నా వయసు 32 ఏళ్లు. కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను.
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. యానల్ ఫిషర్స్ అని చెప్పారు. మందులు వాడుతున్నాను. ప్రయోజనం లేదు. నా సమస్య హోమియో మందులతో నయం అవుతుందా? – విశ్వేశ్వరరావు, అనంతపురం
దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. పైల్స్, ఫిషర్స్ గురించి కొన్ని వివరాలు...
పైల్స్ : మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి వాపునకు గురై తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. రక్తస్రావం కూడా కనిపిస్తుంది. సమస్యలను పైల్స్ అంటారు.
కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, మహిళల్లో గర్భధారణ సమయంలో పడే ఒత్తిడి వంటివి పైల్స్‌ను కలగజేసే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. మలవిసర్జన సమయంలో పడే ఒత్తిడితో అవి చిట్లి రక్తస్రావం కనిపిస్తుంది.
ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది.
కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడంతో ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
చికిత్స : జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి తిరగబెట్టకుండా కూడా చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్