మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి.
నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్‌కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం
2012లో.. | 2023లో.. | |
బేవరేజెస్, ప్రాసెస్డ్‌ఫుడ్ | 9 శాతం | 10.5 శాతం |
పాలు, పాల ఉత్పత్తులు | 7 శాతం | 7.2 శాతం |
తృణధాన్యాలు | 6.6 శాతం | 4.5శాతం |
కూరగాయలు | 4.6 శాతం | 3.8 శాతం |
గుడ్లు/ ఫిష్/ మాంసం | 3.7 శాతం | 3.5 శాతం |
పండ్లు/ డ్రైఫ్రూట్స్ | 3.4 శాతం | 3.8 శాతం |
పప్పులు | 1.9 శాతం | 1.2 శాతం |
చక్కెర, ఉప్పు | 1.2 శాతం | 0.6 శాతం |
Comments
Please login to add a commentAdd a comment