Best South Indian Sweet Recipes: How To Prepare Carrots And Dates Mysore Pak In Telugu - Sakshi
Sakshi News home page

Carrots Dates Mysore Pak Recipe: ఇలా చేస్తే క్యారట్స్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు..

Published Mon, Jul 31 2023 10:53 AM | Last Updated on Mon, Jul 31 2023 11:20 AM

How To Make Carrots Dates Mysore Pak - Sakshi

క్యారట్‌ డేట్స్‌ స్వీట్‌ తయారికి కావల్సినవి:
క్యారట్‌ తురుము – పావు కప్పు ; విత్తనాలు తీసేసిన డేట్స్‌ – పావు కప్పు; బెల్లం – పావు కప్పు; శనగపిండి – అరకప్పు; బ్రౌన్‌సుగర్‌ – కప్పు; నెయ్యి – అరకప్పు; నూనె- పావు కప్పు.

తయారీ విధానమిలా..

  • శనగపిండిని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ∙టేబుల్‌ స్పూను నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  • మందపాటి బాణలిలో మిగిలిన నెయ్యి, నూనె వేసి ఐదు నిమిషాలు వేడి చేసి పక్కనపెట్టుకోవాలి.
  • బెల్లంలో పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి ∙
  • క్యారట్‌,డేట్స్, బెల్లం నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి .గ్రైండ్‌ చేసి ప్యూరీని ముక్కలు లేకుండా వడగట్టి తీసుకోవాలి.
  • బాణలిలో బ్రౌన్‌ సుగర్, అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి ∙షుగర్‌ కరిగిన తరువాత క్యారట్‌ డేట్స్‌ ప్యూరిని వేసి సన్ననని మంట మీద తిప్పుతూ ఉండాలి .
  • తీగ పాకం వచ్చాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి /నూనెను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి
  • నెయ్యి మొత్తాన్ని మిశ్రమం పీల్చుకుని దగ్గరపడిన తరువాత దించి నెయ్యిరాసిన ప్లేటులో పోసుకోవాలి

  • మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్‌ చేసుకుంటే క్యారట్, డేట్స్‌ పాక్‌ రెడీ.  ఇలా చేస్తే పిల్లలు క్యారట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement