Probiotics
-
నటి నీతూ కపూర్ ఆరుపదుల వయసులో కూడా యంగ్‌గా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
నటి నీతూ కపూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా మెప్పించి ప్రేక్షకుల మన్నలను పొందిన బాలీవుడ్ సీనియర్ నటి. 70లలో ఆమె హావా మాములుగా ఉండేది కాదు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిషికపూర్‌ని వివాహ మాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 66 ఏళ్లు. అయినా ఈ ఏజ్‌లో కూడా యువ హీరోయిన్ల మాదిరి ఫిట్‌గా భలే కనిపిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తన ఫిట్నెస్ రహస్యం గురించి బయటపెట్టింది. ప్రోబయోటిక్ రెసిపీ గేమ్ ఛేంజర్‌ని ఫాలో అవుతానని తెలిపింది. అసలేంటి గేమ్ ఛేంజర్ అంటే..!.నీతూ కపూర్ సీక్రెట్ ప్రోబయోటిక్ రెసిపీ 'కంజి రైస్'. ఇది దక్షిణ భారత వంటకం. చాలా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల గల వంటకం. ప్రేగులలో ఉండే గూఫ్ బ్యాక్టీరియా పరిమాణాన్ని పెంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుందట. ఇది ఎలా చేస్తారంటే..ఓ మట్టి పాత్రలో వండి అన్నం, చెంచా నువ్వులు వండిన అన్నం నీళ్లు లేదా గంజి వేసి రాత్రంతా పులియనివ్వండి. దీన్ని ఉదయమే భోజనంగా తీసుకోండి. ఇందులో పచ్చడి లాంటిది వేసుకుని తింటే ఆ రుచే వేరు అంటుంది నీతూ. మన ఆంధ్రలో అనే 'గంజి అన్నమే' ఈ 'కంజి రైస్'. ఇది బెస్ట్ ప్రోబయోటిక్ ఆహారం. అందువల్లే తాను అనారోగ్యంగా లేదా కడుపునొప్పి వచ్చినప్పుడూ దీన్ని ఇష్టంగా తింటానని చెప్పుకొచ్చింది నీతూ. ప్రయోజనాలు..తేలికగా జీర్ణమవుతుంది. కడుపుని శాంతపరుస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపకరిస్తుంది.అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడంలో సహాయపడుతుంది. మంచి ఎనర్జీ బూస్ట్. రోజంతా స్థిరమైన తక్షణ శక్తిని ఇస్తుంది. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్..పెరుగు: అత్యంత ప్రసిద్ధ ప్రోబయోటిక్ ఆహారం. ఇది గట్ ఆరోగ్యాన్ని పెంపొందించే లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సౌర్‌క్రాట్: పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేయబడిన సౌర్‌క్రాట్ అనేది మరో ప్రోబయోటిక్ పవర్‌హౌస్. ఇందులో ఫైబర్, విటమిన్లు, లాక్టోబాసిల్లస్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.కిమ్చి: కొరియన్ వంటకాలలో ప్రధానమైనది, కిమ్చి అనేది మసాలా పులియబెట్టిన కూరగాయల వంటకం. సాధారణంగా క్యాబేజీ, ముల్లంగితో తయారు చేస్తారు.(చదవండి: ముప్పైలో హృదయం పదిలంగా ఉండాలంటే..!) -
మలబద్దకానికి ఇలా చెక్ పెట్టండి!
మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఫిజికల్ ఇన్ ఆక్టివిటీ ఇలా మొదలైన కారణాల వల్ల కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. దీనికి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లేదు. తాజాగా ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని సైంటిస్టులు తేల్చారు. ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది అమెరికన్లు మలబ్దకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రోజువారి బిజీలైఫ్‌లో సరైన లైఫ్‌స్టైల్ అనుసరించకపోవడం ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే మలబద్దకం వల్ల సమస్య తీవ్రమైన గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. తాజాగా జియాంగ్నాన్,హైనాన్తో పాటు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మలబద్దకానికి సరైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియా లాంగమ్తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చని తేల్చారు.ప్రోబయోటిక్స్ జీర్ణాశయంలోని ప్రయోజనకరమైన బాక్టీరియా. ఇది గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపర్చడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రోబయోటిక్ బిఫిడోబాక్టీరియాలోని Bలాంగమ్లోని కొన్ని జన్యువులు, abfA జన్యు సమూహాన్ని కలిగి ఉన్నాయని ఇది ప్రేగు కదలికలను పెంచి డైజెస్టిన్ హెల్త్‌కి సహాయపడుతుందని పేర్కొన్నారు. బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ రీసెర్చ్ కోసం మలబద్ధకం ఉన్న ఎలుకలకు abfA క్లస్టర్ లేకుండా B.లాంగమ్ ఇచ్చినప్పుడు, ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీన్ని బట్టి abfA క్లస్టర్ మలబద్దకానికి చికిత్సకు కీలకమని కనుగొన్నారు. -
ప్రోబయాటిక్స్‌తో డిప్రెషన్ దూరం!
మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళంలోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి అందడానికి అవి ఎంతో తోడ్పతతాయి. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు, మజ్జిగ, కొద్దిగా పులిసేందుకు అవకాశం ఉన్న పిండితో చేసే ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తీసుకొమ్మని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇప్పుడు ఇదే ప్రో–బ్యాక్టీరియా మనుషుల్లోని డిప్రెషన్ తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్‌కు చెందిన మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీడిప్రెసెంట్స్ వాడుతున్న కొందరిని ఓ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా... డిప్రెషన్ చికిత్స కోసం ముందుకొచ్చిన వలంటీర్లలో కొంతమందికి ప్రోబయాటిక్స్ ఇచ్చారు. వారిని పరీక్షించి చూసినప్పుడు... ఇలా ప్రోబయాటిక్స్ పుష్కలంగా తీసుకుంటున్న వ్యక్తుల మెదడు పనితీరు మరింత త్వరగా నార్మల్ అయ్యిందంటూ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైకియాట్రిస్ట్ అన్నా కియారా స్క్వాబ్ పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవరాశికీ... మెదడుకూ మధ్య ఏదో సంబంధం ఉందని ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల్లో తేలినా... అదెలా జరుగుతుందన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రోబయాటిక్ ఆహారంతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతోంది. అంతమాత్రాన డిప్రెషన్‌కు ప్రో–బయాటిక్ ఒక్కటే చికిత్స అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. కానీ ఒక్క యాంటీడిప్రెసెంట్స్ మాత్రమే వాడుతున్న మూడింట రెండు వందల మందికి వెంటనే మంచి గుణం కనిపించడం లేదు. అయితే మందులు వాడుతూనే ప్రోబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మంచి గుణమే కనిపిస్తోంది. ప్రోబయాటిక్స్లోని ఏ అంశం ఇలా మేలు చేస్తోందనేది కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాంతో భవిష్యత్తులో మరింత సమర్థంగా డిప్రెషన్‌కు చికిత్స అందించే వీలుంద’’ని చెబుతున్నారు అన్నా కియారా పేర్కొంటున్నారు. -
మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా?
బ్యాక్టీరియా.... ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తొస్తాయి. కానీ, పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలో ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా, ఈస్ట్‌లను ప్రోబయోటిక్స్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట! సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థలో ఉంటూ, జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన డైజెస్టివ్ ట్రాక్‌లో దాదాపు 400 రకాల ‘గుడ్’ బ్యాక్టీరియా ఉంటాయి. ఆహారపదార్ధాల జీర్ణం, వాటి చోషణ (టuఛిజుజీnజ), ఇమ్యూనిటీ పెంచడం వంటి అనేక విషయాల్లో ఇవి సాయం చేస్తుంటాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీ బయోటిక్స్ వాడితే ఆ సమయంలో ఇవి కూడా నశించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ’హెల్తీ గట్’(ఆరోగ్యవంతమైన అన్నవాహిక)ను మెయిన్‌టెయిన్ చేయవచ్చు. వేటి ద్వారా పొందొచ్చు? ఎక్కువగా ఫర్మెంటెడ్ పదార్ధాల్లో ఈ ప్రోబయోటిక్స్ లభిస్తాయి. పెరుగు, యాపిల్ సిడార్, యోగర్ట్, క్యాబేజీతో చేసే సౌర్‌క్రౌట్, సోయాబీన్స్‌తో చేసే టెంపె, పచ్చళ్లు, మజ్జిగ లాంటివి గట్‌లో గుడ్ బ్యాక్టీరియా పెండచడంలో సాయం చేస్తాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజనకారులు. ఎంత డోసేజ్ మంచిది? సాధారణంగా రోజుకు 30 కోట్ల నుంచి 100 కోట్ల సీఎఫ్‌యూ(కాలనీ ఫామింగ్ యూనిట్స్– బ్యాక్టీరియా కొలమాని) ప్రోబయోటిక్స్‌ను డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేకించి జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇబ్బందులుంటే ఈ మోతాదు మరికొంత పెంచుతారు. లాభాలనేకం: ∙ఇరిటబుల్ బౌల్ సింట్రోమ్(ఐబీఎస్)తో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియాలాంటి జీర్ణకోశ వ్యాధులు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హీలికోబాక్టర్ పైలోరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అల్సర్లు, జీర్ణకోశ కాన్సర్పై యుద్ధంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ప్రోబయోటిక్స్ బరువుతగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని ఇన్ఫ్లమేషన్లపై పోరాటం చేస్తాయి. కొన్ని కీలక బ్యాక్టీరియాలు డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడంలో సాయపడతాయి. మరికొన్ని ఎల్డీఎల్(బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించేందుకు ఉపకరిస్తాయి. ప్రొబయోటిక్స్ కారణంగా చర్మం కాంతి వంతంగా కావడం, మొటిమలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సాధారణంగా ప్రోబయోటిక్స్ వాడకంతో ఎలాంటి ఇబ్బందులుండవు. కొందరికి మాత్రం జీర్ణ సంబంధిత తేలికపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి స్వల్పకాలంలోనే తగ్గిపోతాయి. lఅయితే ఎయిడ్స్ పేషంట్లలో మాత్రం ఇవి ఒక్కోమారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ∙ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులున్నవారికి సైతం ఇవి కొత్త తలనొప్పులు తెస్తాయి. అందువల్ల తీవ్రమైన వ్యాధులున్నవాళ్లు, గర్భిణులు, పసిపిల్లలు, వయోవృద్దులు ప్రోబయోటిక్స్ వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. -
ఆ ఆహారంతో నిత్యం సంతోషం..
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఒత్తిడిని ఎదుర్కొవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మనం ప్రోబయోటిక్స్ ఆహారం(మంచి బ్యాక్టేరియా) తీసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండవచ్చు. ప్రోబయోటిక్స్ ఆహారం కావాలంటే కొద్దిసేపు పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణుల ప్రకారం డయెరియా, మలమద్దకం తదితర సమస్యలను ప్రోబయోటిక్స్‌తో ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. ప్రోబయోటిక్స్‌తో ఆనందంగా ఎలా ఉండగలం ఆనందంగా ఉండడానికి ప్రోబయోటిక్స్ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు డాక్టర్ అనుజా గౌర్ తెలిపారు. అయితే ఓ చిన్న ఉదాహరణతో ఆమె విశ్లేషించారు. కాగా డిప్రెషన్, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి డాక్టర్లు స్వాంతన కలిగించే మందులు సూచిస్తుంటారు. అదేవిధంగా ప్రోబయోటిక్స్‌తో మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే ఎక్కువగా పాలు సంబంధించిన పదార్ధాలలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా లభిస్తుంది. సానుకూల ఆలోచనలు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, అలాకాకుండా ఎదైనా సమస్యుంటే కావాల్సిన శక్తి అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే ప్రోబయోటిక్స్ ఆహారం తీసుకుంటే సానుకూల ఆలోచనలతో పాటు సంతోషంగా ఉండవచ్చు -
ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!
మనం రోజూ తినే ఇడ్లీలు, దోసెలు, రోజూ తాగే మజ్జిగ కూడా మందులా ఉపయోగపడతాయంటే నమ్మగలరా? ఎన్నోరకాల జబ్బుల్నీ నయం చేస్తాయి కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా వాస్తవం. అలాగే కాద్దిసేపు వదిలేస్తే పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. ప్రోబయోటిక్స్ ఇచ్చే సందర్భాలు... యాంటీబయాటిక్స్ వాడినప్పుడు: డాక్టర్లు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేసినప్పుడు అవి మనలోని హాని చేసే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసేవాటినీ చంపేస్తాయి. దాంతో మనలో కొన్ని రకాల సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అంటే కడుపులో గ్యాస్ పెరగడం, మజిల్ క్రాంప్స్, డయేరియా వంటివి. మనలో ఉండే ప్రోబయాటిక్స్ మన దేహానికి అవసరమైన కొన్ని విటమిన్లు స్వాభావికంగానే అందేలా చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్ కారణంగా విటమిన్లు కూడా అవసరమైన మేరకు అందని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఈ పరిణామాన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్‌తో పాటు కొన్ని విటమిన్లు, ప్రోబయాటిక్స్ డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. డయేరియాతో బాధపడేవారికి: కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా నీళ్ల విరేచనాలు అవుతున్నవారికి సైతం ప్రో–బయాటిక్స్ ఇస్తారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో విరేచనం సరిగా కాదు లేదా అదేపనిగా విరేచనాలు కావచ్చు. తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్: అల్సరేటివ్ కొలైటిస్ లేదా క్రోన్స్ డిజీస్ ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ మేలు చేస్తాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ: కొందరిలో పేగులో పుండు పడి, పేగుకు రంధ్రం పడేలా చేసే హెలికోబ్యాక్టర్ పైలోరీ కారణంగా కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సైతం ప్రో–బయాటిక్స్ మంచి మేలు చేస్తాయి. ఇడ్లీ, దోసె, మజ్జిగలు మందెలా అవుతాయంటే... మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేకరకాల బాక్టీరియా ఉంటుంది. మన చుట్టే కాదు.. మన చర్మంపైనా, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మన ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయన్నమాట. మన ఆహార సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో–బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీపిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ వాయి దింపుతాం. మన దక్షిణభారతీయులు ఇడ్లీ, దోసె తింటే... గుజరాత్ వంటి చోట్ల ధోక్లా అనే వంటకాన్ని కూడా పిండి పులిసే వరకు ఉంచి చేసుకుంటారు. డాక్టర్ శరత్ చంద్ర జి. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్. -
ప్రొబయోటిక్స్‌తో ఆ వ్యాధులకు చెక్
లండన్ : ప్రొబయోటిక్స్‌తో పెద్దల్లో ఎముకల పటుత్వం పెరుగుతుందని, వీటి వాడకంతో ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయని పరిశోధకులు వెల్లడించారు. మంచి బ్యాక్టీరియాతో కూడిన సప్లిమెంట్స్ శరీరానికి మేలు చేస్తాయని స్వీడన్ పరిశోధకులు చేపట్టిన తాజా అథ్యయనం తెలిపింది. ముఖ్యంగా వృద్ధుల్లో ప్రొబయోటిక్స్ వాడకంతో ఎముకలు దెబ్బతినకుండా కాపాడవచ్చని గుర్తించారు. పెద్దల్లో ఎముకలు విరిగే పరిస్థితిని నివారించే చికిత్సలో నూతన మైలరాయిగా తాజా అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని సర్వే చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్ గొతెన్‌బర్గ్ పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో ఎముకలను బలహీనపరిచే ఓసియోసొరోసిస్ వ్యాధి బారిన పడుతున్న క్రమంలో తాజా అథ్యయనం వెలువడింది. ప్రొబయోటిక్స్‌తో చికిత్స ద్వారా రానున్న రోజుల్లో ఈ తరహా వ్యాధులను నియంత్రించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. -
టాబ్లెట్స్ ఇండియా నుంచి మరో ప్రొబయోటిక్
హైదరాబాద్: టాబ్లెట్స్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసుకుంది. కంపెనీ తాజాగా మరో వినూత్నమైన ప్రొబయోటిక్ ‘రెస్క్యునేట్’ను దేశవ్యాప్తంగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. జపాన్‌కు చెందిన మొరినాగా మిల్క్ ఇండస్ట్రీ సంస్థ ద్వారా ప్రొబయోటిక్ బైఫైడొబాక్టీరియమ్ బ్రెవ్ ఎం–16వి నుంచి దీన్ని అభివృద్ధి చేశారు. నవజాత శిశువుల్లో రోగనిరోధక శక్తి అభివృద్ధి చేసేందుకు, రోగనిరోధక స్పందనను మాడ్యులేట్ చేసేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా టాబ్లెట్స్ ఇండియా ఇప్పటికే కడుపు, జననేంద్రియ, దంత, జీర్ణ సంబంధిత ఔషధాలను అందిస్తోంది. -
‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం!
రసాయనాల వాడకం తక్కువ.. దిగుబడి ఎక్కువ! వెనామీ, చేపల చెరువుల్లో రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్‌కు బదులుగా జీవామృతం 90% తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం.. ఖర్చు కూడా! పది రోజులు ముందుగానే పట్టుబడి.. మేత ఖర్చు ఆదా హెక్టారుకు 9-12 టన్నుల రొయ్యల దిగుబడి.. రసాయనాలు వాడిన చెరువుల్లో కన్నా 20% అధిక దిగుబడి కోస్తా జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో రొయ్యలు, చేపల సాగుపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిస్థాయి శ్రద్ధచూపి ప్రోత్సహించకపోయినా.. రైతులు తమంతట తాముగా కొత్తదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే వెనామీ రొయ్యలు, తెల్ల చేపల సాగులో రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా జీవామృతం వాడుతూ అధిక దిగుబడులు పొందుతున్నారు. ఎరువుల ఖర్చులు 90% తగ్గించుకుంటూ.. రసాయనిక అవశేషాలు తక్కువగా ఉండే రొయ్యలు, చేపల పెంపకం దిశగా ముందడుగు వేస్తున్నారు. గుంటూరు జిల్లా తీర ప్రాంత మండలాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పంటల సాగులో రసాయనిక ఎరువులకు బదులు జీవామృతం వాడుతున్నారు. కర్లపాలెంనకు చెందిన రైతు పెనుమత్స కృష్ణంరాజు ప్రకృతి వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ వద్ద శిక్షణ పొందారు. వరి, మామిడి వంటి పంటలను జీవామృతం తదితరాలతో పండిస్తూ చక్కటి ఫలితాలు పొందుతున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్న జీవామృతాన్ని వెనామీ రొయ్యల సాగులో ఎందుకు వాడకూడదు? అన్న ఆలోచనతో.. కృష్ణంరాజు బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని తమ వాసంతీ ఆక్వాకల్చర్ చెరువుల్లో జీవామృతాన్ని ప్రయోగాత్మకంగా వాడి చూశారు. ఫలితాలు అన్నివిధాలా మెరుగ్గా ఉండడంతో.. గత నాలుగైదేళ్లుగా 150 ఎకరాల్లో జీవామృతం వాడుతూ వెనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని తమ చెరువుల్లో సైతం ఈ పద్ధతిని అనుసరించాలనే ఆలోచనలో ఉన్నారు. కృష్ణంరాజు ప్రయోగం ఆక్వా రంగంలో కొత్త విధానానికి నాంది పలికింది. మరికొందరు ఆక్వా రైతులు కూడా ఈవైపు దృష్టి సారిస్తున్నారు. 90% తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం! ఆక్వా చెరువు నీటిలో రొయ్యలు, చేపలకు సహజాహారమైన ప్లాంక్టాన్ (ప్లవకాలు) వృద్ధి చెందడానికి యూరియా, సూపర్ ఫాస్ఫేట్ వంటి రసాయనిక ఎరువులతోపాటు ప్రోబయోటిక్స్‌ను వాడుతుంటారు. జీవామృతం వాడుతున్నందున వీటి వాడకం 90% మేరకు తగ్గిందని సాంకేతిక నిపుణుడు నవనీత కృష్ణన్ తెలిపారు. రొయ్యల పంట కాలం నాలుగైదు నెలలు. 4 హెక్టార్ల(10 ఎకరాల) చెరువులో రసాయనిక ఎరువులతోపాటు ప్రోబయోటిక్స్ వాడకానికి రూ. 5-6 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, వీటి బదులుగా జీవామృతం వాడితే అయ్యే ఖర్చు రూ. 50-60 వేలు మాత్రమేనని ఆయన చెప్పారు. హెక్టారుకు 5 లక్షల చొప్పున రొయ్యల సీడ్ వేస్తున్నామని, దిగుబడి 9-12 టన్నుల వరకు వస్తోందని కృష్ణన్ వివరించారు. రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్ విరివిగా వాడిన చెరువుల్లోకన్నా తమ చెరువుల్లో 20% అధిక దిగుబడి వస్తోందని వివరించారు. మోతాదు మించినా పర్వాలేదు! హెక్టారు(రెండున్నర ఎకరాలు) చెరువులో ఒకసారి చల్లడానికి 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. డ్రమ్ములో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల పేడ, రెండు కేజీల పెసర/ మినుము/ కందులు/ సెనగ పిండి, రెండు కేజీల బెల్లం, రసాయనిక ఎరువులు తగలని గట్టు మట్టి కేజీ.. కలిపి రెండు రోజుల పాటు డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం నిమిషం పాటు సవ్యదిశలో తిప్పాలి. అనంతరం చెరువు నీటిపై ప్రోబయోటిక్స్‌ను ఏ విధంగా చల్లుతామో ఆ విధంగానే జీవామృతాన్ని ప్రతి మూడు రోజులకోసారి చల్లాలి. ఇంకా ఎక్కువ సార్లు, ఎక్కువ మోతాదులో చల్లినా ఎటువంటి ప్రమాదం లేదు. ప్రోత్సహిస్తే మన ‘ఆక్వా’కు తిరుగుండదు! మన ఆక్వా రైతుల ప్రయోగశీలత పుణ్యమా అని రసాయనిక అవశేషాలు తక్కువగా ఉండే రొయ్యలు, చేపల వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభం కావడం శుభపరిణామం. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు ప్రస్తుతం ప్రత్యేక మార్కెట్ లేదు. జపాన్ వంటి దేశాలు ఆర్గానిక్ రొయ్యలకు సమీప భవిష్యత్తులోనే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఈ రొయ్యలకు విదేశీ విపణిలో ప్రత్యేక ధర లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం పరిశోధనలు చేపట్టి, సముచిత రీతిన ప్రోత్సాహాన్నందిస్తే విదేశీ మార్కెట్లలో మన ఆక్వా ఉత్పత్తులకు తిరుగుండదు. స్థానికంగా కూడా ఆరోగ్యదాయకమైన చేపలు, రొయ్యలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. - ఎం.అంజయ్య, బాపట్ల, గుంటూరు జిల్లా