హైదరాబాద్: టాబ్లెట్స్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసుకుంది. కంపెనీ తాజాగా మరో వినూత్నమైన ప్రొబయోటిక్ ‘రెస్క్యునేట్’ను దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. జపాన్‌కు చెందిన మొరినాగా మిల్క్ ఇండస్ట్రీ సంస్థ ద్వారా ప్రొబయోటిక్ బైఫైడొబాక్టీరియమ్ బ్రెవ్ ఎం–16వి నుంచి దీన్ని అభివృద్ధి చేశారు.
నవజాత శిశువుల్లో రోగనిరోధక శక్తి అభివృద్ధి చేసేందుకు, రోగనిరోధక స్పందనను మాడ్యులేట్ చేసేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా టాబ్లెట్స్ ఇండియా ఇప్పటికే కడుపు, జననేంద్రియ, దంత, జీర్ణ సంబంధిత ఔషధాలను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment