indigestion
-
‘గ్యాస్ట్రైటిస్’ తగ్గుతుందా?
నా వయసు 43 ఏళ్లు. కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. విశ్వప్రసాద్, గుంటూరు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది! మా పాపకు ఏడేళ్లు. మూడేళ్లుగా ఆమె చెవినొప్పితో బాధపడుతోంది. చెవిలో చీము కూడా కనపడుతోంది. కొంతకాలంగా ప్రతిరోజూ చెవిపోటు వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ అవసరమంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స సూచించండి. – చంద్రశేఖర్, సిద్దిపేట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. కారణాలు : ∙కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు : ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ : ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? – ఆర్. ప్రసాదరావు, సామర్లకోట మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్ధకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 43 ఏళ్లు. కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం. డాక్టర్ గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్. రామసుబ్బారెడ్డి, కర్నూలు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రిక్ ముదిరితే అవి కడుపులో అల్సర్స్ (పుండ్లు)గా ఏర్పడతాయి. కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమ వుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట, ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙మలం రంగు మారడం వంటివి. జాగ్రత్తలు : సమయానికి ఆహారం ∙కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగ, మద్యపానం మానేయాలి ∙మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. భోజనానికి నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండాలి. చికిత్స : ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యత చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పేరుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయికి 25 ఏళ్లు. ఈ మధ్య ఒకే దగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? – సురభి, ఖమ్మం పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించు కోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోయి తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. కారణాలు : ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దుష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
గొంతునొప్పి, మంట, దగ్గా..?
టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్కపొ రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి. -
అజీర్తితో బాధపడుతున్నారా?
♦ అజీర్ణంతో బాధపడుతున్నవారు భోజనం తర్వాత అరకప్పు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే వుంచి ఫలితం ఉంటుంది. ♦ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒకస్పూను నివ్మురసం, రెండు స్పూన్లు తేనె, అల్లం ముక్కలు చిన్నవి వేసుకుని అన్నింటినీ మిక్స్ చేసుకుని ఆ మిశ్రవూన్ని అజీర్తిగా అనిపించినప్పుడు తాగాలి. ♦ భోజనం చేసిన తర్వాత పొట్టమీద ఐస్బ్యాగ్తో వుసాజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ♦ నివ్మురసం అజీర్తిని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తికి కారణవుయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక కప్పు వేడినీటిలో కొంచెం నివ్మురసం కలుపుకుని తాగాలి. ♦ బేకింగ్ సోడా, వుంచినీళ్ళు సవుపాళల్లో తీసుకుని గ్లాస్లో కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశవునం కలుగుతుంది. ♦ ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. జీరా టీ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి. ♦ తాజా కొత్తిమీర అకులతో జ్యూస్ చేసి దానిలో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి ఈ మిశ్రవూన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. -
గ్యాస్ట్రయిటిస్ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. వృత్తి రీత్యా నిత్యం ఊళ్లు తిరుగుతూ లాడ్జీల్లో దిగుతూ ఉంటాను. అక్కడికి దగ్గర్లో ఉండే ఏ హోటల్ పడితే ఆ హోటల్లో భోజనం చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్రై్టటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు కొద్దిపాటి ఉపశమనం ఉన్నప్పటికీ, మానాక మళ్లీ మామూలే. ఈ సమస్య హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – రామకృష్ణారావు, విజయవాడ ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో గ్యాస్రై్టటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్రై్టటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్రై్టటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్రై్టటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్రై్టటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్రై్టటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙మీరు ఊళ్లు తిరగాల్సి వస్తున్నా ఒకవేళ మీరు మీ ఊరి నుంచి బయల్దేరే సమయంలో మధ్యానం మీ ఇంటి భోజనమే చేసేలా కాస్త బాక్స్ కట్టుకొని వెళ్లడానికి వీలుంటుందేమో చూడండి. అలాగే రాత్రి భోజనం వేళకు ఇంటికి తిరిగి రాగలిగే అవకాశం కూడా ఉందేమో చూసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు కాస్త శుచిగల తిండి పెట్టగల భోజనశాలలను ఆశ్రయించడం మేలు. ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
కడుపులో మంట... ఉబ్బరం... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్రై్టటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – దిలీప్‌కుమార్, వరంగల్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల, దూరాభారాలు ప్రయాణాలు చేస్తూ ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్రై్టటిస్ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర వాపునకు గురికావడాన్ని గ్యాస్రై్టటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై, కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే ఎక్యూట్ గ్యాస్రై్టటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్రై్టటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: 20 నుంచి 50 శాతం ఎక్యూట్ గ్యాస్రై్టటిస్లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్రై్టటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం lకొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానంలో గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ చిన్న చిన్న వస్తువులను ముక్కులో పెట్టుకుంటే ఏంచేయాలి? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ పిల్లలు తమ ఆటల్లో భాగంగా ముక్కులో అవీ ఇవీ పెట్టుకుంటుంటారు. ఇటీవల మా చిన్నాన్నగారమ్మాయి ఇలాగా చిన్న బలపం ముక్క పెట్టుకుంది. ఇలా జరిగినప్పుడు ఏమి చేయాలో వివరంగా తెలపగలరు. – సుష్మిత, హుజూర్నగర్ సాధారణంగా పిల్లలు... గింజలు, పెన్సిల్ ముక్కలు, చిన్న గోలీల వంటి వాటిని ముక్కులో పెట్టుకుంటారు. అలాంటప్పుడు ముక్కులో ఇరుక్కున్న వస్తువును మనమే తీయడానికి ప్రయత్నించినా లేదా ఆ గింజ వంటి వస్తువు గాలిని పీల్చుకునే గొట్టం లోపలి భాగంలోనికి వెళ్లి శ్వాస ప్రక్రియకు అడ్డం పడ్డా అది చిన్నారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల వాటిని బయటకు తీయడానికి మనంతట మనమే ప్రయత్నించకూడదు. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే ముక్కుకు కూడా మనం హాని చేసినవాళ్లమవుతాం. ఈ సమయంలో బిడ్డను కంగారు పెట్టకుండా అవతలి ముక్కు రంధ్రాన్ని మూసి, ఏ ముక్కు రంధ్రంలో గింజ పెట్టుకుందో అక్కడి నుంచి వేగంగా గింజ బయటకు వచ్చేలా బిడ్డ చేత గట్టిగా తుమ్మించాలి. అదృష్టవశాత్తు గింజ బయటకు వచ్చేసినా కూడా ఒకసారి ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ గింజ బయటకు రాకపోతే అప్పుడు తప్పనసరిగా ఈఎన్టీ వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. హాస్పిటల్‌కు వెళ్లే దారిపొడవునా చిన్నారి తలను కాస్త ముందుకు ఒంగి ఉంచేలా చూడాలి. హాస్పిటల్లో వైద్యులు ఫోర్సెప్స్తో జాగ్రత్తగా ఆ గింజను తీసేస్తారు. ఒక్కోసారి పిల్లలు ముక్కులో గింజలూ, అవీ పెట్టుకొని తల్లిదండ్రులకు చెప్పరు. ఎప్పుడైనా ఒక ముక్కు రంధ్రం నుంచి ఎక్కువగా చీమిడి కారుతున్నా, శ్వాసతీసుకునే సమయంలో శబ్దం ఎక్కువగా వస్తున్నా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. లేకపోతే ఇరుక్కున్న గింజల వల్ల చీముపట్టడం, జ్వరం రావడం, మరిన్ని ఇతర సమస్యలు తలెత్తవచ్చు. చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత వాంతులు చేసుకుంటారు. దీనికి పరిష్కారం? – చంద్రిక, నడిగూడెం చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి వాంతి చేసుకోవడం సహజం. దీనికి మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కానీ, నెమ్ము పట్టడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడక్కర్లేదు. బిడ్డ పెరిగేకొద్దీ లేదా ఘనాహారం మొదలుపెట్టాక సమస్య దానంతట అదే తగ్గుతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాక కనీసం అర్ధగంట సేపు బిడ్డ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లు చూసుకుంటే ఈ సమస్య చాలావరకు నివారించవచ్చు. పాలు తాగించాక తేన్పు తెప్పించడం ముఖ్యం. కొంతమంది చంటి పిల్లలు వాంతులు ఎక్కువగా చేసుకుంటారు. దానివల్ల సరిగా బరువు పెరగరు. కొంతమందికి ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. కొంతమంది పిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలు కావచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లు పెద్ద వాంతులు చేస్తారు. బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్ స్టెనోసిస్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్ తప్పనిసరి. ఏదిఏమైనా పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. డాక్టర్ శివరంజని హెచ్ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మాక్స్‌క్యూర్ షియోషా, మాదాపూర్, హైదరాబాద్ -
ఆరోగ్య దాయిని శుద్ధ్ కొలాన్ కేర్
మీరు మలబద్ధకము, అజీర్ణము, Irritable Bowel Syndrome తో సతమతమవుతున్నారా? వీటి నుంచి స్వేచ్ఛ కోరుకొంటున్నారా? అయితే మీకు కొలాన్ హైడ్రో థెరపీ ఎంతో మేలు చేసే ప్రక్రియ కావచ్చు. ఈ ప్రక్రియ గురించి కొన్ని వివరాలు ఎవరికి అవసరం: జీవనశైలిలో మార్పుల వల్ల మానసిక ఒత్తిడి, అలసట, జీర్ణ, విసర్జన క్రియల్లో మార్పులున్నవారికి.. ఎంత సేపు: 3035 minutes ఎలా: మల ద్వారము నుంచి Nozzle ప్రవేశపెట్టి 3 Stages Filtere చేసిన గోరు వెచ్చని నీళ్లను పెద్ద పేగుల్లో ప్రవేశపెట్టి లోపలి మాలిన్యాలు, విష పదార్థాలను శుభ్రం చేసే Naturopathic ప్రక్రియ. ఇది నొప్పిలేని ప్రక్రియ. వీటిలో ఉపయోగించే Nozzle ఒక్కసారి మాత్రమే వాడుతారు. కనుక Infectionకి తావు ఉండదని, మలబద్ధకానికి ఒక ప్రత్యేక Package రూపొందించామని Medico Marketing Director రాజగోపాల్ తెలిపారు. వీటితో పాటు ఆహార నియమాలు, మందులు ఇవ్వడంలో విసర్జన క్రియ వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ థెరపీ ఇప్పుడు Hyderabadలో కూడా అందుబాటులో ఉంది. గర్భవతులు, మలద్వార కేన్సర్‌తో బాధపడేవారు, Congestive Heart Failure రోగులు, Ulcerative, Colitis, Piles బాధితులకు ఈ ప్రక్రియ చేయకూడదు. గత రెండేళ్లలో అనేక Therapies చేసి, అందరికీ అందుబాటులో ఉండాలని విశాఖపట్నంలో కూడా మొదలుపెట్టామని రాజగోపాల్ తెలిపారు. త్వరలోనే ఇతర ప్రాంతాలకు Expand చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. Shuddh Colon care C/o. Reva Health, Skin & Hair, Opp. GVK Mall ingate Banjarahills, www.shuddhcoloncare.com email: info@shuddhcoloncare.com Phone: 8008002032, 8008001225 -
శుద్ధ్ కేర్...
మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ట్రిక్... ఈ సమస్యలు మనిషిని నిద్ర పోనివ్వవు. బిజీ లైఫ్ స్టైల్లో ఇవి చాలామందిని ఇబ్బందులు పెడుతున్నాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఇవి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. పెద్దపేగులో పేరుకుపోయిన మాలిన్యాలను కొలాన్ Hydrotherapy ద్వారా తొలగించవచ్చు. ఈ ట్రీట్మెంట్లో ఎలాంటి కాలుష్యం లేని పరిశుభ్రమైన డిస్టిల్డ్ వాటర్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది. రూం టెంపరేచర్ వద్ద ఉన్న నీటిని కూడా ఈ ట్రీట్మెంట్కు ఉపయోగించవచ్చు. ఈ నీటిని మలమార్గం (రెక్టమ్) ద్వారా పంపడానికి అమెరికా మందుల నియంత్రణ సంస్థ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) ఎఫ్‌డీఏ ఆమోదం పంపిన సంస్థలు తయారు చేసిన ప్రత్యేక నాజిల్‌ను ఉపయోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ నాజిల్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. మలమార్గంలోకి నాజిల్ ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. నాజిల్ ద్వారా లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుంది. లోపలికి వెళ్లిన నీరు పెద్ద పేగులోని మాలిన్యాలను శుభ్రం చేస్తుంది. మాలిన్యాలు వెళ్లిపోవడాన్ని యంత్రానికి ఉన్న ఆధునిక పైపుల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. కొలాన్ హైడ్రోథెరపీతో మేలు... ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. దీని ద్వారా మలబద్ధకం సమస్య దూరమైపోతుంది. పెద్దపేగులో మలం పేరుకుపోవడం వల్ల విషపదార్థాలు వెలువడుతాయి. కొలాన్ హైడ్రోథెరపీతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడిది హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రయోజనాలు మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక డయేరియా లాంటి జబ్బులు తగ్గుతాయి. ఒత్తిడి, ఉద్రిక్తతలు తగ్గుతాయి. విషపదార్థాలు తొలగటం వల్ల పెద్దపేగు క్రమాంకుచక కదలికలు మెరుగుపడతాయి. సంపూర్ణ ఆరోగ్యం.. కొలాన్ హైడ్రో థెరపీ పెద్దపేగు ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. యూఎస్ఏ, కెనడా, జర్మనీ దేశాలలో ఈ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రక్రియ చేసేముందు మెడికల్ ఎసెస్మెంట్ తప్పనిసరి. మధుమేహం, రక్తపోటు, శరీరంలో కొవ్వుశాతం, మెటబాలిక్ రేట్లను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స నిర్వహిస్తున్నారు. చికిత్సలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. వీరికి పనికిరాదు... గర్భవతులు, పెద్దపేగు, మల ద్వార కేన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రబుల్, అల్సరేటివ్ కొలైటిస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి ఈ చికిత్స పనికిరాదు. అడ్రస్ శుద్ధ్ కోలన్ కేర్, మర్చంట్ టవర్స, జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా, రోడ్ నం. 4, బంజారాహిల్స్ హైదరాబాద్