే మలబద్ధకం. నిజం చెప్పాలంటే దీనికి మందు లేదు. కానీ పరిష్కారాలున్నాయి. మలబద్దకం నివారణ- పరిష్కారాలు 1. రోజూ అరగంట నుంచి గంట పాటు మంచి వ్యాయామము చేయండి. 2. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. 3. దుంప కూరలు, వేపుడు కూరలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్‌లు పూర్తిగా పక్కన పెట్టండి. తేలికగా జీర్ణమయ్యే భోజనం తినండి. ఉడికించిన పప్పు కూడా తినవచ్చు. 4.ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, మంచినీరు తక్కువ తాగడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి గల జీవన శైలి, థైరాయిడ్, కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల మందులు అతిగా వాడడం వల్ల మలబద్ధకం వస్తుంది. 5. ఆహారం లో పండ్లు, కూరగాయలు చేర్చుకోవడం. కూరలు, తాజా పళ్ళు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే వ్యాయామము ఎంత చేస్తే అంత త్వరగా మల బద్దకం నుంచి బయటపడతారు. 6. నీళ్లు కూడా బాగా తాగండి. రోజూ 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తీసుకోవడం మంచిది. 7. ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చేసే పనులు ప్రశాంతంగా, నిదానంగా చేయండి. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాలనుకోవడం, ఏదీ సరిగా చేయలేకపోతే ఒత్తిడికి గురికావడం లాంటి వాటికి దూరంగా ఉండండి. 9. ఏవైనా ఇతరత్రా వ్యాధులు ఎక్కువ రోజులు ఉన్నట్టయితే మీ సమస్యను డాక్టర్లు తో చర్చించండి. ఒక దానికొకటి తోడయినట్టు సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి? 1. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఆపిల్ తినండి. 2. తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ సముద్రపు ఉప్పు కలిపి తాగండి. ఒక అరగంటలో మోషన్స్ అవుతాయి. అసలు వద్దు మీ సమస్యని బట్టి నెలకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే చేయండి. అంతకు మించి పాటించరాదు. మీకు వీలుంటే ఒక 15 రోజులు మంచి ప్రకృతి ఆశ్రమంలో గడపండి. మీకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. తెలిసీ తెలియక ఉన్న చాలా ఇతర రోగాలు కూడా పోతాయి. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. చదవండి: Diabetes- Best Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? -
Constipation Remedies: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. నిర్లక్ష్యం చేస్తే!
మలబద్ధకం చాలామందిని వేధించే సమస్య. ఇది కేవలం ఉదయం పూట చెప్పుకోలేని బాధ మాత్రమే కాదు.. దీనివల్ల మున్ముందు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా కూడా దీన్ని నివారించుకోవాల్సిన అవసరమూ ఉంది. పీచు పుష్కలంగా ఉండే ఆహారం, తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం సాధ్యం. అవి జీర్ణాశయమార్గాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విరేచనం కూడా తేలిగ్గా అయ్యేలా చేస్తాయి. దేహంలో చక్కెరను నెమ్మదిగా వ్యాపించేలా చేసేందుకూ, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. మనం వాడే అన్ని రకాల ధాన్యాల పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు.. ఉదాహరణకు దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. చిక్కుళ్లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చదవండి: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా? ఇక పండ్ల విషయానికి వస్తే.. పీచు ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. ∙పీచుపదార్థాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మేలు చేస్తుందని గ్రహించాలి. చదవండి: ‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం? -
అలాగే కూర్చుని ఉంటే..!
మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత అవసరమో, అలాగే తిన్న ఆహారం జీర్ణమై వ్యర్థాలు విసర్జితం కావడం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రక్రియకు ఇరవై నాలుగ్గంటలకంటే ఎక్కువ విరామం రావడం ఆరోగ్యకరం కాదు. రోజంతా ఒళ్లు వంచి పని చేసే వాళ్లకు ఇది అసలు సమస్యకానే కాదు. కానీ రోజంతా కూర్చుని ఉద్యోగం చేసే వాళ్లకు ఇదే పెద్ద సమస్య. దేహానికి శ్రమలేకుండా కూర్చుని చేసే ఉద్యోగం తెచ్చే అనేక సమస్యల్లో ఇది ప్రధానమైనది. జీర్ణక్రియలు మందగించడం, పెద్దపేగు కదలికలు తగ్గిపోవడంతో క్రమంగా తీవ్రమైన మలబద్దకానికి దారి తీస్తుంది. నిజానికి ఇది అనారోగ్యం కారణంగా ఎదురయ్యే మలబద్దకం కాదు. కేవలం లైఫ్‌స్టైల్ సమస్య మాత్రమే. ఈ తరహా మలబద్దకానికి మందుల వాడకంకంటే జీవనశైలిని మార్చుకోవడమే సరైన మందు. కదలికలు సరిగ్గా ఉండాలంటే... ఆహారంలో పీచు సమృద్ధిగా ఉన్న పదార్థాలను తీసుకోవడంతోపాటు నిద్రలేచిన తర్వాత అరగంట సేపు నడవడం, వేడి నీరు తాగడం మంచిది. అలాగే... టాయిలెట్ సీట్ ఎత్తు తక్కువగా ఉండాలి. హిప్స్ కంటే మోకాళ్లు ఎక్కువ ఎత్తులో ఉండాలి. మోచేతులు మోకాళ్ల మీద పెట్టుకోగలగాలి. కూర్చున్న భంగిమ బవెల్ మీద తగినంత ఒత్తిడి పడే విధంగా ఉండాలి. సులువుగా చెప్పాలంటే వెస్ట్రన్ కమోడ్ కంటే ఇండియన్ టైప్ అన్ని రకాలుగా మంచిది. అయితే... మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లకు ఇండియన్ టైప్ టాయిలెట్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్లు వెస్ట్రన్ టైప్ కమోడ్నే తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు పాదాల కింద చిన్న మెట్టును అమర్చుకోవాలి. మద్యపానం, ధూమపానం చేసే వారికి కూడా బవెల్ కదలికలు మందగిస్తాయి. అలాంటి వాళ్లు ఆ అలవాట్లను మానుకోవడం లేదా బాగా తగ్గించడమే పరిష్కారం. -
Senna Tea: సెన్నా టీ సిప్ చేశారా?
చాయ్ అంటే చటుక్కున తాగని వాళ్లుంటారా? చాయ్ మహత్యం ఏంటోకానీ, ఒక్కసారి కూడా టీ తాగనివాళ్లుకానీ, తాగిన తర్వాత అలవాటు కాని వాళ్లు కానీ అరుదు. సాదా చాయ్ అందరూ తాగుతారు, కానీ ఇటీవల కాలంలో పలురకాల ఫ్లేవర్ల టీలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోవలోకి చెందినదే సెన్నా టీ! ఈ టీతో పలు ఆరోగ్య సంబంధ ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్య మలబద్ధకం. అలాగే యువత, పిల్లల్లోనూ ఈ సమస్య అప్పుడప్పుడూ తొంగిచూస్తూ ఉంటుంది. దీని నివారణకు రకరకాల ఔషధాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆయుర్వేద పద్ధతిలో మలబద్ధకాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేదే సెన్నా టీ. సెన్నా అంటే తంగేడు చెట్టు. దీని ఆకులతో తయారుచేసేదే సెన్నా టీ. అలాగే తంగేడు పూలు, కాయలతోనూ దీనిని తయారుచేయొచ్చు. ఈ తంగేడు ఆకులు, పూలు, కాయలను మలబద్ధకం నివారణకు ఉపయోగించే మాత్రల్లో ఎక్కువగా వాడతారు. అలాగే బరువు తగ్గడానికి, శరీరంలోని విష కణాలను తొలగించడానికి సెన్నా ఉండే మాత్రలు పనిచేస్తాయని మార్కెట్లో ప్రచారం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. మలబద్ధకాన్ని ఎలా తగ్గిస్తుందంటే? తంగేడాకుల్లో ఎక్కువగా గ్లైకోసైడ్స్, సెన్నోసైడ్స్ ఉంటాయి. ఈ సెన్నోసైడ్స్ మనం తీసుకున్న టీ ద్వారా కడుపులోకి చేరి అక్కడ మలబద్ధకానికి కారణమవుతున్న బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా పేగులోపల కదలికలు ఏర్పడి సులభంగా విరేచనం అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ టీ తాగిన ఆరు నుంచి 12 గంటల్లోపు అది పనిచేస్తుంది. మార్కెట్లో లభించే మలబద్ధకం మాత్రల్లో అతి ముఖ్యమైన మూలకం సెన్నానే. అలాగే పురీషనాళంలో రక్తస్రావం, నొప్పి, దురదలు వంటి వాటికీ సెన్నా టీ విరుగుడు పనిచేస్తుందనే వాదన ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. బరువు తగ్గిస్తుందా? బరువు తగ్గేందుకు సెన్నా టీ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు. సెన్నా టీ, లేదా సెన్నా మూలకం ఉన్న మాత్రలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగై తద్వారా సులభంగా బరువు తగ్గొచ్చనే ప్రచారం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా సెన్నా టీ, సెన్నా మూలకాలున్న మాత్రలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, ఇలా బరువు తగ్గాలని చేసే ప్రయత్నం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాగా, బరువు తగ్గడం కోసం ఇలా ’సెన్నా’ను ఉపయోగిస్తున్న 10వేల మంది మహిళలపై జరిపిన ఓ సర్వే సైతం ఇదే విషయం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే వారిలో ఆకలి పెరిగి, ఇంకా ఎక్కువ తింటున్నట్లు గుర్తించింది. ఎవరికి సురక్షితం? సెన్నా టీ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తాగొచ్చు. అయితే, వీరిలోనూ కొందరికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. అందులో ముఖ్యమైనవి కడుపులో తిమ్మిరి, వికారం, అతిసారం. అయితే, ఈ లక్షణాలు ఎక్కువ సేపు ఉండవు. మరికొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్లు సెన్నాకు దూరంగా ఉండడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యమైనది సెన్నా టీని మలబద్ధకానికి విరుగుడుగా తీసుకునే తాత్కాలిక ఔషధంగా గుర్తుపెట్టుకోవడమే. ఈ టీని వరుసగా వారం కంటే ఎక్కువ రోజులు తాగకూడదు. ఎక్కువ రోజులు తీసుకుంటే కాలేయం దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్రత్యేకించి హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు సెన్నా టీనే కాదు, సెన్నా మూలకం ఉన్న ఏ ఉత్పత్తులనైనా వాడాలంటే వైద్యుని సలహాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే గర్భిణులు, బాలింతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్నా మూలకం ఉన్న ఉత్పత్తులు, టీని తీసుకోకూడదు. (చదవండి: అమెరికా అంటే.. ఐదు కావాల్సిందే!) -
మలబద్ధకం తొలగించుకోండి
మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. పైగా ఇటీవలి కరోనా కాలంలో చాలామంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాతిపదికన పనిచేస్తున్నందున ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలూ ఎక్కువ. గతంలో ఆఫీసు వరకు ప్రయాణం చేసేందుకు అవసరమైన కదలికలు కూడా ఇటీవల లేకపోవడంతో ఈ సమస్య మరింతగా కనిపిస్తున్నట్లు ఇటీవల హాస్పిటల్స్‌కు వచ్చే కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మలబద్ధకం సమస్యకు కారణాలూ, నివారణ సూచనలను తెలుసుకుందాం. పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా విరేచనం సాఫీగా కాకపోవడమో లేదా ముక్కి ముక్కి అతి కష్టమ్మీద వెళ్లాల్సిరావడమో జరుగుతుంటే అది మలబద్ధకంగా పరిగణించవచ్చు. కొంతవుంది తమకు రోజూ విరేచనం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉందని అనుకుంటారు. అయితే విసర్జన ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. అందరిలోనూ తప్పనిసరిగా రోజూ విరేచనం అయి తీరాలన్న నియమం లేదు. కనీసం వారంలో మూడుసార్లు మలవిసర్జన చేయడంలో సమస్య ఎదురుకావడంతో పాటు ఆ ప్రక్రియ చాలా కష్టంగా జరుగుతుంటే దాన్ని మలబద్ధకం అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. అయితే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నివారణ ఇలా... కొన్ని జీవనశైలి మార్పులతో మలబద్ధకాన్ని సమర్థంగా నివారించుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని సూచనలివి... జామ పండును గింజలతోనే తినేయండి. ఆ గింజలు మోషన్ ఫ్రీగా అయ్యేలా సహాయపడతాయి. ప్రతిరోజూ వెజిటబుల్ సలాడ్స్ (క్యారట్, బీట్రూట్, టొమాటో, కీర దోసకాయ, ఉల్లిని ముక్కలుగా చేసి పచ్చిగా) తినండి. మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు (జావు, ఆరెంజ్, బొప్పాయి. ఆపిల్ వంటివి) ఎక్కువగా తీసుకోండి. నీటిపాళ్లు ఎక్కువగా ఉంటే పండ్లు తినండి. మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుుడిబియ్యం, పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు. చివరగా.. రోజూ క్రవుం తప్పకుండా వ్యాయామం చేయండి. అయితే సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను కలిసి దానికి కారణాలు కనుగొని, దానికి అనుగుణంగా తగిన మందులు వాడాల్సి ఉంటుంది. మలబద్ధకానికి కారణాలు... ఆహారపరమైనవి: మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు లేకపోవడంతో పాటు... ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం (అంటే... వెన్న, నెయ్యి, మాంసం అందునా రెడ్‌మీట్ వంటివి) ఎక్కువగా తీసుకోవడం. ద్రవాహారం తక్కువగా తీసుకోవడం వల్ల: మనం తీసుకునే పదార్థాలలో నీళ్లు, పళ్లరసాలు వంటి ద్రవాహారం తక్కువగా ఉండటం. ద్రవాహారం ఎక్కువగా ఉంటే అది పేగుల కదలికలను ప్రేరేపించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. సాధారణానికి భిన్నమైన పరిస్థితుల్లో : కొందరు మహిళలకు గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావంతో మలబద్ధకం రావచ్చు. మరికొందరిలో ప్రయాణ సమయంలో తమ ఆహారపు అలవాట్లు మారినందువల్ల కూడ ఈ సమస్య రావచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో పేగుల కదలికలు ప్రభావితమై మలబద్ధకం ఉండవచ్చు. అయితే ఇది ఏరకంగానూ ప్రమాదకరమైన పరిస్థితి కాదు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. మరికొన్ని రుగ్మతల్లోనూ : సాధారణంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, ఎండోక్రైన్ రుగ్మతలు వంటివి వచ్చినప్పుడు కూడా మలబద్ధకం రావచ్చు. మందులు: కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటాసిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మూర్ఛవ్యాధికోసం తీసుకునే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకునేవాళ్లలో పేగుల కదలికలు బాగా మందగించి మలబద్ధకం రావచ్చు. వ్యాయావుం లేకపోవడం: దేహానికి కదలికలు తగినంతగా లేకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల పేగుల కదలికలు మందకొడిగా ఉంటాయి. దాంతో ఎక్కువసేపు పడకపైనే ఉండేవారికి లేదా కూర్చునే ఉండేవారికి మలబద్ధకం వచ్చే అవకాశాలెక్కువ. కరోనా కత్తికి డెంగీ డాలు! ‘అంతా మన మంచికే’ అన్నది మనందరికీ తెలిసిన ఓ తెలుగు సామెత. ‘ఎవరికైనా డెంగీ వచ్చిందనుకోండి. అది మంచికెలా అవుతుం’దంటూ గతంలో ఎవరైనా వాదిస్తే... గద్దిస్తే అప్పట్లో మనం చెప్పగలిగేదేమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడా సామెతకు సైతం తార్కాణాలున్నాయి! అందునా కరోనా... డెంగీల ఉదాహరణలతో!! ఇదే విషయాన్ని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ గట్టిగా చెబుతున్నారు. పెద్దలు చెప్పే సామెతల్లో చాలా సందర్భాల్లో విశ్వజనీన వాస్తవాలు ఉంటాయని ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైగుల్ నికోలెలిస్ మాటల ఆధారంగా మరోమారు నిర్ద్వంద్వంగా రుజువైంది. బ్రెజిల్లో నిర్వహించిన అధ్యయనాల ఫలితంగా ఆయన చెబుతున్న వాస్తవం ఏమిటంటే... గతంలో ఓసారి డెంగీ వ్యాధి వచ్చి తగ్గిన వారిలో కరోనా వైరస్ పట్ల వ్యాధి నిరోధకత ఉంటుందట. చాలావరకు లేకపోయినా ఎంతో కొంత మాత్రం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు ప్రొఫెసర్ నికోలెలిస్. ఆయన పరిశీలన ప్రకారం... గతంలో డెంగీ వచ్చిన వారి శరీరాల్లో వృద్ధిచెందిన యాంటీబాడీస్ కారణంగా ఈసారి కరోనా సోకినప్పుడు వ్యాధి తీవ్రత పెద్దగా లేదనీ, చాలా మరణాలు కూడా నివారితమయ్యాయని కూడా ఖండితంగా చెబుతున్నారాయన. డెంగీ విస్తృతంగా వచ్చిన ప్రదేశాల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉండటాన్ని కూడా ఆయన గుర్తించారు. డెంగీ కలగజేసే ఫ్లావీ వైరస్‌కీ... కరోనా వైరస్కూ కొంత సారూప్యం ఉండటం వల్ల ఇలా జరుగుతోందని ఆయన వివరించారు. గతంలో డెంగీ వచ్చి తగ్గినవారికి ఇది కొంతమేర శుభవార్తే కదా! -
తినగానే ఈ సమస్యలు ఎందుకిలా?
నా వయసు 45 ఏళ్లు. భోజనం పూర్తికాగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ►జన్యుపరమైన కారణలు ►చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ►ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
యానల్ ఫిషర్ తగ్గుతుందా?
నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పిల్లల్లో రెక్టల్ ప్రొలాప్స్
కొంతమంది పిల్లల్లో మల విసర్జన చేయిస్తున్నప్పుడు పేగు కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల పిల్లలకు బాధగా కూడా అనిపించదు గానీ దాన్నిచూసి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన పడటం చాలా సాధారణం. ఇలా మల ద్వారం నుంచి పేగు కిందికి జారినట్లుగా కనిపించే సమస్యను రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. మలద్వారానికి సంబంధించిన మ్యూకస్ పొరల్లో కొన్ని లేదా అన్ని పొరలూ బయటకు చొచ్చుకు రావడంతో ఇలా జరుగుతుంది. (కొన్ని సందర్భాల్లో రెక్టల్ పాలిప్ ఇదే విధంగా మనకు కనపడవచ్చు). పిల్లల్లో అయితే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ సమస్య కనిపించినా, పెద్దవారి విషయానికి వస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్యకు కారణాలు ►ఇది పిల్లలు నిలబడటం మొదలుపెట్టాక (స్టాం డింగ్ పొజిషన్లోకి వచ్చాక) బయటపడవచ్చు. ఒకసారి కండరాల బలం పెరగగానే తగ్గిపోవడం కూడా చూస్తుంటాం. ►ఈ సమస్యకు నిర్దిష్టంగా కారణం లేకపోయినప్పటికీ డయేరియా, మలబద్దకం వంటివి ముఖ్యకారణాలు. ►ముక్కుతూ ఎక్కువసేపు మలవిసర్జన చేయాల్సి వచ్చిన పిల్లల్లో కనిపిస్తుందిది. ►నిమోనియా, కోరింత దగ్గు, పోషకాహార లోపం, కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల, నరాలకు సంబంధించి ముఖ్యంగా వెన్నుపూస వంటి ఇతర సమస్యలు కూడా కారణాలు. ►సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్య వల్ల కూడా రెక్టల్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంది. చికిత్స ►చాలామంది పిల్లల్లో సహజంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంటుంది. ఐతే మలబద్దకం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ►పీచుపదార్థాలు, నీటిశాతం ఎక్కువ ఉన్న ఆహారం ఇవ్వడం. ►అవసరమైతే స్టూల్ సాఫ్ట్‌నర్స్ అంటే... లాక్టిలోస్, మినరల్ ఆయిల్ వంటివి వాడితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ►నులిపురుగులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోవడానికి చికిత్స చేయాలి. ►కొన్ని సందర్భాల్లో మాన్యువల్ రిడక్షన్ అనే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా చాలావరకు ఫలితం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో మలద్వారంలో ఇంజెక్షన్స్ చేయాల్సి రావచ్చు. ►కొద్దిమందిలో అల్సర్, దానిపై గాయం అవ్వడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైతే ప్రత్యేకమైన చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య విషయంలో ఆందోళన అవసరం లేదు. సాధారణంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అయితే మరింత సమస్యాత్మకంగా మారకుండా ఉండటానికి పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
రుచికి గొప్పాయి
బొప్పాయి న్యూస్‌లో ఉంది. డెంగీ జ్వరానికి దాని ఆకుల రసం విరుగుడనే ప్రచారం ఉంది. కాని వైద్యుల సలహా లేకుండా అలాంటి చిట్కాలు పాటించకూడదనే హెచ్చరిక కూడా ఉంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. గొప్పగా చెప్పండి.. ఇవాళ మీ ఇంట బొప్పాయి అని. బొప్పాయి హల్వా కావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి ►బాగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి ►బాదం పప్పుల పొడి జత చే సి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ►జీడి పప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి ►కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి మసాలా కూర కావలసినవి: బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను. తయారీ: ►ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పల్లీలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ►నువ్వులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఎండు కొబ్బరి పొడి జత చేసి మరోమారు వేయించాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►ఉప్పు జత చేసి బాగా కలిపి, బొప్పాయి ముక్కలు జత చేయాలి ►మెత్తగా పొడి చేసిన మసాలా పొడి వేసి మరోమారు కలపాలి ►కొద్దిసేపు కలిపిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పెరుగు పచ్చడి కావలసినవి: పచ్చి బొప్పాయి తురుము – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పసుపు – కొద్దిగా; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఒక గిన్నెలో బొప్పాయి తురుము, తగినన్ని నీళ్లు, ఉప్పు జత వేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►ఒక పెద్ద పాత్రలో పెరుగు, పసుపు వేసి గిలకొట్టాలి ►ఉడికించిన బొప్పాయి తురుము జత చేసి బాగా కలియబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపు వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పనీర్ కూర కావలసినవి: సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; ఉడికించిన బంగాళ దుంప – 1; సన్నగా తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పనీర్ తురుము – ఒక టేబుల్ స్పూను; మెంతులు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. పేస్ట్ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 10; అల్లం – చిన్న ముక్క; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 1. తయారీ: ►ఒక పాత్రలో ఉప్పు వేసి, తరిగిన బొప్పాయి ముక్కలు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, నీరు ఒంపేయాలి ►ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలు చేయాలి ►చిన్న గిన్నెలో మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాక, నీళ్లు ఒంపేసి మెంతులను బొప్పాయి ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలను మెత్తగా ముద్దలా చేసి, జీలకర్ర వేగిన తరవాత జత చేయాలి ►ఉప్పు, అర కప్పు నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు, బంగాళ దుంప ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, మంట బాగా తగ్గించి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు బాగా మెత్తపడి, గ్రేవీ చిక్కగా అవ్వగానే దింపేసి, కొత్తిమీరతో అలంకరించాలి ►చపాతీ, పరాఠా, అన్నంలోకి రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కర్రీ (నార్త్ ఇండియన్ స్టయిల్) కావలసినవి: పచ్చి బొప్పాయి – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 4; సోంపు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►కుకర్‌లో నూనె వేసి వేడి చేయాలి ∙సోంపు వేసి చిటపటలాడించాలి ►అల్లం వెల్లుల్లి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు జత చేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి ►చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి, ఒక కప్పు నీళ్లు జత చేసి మూత పెట్టాలి ►మూడు విజిల్స్ వచ్చాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వడ్డించాలి ►పుల్కా, రోటీ, అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి కొన్ని సంవత్సరాల క్రితం వరకు బొప్పాయి పండు దొడ్లో చెట్టుకి కాస్తే ఎవరికివారు తినడమో, ఇరుగుపొరుగు పంచిపెడితేనో మాత్రమే దొరికేది. కానీ, ఈ పండులోని పోషక విలువలు, ఆరోగ్య రక్షక గుణాలు ప్రాచుర్యం పొందాక, ఇది కూడా బజార్లో కొనుక్కోవలసిన పండు అయిపోయింది. ఇప్పటికీ మిగిలిన పళ్లతో పోల్చితే ఇది చవకగానే దొరుకుతోంది. కాని ప్రజలలో ఒక నిజం కాని నమ్మకం ఉంది. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే అందులో ఎక్కువ బలం ఉంటుందనీ, చవకగా దొరికే పళ్లల్లో పోషక విలువలు తక్కువనీ. ఇది కేవలం పరిజ్ఞాన లోపం వల్ల ప్రబలిన నమ్మకం. చవకగా దొరికే బొప్పాయి పండులో ఉన్నన్ని పోషక విలువలు, ఖరీదైన ఆపిల్‌లో లేవు. అందుకని పండు విలువని ఖరీదుతో వెలకట్టకూడదు. ఏ భాగాలు... పచ్చికాయని కూరగాను, పండుని ఆహారంగాను వాడతాం. గింజలలో కూడా వైద్యగుణాలు ఉన్నాయి. పండు – ప్రయోజనాలు ►పచ్చికాయలోను, పండులోను కూడా జీర్ణశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఎంతటి అరగని పదార్థాన్నయినా, బొప్పాయితో కలిపి తింటే తేలికగా జీర్ణం అయిపోతుంది. మాంసాహారంతో బొప్పాయి కలిపి వండితే త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది. ►మలబద్దకం, పైల్స్ వ్యాధి ఉన్నవారికి మలబద్దకం పోగొట్టి, పైల్స్ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుంది. ►క్రమంగా తింటూంటే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ శరీరంలో పేరుకోకుండా, బయటికి పంపేసి శరీరాన్ని రక్షిస్తుంది. ►ఇందులోని విటమిన్ సి కారణంగా, నెలరోజులు నిత్యం తింటూంటే పురుషులలోని వీర్యకణాలు అన్నిరకాలుగా వృద్ధి చెందుతాయి. ►గర్భిణీలకు నిషేధం. పచ్చికాయ – గింజలు ►సిరోసిస్ ఆఫ్ లివర్ వ్యాధిగ్రస్తులు... బొప్పాయి గింజలను నూరి రసం తీసి, కొద్దిగా నిమ్మరసం కలిపి (1 చెంచా రసం + 10 చుక్కల నిమ్మ రసం) రోజూ రెండు పూటలా కొంతకాలం తీసుకుంటూంటే ఆరోగ్యం మెరుగవుతుంది. ►చర్మవ్యాధులలో... గడ్డలు, మొటిమలు, పాదాలలో వచ్చే కార్న్స్ వంటి సమస్యలలో పచ్చికాయ నుండి రసం తీసి, పైపూతగా వాడితే తగ్గుతాయి. ►నెలసరి క్రమంగా కానివారు పచ్చికాయ తింటూంటే స్రావం సక్రమంగా అవుతుంది. ►పచ్చి బొప్పాయి కాయ నుంచి కారే పాలు 1 చెంచాడు + 1 చెంచా తేనె కలిపి సేవిస్తూంటే కడుపులో పురుగులు పోతాయి. ఈ మిశ్రమం సేవించిన 1 – 2 గంటల తరవాత ఆముదం తీసుకోవాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
స్వాభావిక ఆహారాలతోనే మలబద్దకం వదిలించుకోవడం ఎలా?
చాలా మందికి రోజు ప్రారంభం కావడం చాలా ఇబ్బందిగా జరుగుతుంది. చాలామందిలో పొద్దున్నే సాఫీగా జరగాల్సిన మలవిసర్జన అనే ప్రక్రియ నరకప్రాయంగా జరుగుతుంది. ఉదయమే ఆ పనికాస్తా సజావుగానూ, సాఫీగానూ జరిగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ పొద్దున్నే మలవిసర్జన ప్రక్రియ హాయిగా జరగకపోతే ఆ ఇబ్బంది రోజంతా కొనసాగుతూనే ఉంటుంది. కారణాలేమిటి? ఇటీవల మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, మన ఆహారపు అలవాట్లు మలబద్దకానికి కారణమవుతున్నాయి. గతంలో మనం తీసుకునే ఆహారంతో పీచుపదార్థాలు తగినంతగా అంది మలవిసర్జన సాఫీగా జరిగేది కానీ ఇటీవల ప్రతివారూ తమ ఆహారంలో జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత ఎక్కువ చేస్తున్నాయి. పీచుపదార్థాల పరిమాణం ఎంత ఉండాలి? నిజానికి మనం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధికగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళకు అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. పీచుపదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? మన మలం పలచగా ఉండి, సాఫీగా జారాలంటే పెద్దపేగులో తగినంత నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే... సదరు ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో ఉంటే పేగుల్లో ఉన్న నీటినంతటినీ పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ కనీసం 20 – 35 గ్రాముల పీచు ఉండాలి. అప్పుడు చాలా తేలికగా మల విసర్జన సాధ్యమవుతుంది. ఇక కనిష్టంగా 10 గ్రాముల పీచుకు తక్కువ కాకుండా ఉంటే, మల విసర్జన కొంతవరకు తేలిగ్గా జరుగుతుంది. స్వాభావికంగానే పీచు లభ్యమయ్యే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. మలవిసర్జన తేలిగ్గా జరిగేలా చూసుకోండి. పై ఐదు పదార్థాలూ రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మలబద్దకం ఇక మీ దరిచేరదు. అలాగే మీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం కూడా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. -
సోరియాసిస్‌కు చికిత్స ఉందా?
నా వయసు 42 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మసమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది.సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ►వంశపారంపర్యం మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: ►సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ►ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ►అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు : ►తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ►చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ►మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ►ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మలవిసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతోపాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడిప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: – దీర్ఘకాలిక మలబద్ధకం – ఎక్కువకాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచిచికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
యానల్ ఫిషర్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ముందుగా ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 34 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ►హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ►ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పొలుసుల్లా రాలుతున్నాయి..! నా వయసు 39 ఏళ్లు. ఆరు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగా లేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో సాధ్యమే. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
రుమటాయి ఆర్థరైటిస్ నయమవుతుందా?
నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల జాయింట్లు (కీళ్లు) నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తే తనపట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ యానల్ ఫిషర్ సమస్యకు చికిత్స ఉందా? నా వయసు 39 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుం దాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాం తంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. ►కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. ►చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సయాటికా నొప్పి తగ్గుతుందా? నా వయసు 40 ఏళ్లు. నేను వృత్తిరీత్యా రోజూ దాదాపు 70 కి.మీ. బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్లను కలిస్తే నా సమస్య ‘సయాటికా’ అని అంటున్నారు. దయచేసి దీనికి తగిన పరిష్కారం సూచించండి. నేటి జీవనశైలితో వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాదాపు 90 శాతం మంది ప్రజల్లో జీవితకాలంలో ఏదో ఒకసారి ఇది కనిపిస్తుంది. ►కారణాలు : ∙ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నుపాము నుంచి వచ్చే నరాలు కంప్రెస్ అవుతాయి. దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. ►లక్షణాలు : కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం. ►నిర్ధారణ పరీక్షలు : ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై. ►చికిత్స : సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
మలబద్దకంతో బాధపడుతున్నాను.. తగ్గేదెలా?
నా వయసు 29 ఏళ్లు. నేను చాలాకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. స్వాభావికంగానే ఇది తగ్గే మార్గం చెప్పండి. మలబద్దకం ఉన్నవారిలో మలవిసర్జన అరుదుగా జరుగుతుంది. అప్పుడప్పుడూ మలబద్దకం రావడం చాలామందిలో కనిపించేదే. అయితే కొందరిలో ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది వారి దైనందిన కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతూ ఉంటుంది. పైగా దీర్ఘకాలిక మలబద్దకం ఉన్న వారు మలవిసర్జన సమయంలో చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మలబద్దకానికి అసలు కారణం తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స కానీ, జాగ్రత్తలు కానీ పాటిస్తే అది తగ్గిపోతుంది. ఉదాహరణకు కొంతమంది పీచు అంతగా లేని ఆహారం అంటే నిత్యం మాంసాహారం తింటూ ఉన్నప్పుడు, వారిలో పీచు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకునేలా చేస్తే మలబద్దకం తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు మలబద్దకానికి అసలు కారణం తెలియకపోవచ్చు. కొందరిలో చిన్నతనంలో మలవిసర్జన శిక్షణ (గుడ్ శానిటరీ హ్యాబిట్స్) సరిగా లేకపోవడం వల్ల కూడా వారి యుక్తవయసులో దీర్ఘకాలిక మలబద్దకం రావచ్చు. మలబద్దకం ఉన్నట్లుగా గుర్తించే లక్షణాలివి: సాధారణం కంటే తక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్లడం గడ్డలుగా లేక గట్టిగా ఉండే మలం మలవిసర్జన కోసం బాగా ముక్కాల్సి రావడం మలవిసర్జన ద్వారం వద్ద ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండి, అది మలవిసర్జన జరగకుండా ఆపుతున్నట్లుగా అనిపించడం మలవిసర్జనకు చాలా సమయం పట్టడం పొత్తికడుపును చేతులతో నొక్కాల్సి రావడం, కొన్నిసార్లు మలం బయటకు రావడానికి వేళ్లను ఉపయోగించాల్సి రావడం ∙ఒక్కోసారి మలం ఎంతకూ బయటకురాకపోవడంతో అది అక్కడ గట్టిపడి, ఎండిపోయి మరింత సమస్యాత్మకంగా మారడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. మలబద్దకం నుంచి విముక్తి కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: మలవిసర్జన ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని ఆపుకోకండి. టాయిలెట్లో గడపాల్సినంత సేపు గడపండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా, తొందరపడకుండా మల విసర్జనకు కావాల్సినంత సమయం కేటాయించండి. నీరు ఎక్కువగా తాగండి. దాంతో పాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోండి. మీ వైద్యుడు / డైటీషియన్ చెప్పినట్లుగా ఆహారంలో మార్పులు చేసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు, పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పొట్టుతో ఉండే ముడి ధాన్యాల్లో పీచు ఎక్కువ. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. పాల ఉత్పత్తులు, మాంసాహారాలను చాలా పరిమితంగా తీసుకోండి. రోజులో మూడు సార్లు కాకుండా కొంచెం కొంచెం మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. కొద్దికొద్దిమోతాదుల్లో రోజులో 5 లేదా 6 సార్లు తినండి. రాత్రి భోజనం సమయంలో తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు వీలుగా నిద్రకు ఉపక్రమించడానికి కనీసం 3 లేదా 4 గంటల ముందే తినండి. పొగతాగే అలవాటును పూర్తిగా మానేయండి. మద్యాన్ని వదిలిపెట్టడం. కాఫీ/కెఫిన్ ఉండే ద్రవపదార్థాలకు దూరంగా ఉండండి. చ్యూయింగ్ గమ్ నమలకండి. రోజూ వ్యాయామం చేయండి. శారీరక కదలికల వల్ల పేగులు కూడా కదిలి మలబద్దకం నివారితమవ్వడమే కాకుండా, ఆరోగ్యపరంగా ఇతరత్రా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ టాయ్‌లెట్ సీట్ ఇలా ఉంటే మేలు భారతీయ టాయెలెట్లు మలబద్దకం ఉన్న వారికి ఒకింత మేలు చేస్తాయి. అయితే ఒకవేళ మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కారణాల వల్ల వెస్ట్రన్ టాయెలెట్లనే వాడాల్సి వస్తే కాళ్ల కింద ఒక పీట ఉంచుకొని ఈ కింద బొమ్మలోలా మీ శరీర భంగిమ ఉండేలా చూసుకోండి. మలబద్దకం నివారణకు ఇది కూడా చాలావరకు తోడ్పడుతుంది. ఫ్యాటీ లివర్ ఉందిజాగ్రత్తలేమిటి? నా వయసు 56 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. మన కాలేయం కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది చాలా సంక్లిష్టమైన జీవక్రియల్లో ఒకటి. అందువల్ల ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 41 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎల్. నాగమణి, నూజివీడు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఐబీఎస్‌కు పరిష్కారం చెప్పండి నా వయసు 36 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఐబీఎస్ అన్నారు. మందులు వాడినా ఏమీ తగ్గలేదు. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – వి. చంద్రశేఖర్‌రావు, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి.సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్య పానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ పొద్దున్నే మడమల్లో నొప్పి... తగ్గేదెలా? నా వయసు 45 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. విశ్నాంతి తీసుకున్నప్పుడు తగ్గి, మళ్లీ నడవగానే వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారం కోసం హోమియో పరిష్కారం చెప్పండి. – ఆర్. చంద్రలేఖ, అనకాపల్లి అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తుంది. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు : డయాబెటిస్ ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో) లక్షణాలు : మడమలో పొడినట్లుగా నొప్పి ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం కండరాల నొప్పులు చికిత్స : మడమనొప్పికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
పొట్టలో అల్సర్... తగ్గుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – డి. రవిచంద్ర, నేలమర్రి ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో అల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్త వాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటి నిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
వంటింటి ఆరోగ్యం...
వంటింట్లో పోపుల డబ్బాలో ఉండే ఆవాలు మన కుటుంబాన్ని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. చిన్నగా అతి సూక్ష్మంగా కనిపించే ఆవాలలో ప్రకృతి ఎన్నో శక్తులు నింపింది. తాలింపులో ఆవాలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు ఆవాలలో ఉండే గుణాలు గుర్తించి వీటిని వంటల్లో వేశారు. ఆవాలు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల భేదాలతో కొద్దిగా కారపు రుచితో వగరుగా ఉంటాయి.ఈ ఆవాలను ఉపయోగించి, వ్యాధులు రాకుండా నివారించుకుంటూ, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. వజ్రాయుధంలాంటి ఆవాల గురించి కొన్ని విశేషాలు... ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి, నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్దకం పోతుంది. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి, దానిని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.పచ్చిఆవాలను నీళ్లతో కలిపి మెత్తగా నూరి, దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి జుట్టు రాలి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి.జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాల మీద, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లవారేసరికి మంచి గుణం కనిపిస్తుంది. ఆవాలపిండిని నీటితో కలిపి తాగడం వల్ల, వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ అవి వెంటనే తగ్గిపోతాయి. ఆ తరవాత నల్ల ఆవాల పిండిని తడి చేసి పొట్ట మీద రాయాలి. నల్ల ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది. ఆవాలు, పత్తి ఆకులు కలిపి మెత్తగా నూరి, తేలు కుట్టిన చోట పట్టిస్తే ఒక్క నిమిషంలో విషం విరిగిపోతుంది. కఫం, వాతం, అజీర్ణం, దురదలు, మెదడులోని దోషాలు, తలలోని చెడు నీరు, కుష్ఠు, పక్షవాతం వంటి రోగాలకు ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలను కొంచెం దోరగా వేయించి, మంచినీళ్లతో మెత్తగా నూరి ఆ ముద్దను ముక్కు దగ్గర వాసన తగిలేట్టుగా పెడితే, మరుక్షణంలోనే మూర్ఛరోగి మేల్కొంటాడు. కొంచెం దోరగా వేయించిన ఆవాలు, బెల్లం సమంగా కలిపి మెత్తగా దంచి, బఠాణీ గింజంత మాత్రలు చేసుకుని నిలవ చేసుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఈ మాత్రలను మంచినీళ్లలో కలిపి పూటకి ఒక మాత్ర చొప్పున, రెండు మూడురోజులు సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి. కడుపులో నులిపురుగులు ఉన్న పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతారు. అటువంటి వారికి ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలను దోరగా వేయించి, దంచి, జల్లించి నిల్వ ఉంచాలి. పళ్లు కొరుకుతున్న పిల్లలకు, అర గ్రాము పొడిని అర కప్పు పెరుగుకి జతచేసి తాగిస్తే పురుగులు మలంలో నుంచి బయటకు పోతాయి. పిల్లలు పళ్లు కొరకడం మానేస్తారు.కఫాన్ని తగ్గించి వేడిని పెంచుతాయి. ఆవనూనెలో ఉప్పు కలిపిన మిశ్రమంతో చంటిపిల్లల పళ్లు తోమితే, పళ్లు గట్టిగా ఉంటాయి.