ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఖర్జూరం తీసుకుంటే మలబద్దకం వస్తుందా?. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉందా?. అంటే ఔననే చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రీజన్ ఏంటో సవివరంగా చూద్దామా..!.
మలబద్ధకం అనేది సాధారణ సమ్య. దీనిని సరైన ఆహారం, జీవనశైలితో సర్దుబాటు చేయవచ్చు. సహజ చక్కెరలకు, ఖనిజాలకు అద్భుతమైన ఈ ఖర్జూరం మలబద్ధకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. దీనిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి..మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీర్ణం కావడం కష్టమవుతుంది. శరీరం లోపల అగ్నిని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాకాకుండా వాటిమీద మక్కువకొద్ది లాగిస్తే సమస్యలు తప్పవని చెబుతున్నారు నిఫుణలు.
ఎలా తీసుకుంటే బెటర్..
నానాబెట్టిన ఖర్జూరాలు బరువు తగ్గించేందుకు, జీర్ణక్రియకు మంచిది.
ఖర్జూరాలు తినే ముందు ఎండు అల్లం పొడిన జోడించండి. పొడి అల్లం లేదా సాంత్ ఆహారాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది.
అంతేగాదు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అత్తిపండ్లతో కూడిన 'ఖజురాధి మంథా'ని తయారు చేయడానికి ఒక కూలింగ్ డ్రింక్ సిద్ధం చేయండి. ఈ రిఫ్రెష్ డ్రింక్ జీర్ణ సమస్యలను నివారించి, హైడ్రేట్‌గా ఉంటుంది.
మంచి ప్రయోజనాలను పొందాలంటే రోజుకు మూడు ఖర్జూరాలను స్నాక్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యానికి కూడా మంచిందని చెబుతున్నారు.
(చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగనీటిని ట్రై చేయండి..!)
Comments
Please login to add a commentAdd a comment