నటి నీతూ కపూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా మెప్పించి ప్రేక్షకుల మన్నలను పొందిన బాలీవుడ్ సీనియర్ నటి. 70లలో ఆమె హావా మాములుగా ఉండేది కాదు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిషికపూర్‌ని వివాహ మాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 66 ఏళ్లు. అయినా ఈ ఏజ్‌లో కూడా యువ హీరోయిన్ల మాదిరి ఫిట్‌గా భలే కనిపిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తన ఫిట్‌నెస్ రహస్యం గురించి బయటపెట్టింది. ప్రోబయోటిక్ రెసిపీ గేమ్ ఛేంజర్‌ని ఫాలో అవుతానని తెలిపింది. అసలేంటి గేమ్ ఛేంజర్ అంటే..!.
నీతూ కపూర్ సీక్రెట్ ప్రోబయోటిక్ రెసిపీ 'కంజి రైస్'. ఇది దక్షిణ భారత వంటకం. చాలా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల గల వంటకం. ప్రేగులలో ఉండే గూఫ్ బ్యాక్టీరియా పరిమాణాన్ని పెంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుందట.
ఇది ఎలా చేస్తారంటే..
ఓ మట్టి పాత్రలో వండి అన్నం, చెంచా నువ్వులు వండిన అన్నం నీళ్లు లేదా గంజి వేసి రాత్రంతా పులియనివ్వండి. దీన్ని ఉదయమే భోజనంగా తీసుకోండి. ఇందులో పచ్చడి లాంటిది వేసుకుని తింటే ఆ రుచే వేరు అంటుంది నీతూ. మన ఆంధ్రలో అనే 'గంజి అన్నమే' ఈ 'కంజి రైస్'. ఇది బెస్ట్ ప్రోబయోటిక్ ఆహారం. అందువల్లే తాను అనారోగ్యంగా లేదా కడుపునొప్పి వచ్చినప్పుడూ దీన్ని ఇష్టంగా తింటానని చెప్పుకొచ్చింది నీతూ.
ప్రయోజనాలు..
తేలికగా జీర్ణమవుతుంది. కడుపుని శాంతపరుస్తుంది.
ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపకరిస్తుంది.
అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడంలో సహాయపడుతుంది.
మంచి ఎనర్జీ బూస్ట్. రోజంతా స్థిరమైన తక్షణ శక్తిని ఇస్తుంది.
ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్..
పెరుగు: అత్యంత ప్రసిద్ధ ప్రోబయోటిక్ ఆహారం. ఇది గట్ ఆరోగ్యాన్ని పెంపొందించే లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది.
సౌర్‌క్రాట్: పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేయబడిన సౌర్‌క్రాట్ అనేది మరో ప్రోబయోటిక్ పవర్‌హౌస్. ఇందులో ఫైబర్, విటమిన్లు, లాక్టోబాసిల్లస్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.
కిమ్చి: కొరియన్ వంటకాలలో ప్రధానమైనది, కిమ్చి అనేది మసాలా పులియబెట్టిన కూరగాయల వంటకం. సాధారణంగా క్యాబేజీ, ముల్లంగితో తయారు చేస్తారు.
(చదవండి: ముప్పైలో హృదయం పదిలంగా ఉండాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment