శుద్ధ్ కేర్... | Room temperature Water can be used for Hydrotherapy treatment | Sakshi
Sakshi News home page

శుద్ధ్ కేర్...

Published Sun, Aug 10 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

శుద్ధ్ కేర్...

శుద్ధ్ కేర్...

మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ట్రిక్... ఈ సమస్యలు మనిషిని నిద్ర పోనివ్వవు. బిజీ లైఫ్ స్టైల్‌లో ఇవి చాలామందిని ఇబ్బందులు పెడుతున్నాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఇవి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. పెద్దపేగులో పేరుకుపోయిన మాలిన్యాలను కొలాన్ Hydrotherapy ద్వారా తొలగించవచ్చు. ఈ ట్రీట్‌మెంట్‌లో ఎలాంటి కాలుష్యం లేని  పరిశుభ్రమైన డిస్టిల్డ్ వాటర్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది. రూం టెంపరేచర్ వద్ద ఉన్న నీటిని కూడా ఈ ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించవచ్చు.
 
 ఈ నీటిని మలమార్గం (రెక్టమ్) ద్వారా పంపడానికి అమెరికా మందుల నియంత్రణ సంస్థ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) ఎఫ్‌డీఏ ఆమోదం పంపిన సంస్థలు తయారు చేసిన ప్రత్యేక నాజిల్‌ను ఉపయోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ నాజిల్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. మలమార్గంలోకి నాజిల్ ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. నాజిల్ ద్వారా లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుంది. లోపలికి వెళ్లిన నీరు పెద్ద పేగులోని మాలిన్యాలను శుభ్రం చేస్తుంది. మాలిన్యాలు వెళ్లిపోవడాన్ని యంత్రానికి ఉన్న ఆధునిక పైపుల ద్వారా స్పష్టంగా చూడవచ్చు.
 
 కొలాన్ హైడ్రోథెరపీతో మేలు...
 ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. దీని ద్వారా మలబద్ధకం సమస్య దూరమైపోతుంది. పెద్దపేగులో మలం పేరుకుపోవడం వల్ల విషపదార్థాలు వెలువడుతాయి. కొలాన్ హైడ్రోథెరపీతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడిది హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.
 
 ప్రయోజనాలు
 మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది.  దీర్ఘకాలిక డయేరియా లాంటి జబ్బులు తగ్గుతాయి.  ఒత్తిడి, ఉద్రిక్తతలు తగ్గుతాయి. విషపదార్థాలు తొలగటం వల్ల పెద్దపేగు క్రమాంకుచక కదలికలు మెరుగుపడతాయి.
 
 సంపూర్ణ ఆరోగ్యం..
 కొలాన్ హైడ్రో థెరపీ పెద్దపేగు ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ దేశాలలో ఈ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రక్రియ చేసేముందు మెడికల్ ఎసెస్‌మెంట్ తప్పనిసరి. మధుమేహం, రక్తపోటు, శరీరంలో కొవ్వుశాతం, మెటబాలిక్ రేట్లను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స నిర్వహిస్తున్నారు. చికిత్సలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు.
 
 వీరికి పనికిరాదు...
 గర్భవతులు, పెద్దపేగు, మల ద్వార కేన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రబుల్, అల్సరేటివ్ కొలైటిస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి ఈ చికిత్స పనికిరాదు.
 
 అడ్రస్
శుద్ధ్ కోలన్ కేర్, మర్చంట్ టవర్‌‌స,
 జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా,
 రోడ్ నం. 4, బంజారాహిల్స్
 హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement