సెలబ్రిటీలు మెచ్చిన స్టార్‌ | Food Pharmer Revant Himatsingka Aware Of Packaged Food Items | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలు మెచ్చిన స్టార్‌

Published Fri, Nov 8 2024 10:20 AM | Last Updated on Fri, Nov 8 2024 10:27 AM

Food Pharmer Revant Himatsingka Aware Of Packaged Food Items

అమెరికాలో చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్‌ హిమంత్‌సింగ్కా ఫుడ్‌ లేబుల్స్‌ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్‌ హెల్త్‌కోచ్‌ అయిన రేవంత్‌ జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్‌–హెల్ఫ్‌ బుక్‌ ప్రచురించాడు. 

ఇందులో ప్యాకేజ్‌డ్‌ గూడ్స్‌ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్‌ ఉంది. సోషల్‌ మీడియాలో రేవంత్‌ ఎలా పాపులర్‌ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్‌–డ్రింక్‌ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్‌ చేస్తుంది ఇది సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్‌ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్‌’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్‌లాంటి ప్యాకేజ్‌డ్‌ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్‌ చేసేవారు.

వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్‌కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్‌సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్‌ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్‌లాంటి సబ్జెక్ట్‌లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్‌’గా పాపులర్‌ అయిన రేవంత్‌ తాజాగా ‘ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌–2024’ జాబితాలో చోటు సంపాదించాడు.

(చదవండి: 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement