నా వయసు 43 ఏళ్లు. కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం. డాక్టర్ గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియోలో చికిత్స ఉందా?
– ఎమ్. రామసుబ్బారెడ్డి, కర్నూలు
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రిక్ ముదిరితే అవి కడుపులో అల్సర్స్ (పుండ్లు)గా ఏర్పడతాయి.
కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమ వుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు : కడుపు నొప్పి, మంట, ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙మలం రంగు మారడం వంటివి.
జాగ్రత్తలు : సమయానికి ఆహారం ∙కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగ, మద్యపానం మానేయాలి ∙మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. భోజనానికి నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండాలి.
చికిత్స : ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యత చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
పేరుకొరుకుడుకు చికిత్స ఉందా?
మా అమ్మాయికి 25 ఏళ్లు. ఈ మధ్య ఒకే దగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? – సురభి, ఖమ్మం
పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించు కోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోయి తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.
కారణాలు : ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు : ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి.
నిర్ధారణ : ఈ సమస్య నిర్దుష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు.
చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment