చాలా మందికి రోజు ప్రారంభం కావడం చాలా ఇబ్బందిగా జరుగుతుంది. చాలామందిలో పొద్దున్నే సాఫీగా జరగాల్సిన మలవిసర్జన అనే ప్రక్రియ నరకప్రాయంగా జరుగుతుంది. ఉదయమే ఆ పనికాస్తా సజావుగానూ, సాఫీగానూ జరిగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ పొద్దున్నే మలవిసర్జన ప్రక్రియ హాయిగా జరగకపోతే ఆ ఇబ్బంది రోజంతా కొనసాగుతూనే ఉంటుంది.
కారణాలేమిటి?
ఇటీవల మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, మన ఆహారపు అలవాట్లు మలబద్దకానికి కారణమవుతున్నాయి. గతంలో మనం తీసుకునే ఆహారంతో పీచుపదార్థాలు తగినంతగా అంది మలవిసర్జన సాఫీగా జరిగేది కానీ ఇటీవల ప్రతివారూ తమ ఆహారంలో జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత ఎక్కువ చేస్తున్నాయి.
పీచుపదార్థాల పరిమాణం ఎంత ఉండాలి?
నిజానికి మనం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధికగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళకు అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం.
పీచుపదార్థాలు ఎలా ఉపయోగపడతాయి?
మన మలం పలచగా ఉండి, సాఫీగా జారాలంటే పెద్దపేగులో తగినంత నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే... సదరు ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో ఉంటే పేగుల్లో ఉన్న నీటినంతటినీ పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ కనీసం 20 – 35 గ్రాముల పీచు ఉండాలి.
అప్పుడు చాలా తేలికగా మల విసర్జన సాధ్యమవుతుంది. ఇక కనిష్టంగా 10 గ్రాముల పీచుకు తక్కువ కాకుండా ఉంటే, మల విసర్జన కొంతవరకు తేలిగ్గా జరుగుతుంది. స్వాభావికంగానే పీచు లభ్యమయ్యే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. మలవిసర్జన తేలిగ్గా జరిగేలా చూసుకోండి. పై ఐదు పదార్థాలూ రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మలబద్దకం ఇక మీ దరిచేరదు. అలాగే మీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం కూడా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment