Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్‌, రెసిపీలు | Christmas 2024: Check here for the best cake recipe | Sakshi
Sakshi News home page

Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్‌, రెసిపీలు

Published Sat, Dec 21 2024 11:48 AM | Last Updated on Sat, Dec 21 2024 12:21 PM

Christmas 2024: Check here for the best cake recipe

క్యాలెండర్‌ చివరికి వచ్చేశాం. హాయ్‌ చెప్పడానికి క్రిస్‌మస్‌ వస్తోంది. కేక్‌ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్‌లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్‌మస్‌కి సిద్ధమైంది . మీరూ రెడీనా.

సెమోలినా కోకోనట్‌ కేక్‌  
కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర  పొడి– 150 గ్రాములు; బటర్‌– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్‌; వెనీలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్‌; బేకింగ్‌  సౌడర్‌– టీ స్పూన్‌; బేకింగ్‌ సోడా– అర టీ స్పూన్‌; ఉప్పు – చిటికెడు; బటర్‌– టీ స్పూన్‌; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).

షుగర్‌ సిరప్‌ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్‌; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్‌ ఎసెన్స్‌ – 2 చుక్కలు.

తయారీ: మొదట షుగర్‌ సిరప్‌ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్‌ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్‌ ఎసెన్స్‌ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్‌ మీద నుంచి దించేయాలి ∙కేక్‌ ట్రేకి టీ స్పూన్‌ బటర్‌ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్‌ చేయాలి 

∙కేక్‌ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక  పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.

∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్‌ సిరప్‌ని కేక్‌ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్‌ చల్లారేటప్పటికి షుగర్‌ సిరప్‌ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకుని ముక్కలుగా కట్‌ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్‌నట్‌ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్‌ పిస్తా); నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్‌; గసగసాలు – టేబుల్‌ స్పూన్‌.

ఖజూర్‌ బర్ఫీ 
తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్‌నట్స్‌ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్‌లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్‌నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్‌ వేసి కలుపుతూ వేయించాలి. 

ఖర్జూరం పేస్ట్‌ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్‌ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్‌ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్‌ చేసుకుంటే ఖజూర్‌ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement