‘మాయో’తో రోగాలు కొనితెచ్చుకోవద్దు..ఇవిగో ప్రత్యామ్నాయాలు | Do You Eat Mayo? Nutritionist Shares Healthy Curd Dip As An Alternative | Sakshi
Sakshi News home page

‘మాయో’తో రోగాలు కొనితెచ్చుకోవద్దు..ఇవిగో ప్రత్యామ్నాయాలు

Published Sat, Jul 6 2024 5:35 PM | Last Updated on Sat, Jul 6 2024 6:08 PM

Do You Eat Mayo? Nutritionist Shares Healthy Curd Dip As An Alternative

మయోన్నెస్  లేదా  ‘మాయో’...క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి జంక్‌ఫుడ్‌  తినే వారికి, పిల్లలకు   మాయో బాగా పరిచయం.  అలాగే  సలాడ్‌లు, మోమోస్, సాండ్‌విచ్‌లు, బ్రెడ్‌ మీద  అలా వేసుకుని రెడీమేడ్‌గా తినేస్తారు మరికొంతమంది. అయితే ఇది రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం  మీకు తెలుసా? మయోన్నెస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు.  

మాయోతో నష్టాలు
మయోన్నెస్ రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో  క్యాలరీలు, కొవ్వు  ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నెస్‌లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.  శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్‌  పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  

టేస్టీ  అండ్‌ హెల్దీ  ఆల్టర్‌నేటివ్స్‌
మాయోతో ఆరోగ్య ప్రయోజనాలు శూన్యం. పైగా  అధిక వినియోగం అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన,  రుచికరమైన కొన్ని ప్రత్యమ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవవచ్చు. ఇది  కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.  ప్రోటీన్ , కాల్షియం,  గొప్ప మూలం పెరుగు.

క్రీమీ టేస్ట్‌ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర  కలుపుకొని వాడుకోవచ్చు.  దోసకాయ ఆర్ద్రీకరణ, నిర్విషీకరణకు మంచిది. పెరుగు, పుదీనా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. పుదీనా ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. దోసకాయ , పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులో వెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్,రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి. అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని వాడవచ్చు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement