మొదట న్యూయార్క్‌లో ప్రారంభించిన హైదరాబాదీ..
తక్కువ నూనెలు, తక్కువ కారం.. సుగంధ ద్రవ్యాలు
గ్లోబల్ ఫేవరెట్ డిష్‌గా మొరాకో రుచులు..
న్యూయార్క్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మొరాకన్ రెస్టారెంట్ నగరంలోని జూబ్లీహిల్స్ వేదికగా ప్రారంభమైంది. అరుదైన వంటకాలతో వినూత్నమైన, పసందైన రుచులను అందించడం మొరాకన్ ప్రత్యేకత. భారతీయులకు ఈ మొరాకన్ రుచులను అందించడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో రెస్టారెంట్ ప్రారంభించడం విశేషం. అయితే ఈ మొరాకన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చెఫ్ అనీసా వహీద్ హైదరాబాదీ కావడం మరో విశేషం.
లగ్జరీ వంటకాలుగా ఆదరణ పొందిన మొరాకో డిషెస్ సుగంధ ద్రవ్యాలతో పాటు భారతీయ వంటకాల్లో వినియోగించే కొన్ని ఫ్లెవర్స్ తో తయారు చేస్తారు. ఉత్తర ఆఫ్రికన్, మెడిటరేనియన్, అరబ్, పెర్షియన్ పాకశాస్త్ర మూలాల ప్రపంచ–ప్రసిద్ధ సమ్మేళనంతో సువాసనగల మొరాకో రుచులు భారత్ లోని మధ్యధరా/మధ్యప్రాచ్య ప్రాంతాల్లో విస్తరణకు పూనుకున్నారు. తారా కిచెన్ లోకి ప్రవేశించగానే ఎడారి–పర్వత–సముద్ర సెట్టింగులు దేశ వైభవాన్ని ప్రదర్శిస్తాయి.
సహారా–ప్రేరేపిత డైనింగ్ రూమ్‌లో అతిథులకు వెండి టీ కుండల నుంచి అందించే మొరాకో పుదీనా టీతో స్వాగతం పలుకుతుంది. మొరాకో ప్రసిద్ధ బ్రైజ్డ్ డిష్, వినూత్నమైన మటన్–చికెన్, సీఫుడ్, ముఖ్యంగా టాగిన్ అని పిలువబడే కూరగాయలు.. వీటిని సంప్రదాయ శంఖు ఆకారపు కుండలో టేబుల్ పైన వడ్డించే విధానం అద్భుతం. ముఖ్యంగా సువాసనతో కూడిన మసాలా మిశ్రమాలు, గులాబీ సువాసనగల బక్లావా వంటి డెజర్ట్స్ నోరూరిస్తాయి.
వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లు, డిప్లు వంటకాల అద్భుతమైన రుచులను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ కోసం సమతుల్య పోషకాలతో వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అతి తక్కువ నూనెలు, పాల ఉత్పత్తులతో.. బాదం, దానిమ్మ మొలాసిస్‌తో ఫిగ్ సలాడ్, కాలి్చన వంకాయ, జాలోక్ కూరగాయల కౌస్కాస్, ఆలివ్ ఫిష్ ట్యాగిన్ ఇలా వినూత్న వంటకాలు వాహ్ అనిపిస్తాయి. ఈ వంటలలో గ్లూటెన్ ఇతర అలెర్జీ కారకాలు ఉండవని చెఫ్ లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment