
మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఫిజికల్ ఇన్ ఆక్టివిటీ ఇలా మొదలైన కారణాల వల్ల కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. దీనికి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లేదు. తాజాగా ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్‌తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని సైంటిస్టులు తేల్చారు.
ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది అమెరికన్లు మలబ్దకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రోజువారి బిజీలైఫ్‌లో సరైన లైఫ్‌స్టైల్ అనుసరించకపోవడం ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే మలబద్దకం వల్ల సమస్య తీవ్రమైన గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
తాజాగా జియాంగ్నాన్,హైనాన్‌తో పాటు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మలబద్దకానికి సరైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్‌తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని తేల్చారు.ప్రోబయోటిక్స్ జీర్ణాశయంలోని ప్రయోజనకరమైన బాక్టీరియా. ఇది గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపర్చడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది.
ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియాలోని Bలాంగమ్‌లోని కొన్ని జన్యువులు, abfA జన్యు సమూహాన్ని కలిగి ఉన్నాయని ఇది ప్రేగు కదలికలను పెంచి డైజెస్టిన్ హెల్త్‌కి సహాయపడుతుందని పేర్కొన్నారు. బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ రీసెర్చ్ కోసం మలబద్ధకం ఉన్న ఎలుకలకు abfA క్లస్టర్ లేకుండా B.లాంగమ్ ఇచ్చినప్పుడు, ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీన్ని బట్టి abfA క్లస్టర్ మలబద్దకానికి చికిత్సకు కీలకమని కనుగొన్నారు.