Alternative
-
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
‘మాయో’తో రోగాలు కొనితెచ్చుకోవద్దు..ఇవిగో ప్రత్యామ్నాయాలు
మయోన్నెస్ లేదా ‘మాయో’...క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి జంక్‌ఫుడ్ తినే వారికి, పిల్లలకు మాయో బాగా పరిచయం. అలాగే సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ మీద అలా వేసుకుని రెడీమేడ్‌గా తినేస్తారు మరికొంతమంది. అయితే ఇది రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మీకు తెలుసా? మయోన్నెస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. మాయోతో నష్టాలుమయోన్నెస్ రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నెస్‌లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్మాయోతో ఆరోగ్య ప్రయోజనాలు శూన్యం. పైగా అధిక వినియోగం అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యమ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. దోసకాయ ఆర్ద్రీకరణ, నిర్విషీకరణకు మంచిది. పెరుగు, పుదీనా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. పుదీనా ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. దోసకాయ , పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులో వెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్,రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి. అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని వాడవచ్చు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్‌గా పరిగణిస్తారు. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్‌ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్‌మిత్తల్ పాల్గొన్నారు. -
‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’
ముంబై: ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరని మహారాష్ట్ర డిప్యూటీ అజిత్ పవార్ అన్నారు. వచ్చే 2024 సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ‘ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు ఎవరూ లేరు. అటువంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి, రెండు విషయాలను దృష్టి పెట్టుకొని బీజేపీ అదిష్టానం నిర్ణయం తీసుకోదు’ అని ఆయన అన్నారు. మీరే చాలా వరకు ఈ విషయంపై ప్రచారం కల్పిస్తున్నారని మీడియా ఉద్దేశించి అన్నారు. అయితే దేశంలో ఎవరి పాలన సురక్షితం, భద్రంగా, దృఢంగా ఉంటుందో. ఎవరు ప్రపంచ వేదికలపై మన దేశ గుర్తింపును పెంచుతారో అదే చాలా ముఖ్యమని అన్నారు. అయితే తాము ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఫలితాలు చూశామని తెలిపారు. అంచనాలకు తగినట్టు ఫలితాలు రావని అన్నారు. కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్‌పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం మీద స్పష్టత లేదు
న్యూఢిల్లీ: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా కాకుండా వారు తమ విధులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. దేశీయంగా ఉద్యోగాలపై దీని ప్రభావాలు ఎలా ఉంటాయనే అంశంపై కాలక్రమేణా స్పష్టత రాగలదని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక, సాంకేతికయేతర రంగాల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్న నేపథ్యంలో గుప్తా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాస్కామ్ వార్షిక టెక్నాలజీ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, వారానికి 40 గంటల పని విధానాన్ని ఏఐ మార్చేయగలదని, ఉద్యోగులు తమకు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు తగినంత సమయం లభించేందుకు ఇది తోడ్పడగలదని యాక్సెంచర్ గ్లోబల్ సీనియర్ ఎండీ మార్క్ క్యారెల్ బిలియార్డ్ తెలిపారు. అటు, విదేశాల్లో లిస్టయిన అంకుర సంస్థలను భారత్‌కు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గుప్తా స్పందించారు. సాధారణంగా తమ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా, అలాగే వ్యాపారాల నిర్వహణకు సులభతరమైన పరిస్థితుల కారణంగా పలు స్టార్టప్‌లు విదేశాల్లో లిస్టింగ్ వైపు మొగ్గు చూపుతుంటాయని ఆమె తెలిపారు. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించే క్రమంలో దేశీయంగా పన్నులపరమైన విధానాలు, ఎసాప్ (ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం) పాలసీలు మొదలైన వాటిని తగు రీతిలో సరిదిద్దేలా నాస్కామ్.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని గుప్తా వివరించారు. డీప్‌టెక్ పరిశ్రమకు ప్రతిభావంతులు, పెట్టుబడులు, తగిన మౌలిక సదుపాయాల కొరత సమస్యగా ఉంటోందన్న నివేదిక వివరాలను సదస్సు సందర్భంగా నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఆవిష్కరించాయి. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
CDMDF: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి
న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది. సంక్షోభాల్లో ఆపత్కాల నిధి మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని సెబీ తెలిపింది. -
ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్’
లండన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు మరో సవాల్ ఎదురవనుంది. ట్విట్టర్‌ను ఢీకొట్టేందుకు మెటా తాజాగా థ్రెడ్స్ అనే యాప్‌ను సిద్ధం చేసింది. యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్లోఇది కనిపిస్తోంది. ట్విట్టర్లో మాదిరిగానే దీనిలోనూ టెక్ట్స్ రూపంలో మెసేజీలను లైక్ చేయవచ్చు. షేర్, కామెంట్ కూడా చేయవచ్చని యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్‌ను బట్టి తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు లింకై ఉన్న ‘టెక్ట్స్ బేస్డ్ కన్వర్జేషన్ యాప్’. ‘నేటి నుంచి రేపటి ట్రెండింగ్‌లో ఉండే అన్ని అంశాల వరకు చర్చించుకునే సమూహాల కోసమే థ్రెడ్స్’ అని మెటా తెలిపింది. ఇన్‌స్ట్రాగామ్ యూజర్లు అదే అకౌంట్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని చెబుతున్నారు. దీనిపై మెటా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాన్ మస్క్ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చేపట్టిన పలు మార్పులపై యూజర్లు అసంతృప్తితో ఉన్న సమయంలో మెటా ‘థ్రెడ్స్’ను తేనుండటం గమనార్హం. -
ఆకర్షణీయంగా ఆల్టర్నేటివ్ ఫండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు దీటుగా, కొన్నిసార్లు అంతకు మించిన రాబడులు అందిస్తూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటిలో పెట్టుబడులపై దేశీ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దాదాపు రెండేళ్ల క్రితం వరకు రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఏఐఎఫ్‌ల నిధులు గతేడాది ఆఖరు నాటికి రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. రాబోయే రోజుల్లో ఇది 4–5 రెట్లు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 40 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ స్థాయికి చేరవచ్చని లెక్క వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుండగా ప్రస్తుతం 80– 90% నిధులు దేశీయంగా సమీకరించినవే ఉంటున్నాయి. అత్యంత సంపన్నులతో పాటు ఒక మోస్త రు ఇన్వెస్టర్లు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మూడు రకాలు: ఈక్విటీలు, బాండ్లు, రియల్టీ వంటి సంప్రదాయ సాధనాలకే పరిమితం కాకుండా ఇతరత్రా మరిన్ని ప్రత్యామ్నాయ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకోవాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించినవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు. సంప్రదాయ ఫండ్స్‌తో పోలిస్తే భిన్నమైన వ్యూహాలతో, విభిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఆర్జించడం వీటి లక్ష్యం. రిస్కులు ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా మరింత రాబడులు పొందేందుకు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా మూడు కేటగిరీల కింద దాదాపు 4,000 పైచిలుకు ఏఐఎఫ్‌లు ఉన్నాయి. ఏఐఎఫ్ల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. కేటగిరీ 1 తరహా ఏఐఎఫ్‌లు ప్రధానంగా స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలు లేదా లాభదాయకమైనవిగా ప్రభుత్వం పరిగణించే రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక రెండో కేటగిరీ ఫండ్‌లో ప్రైవేట్ ఈక్విటీ, డెట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. మూడో కేటగిరీలో హెడ్జ్ ఫండ్స్, స్వల్పకాలికంగా రాబడులు అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. తొలి రెండు కేటగిరీల్లోని ఏఐఎఫ్ స్కీములు క్లోజ్ ఎండెడ్‌గా ఉంటాయి. కాల వ్యవధి పరిమితి కనీసం మూడేళ్లుగా ఉంటుంది. మూడో కేటరిగీ ఫండ్లు ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్గానైనా ఉండొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఏఐఎఫ్ బెంచ్‌మార్క్ నివేదిక ప్రకారం మూడో కేటగిరీ ఏఐఎఫ్‌లు కాల వ్యవధిని బట్టి 10 శాతం నుంచి 23 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. టెక్నాలజీతో అధిక రాబడులకు ఆస్కారం.. సరైన వ్యూహాలు పాటిస్తే ఏఐఎఫ్‌ల ద్వారా మార్కెట్‌కు మించి రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్స్బజార్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) భూపాల్ నానావత్ తెలిపారు. ‘‘దాదాపు రూ. 3,900 కోట్ల ఫండ్స్ నిర్వహిస్తున్నాం. కొత్తగా మరో రూ. 1,000 కోట్ల ఫండ్‌కి నిధులను సమీకరిస్తున్నాం. ఏఐఎఫ్ 3 కేటగిరీ కింద లిస్టెడ్ కంపెనీల్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. అల్గోరిథమ్‌ల వంటి అధునాతన సాంకేతికతలతో, రోబోటిక్ సిస్టమ్‌లతో రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యూహాలను అమలుపర్చడం ద్వారా ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందిస్తున్నాం. దీనితో 30 శాతం పైగా రాబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వీటిలో రూ. కోటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చని, హెడ్జ్ ఫండ్స్ కేటగిరీ కింద షేర్లు, బాండ్లు, డెరివేటివ్‌లు, కమోడిటీలు వంటి విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఫిక్సిడ్ డిపాజిట్లు, మార్కెట్లకు మించిన రాబడులు అందించే సాధనాలేవీ లేవంటూ ఇన్వెస్టర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు, ఏఐఎఫ్‌లు వంటి సాధనాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని నానావత్ చెప్పారు. - భూపాల్ నానావత్, షేర్స్బజార్ ఎండీ -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ట్విటర్‌కు సవాల్: టాప్-10 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా చెప్పాలంటే, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్ డీల్‌ను చెప్పుకోవచ్చు. 44 బిలియన్ల క్యాష్ డీల్‌కు ట్విటర్‌ను టేకోవర్ చేశారు మస్క్. అయితే ట్విటర్లో చేసిన, చేయనున్న తాజా మార్పులు, చేర్పులు చాలా మంది వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇదీ చదవండి: అపుడు వేటు..ఇపుడు స్పెషల్ గిఫ్ట్: ట్విటర్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ ముఖ్యంగా బ్లూ-టిక్ వెరిఫికేషన్ ఫీజు యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి వివాదాలు, సంచలనాలు రానున్నాయోనని, అటు యూజర్లు ఇటు ప్రచురణ కర్తలు, కంటెంట్ సృష్టికర్తలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ ట్విటర్డీల్ తరువాత ట్విటర్‌కు పెద్ద సవాలుగా మారుతున్న టాప్-10 మేజర్ ఆల్టర్నేటివ్స్ను చూద్దాం. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ట్విటర్‌కు టాప్- 10 మేజర్ ఆల్టర్నేటివ్ ప్లాట్‌ఫారమ్స్ బ్లూ స్కై: ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కీ యాప్. ఈ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అక్టోబర్ ప్రకటించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌కు ఇప్పటికే 30వేల మంది సైన్ అప్ చేసి వెయిట్ చేస్తున్నారు. తమ ప్రచురించిన కంటెంట్‌పై హక్కు, పోస్ట్‌లను వివిధ సోషల్ నెట్‌వర్క్‌లలో తరలించేందుకు ఇది వీలు కల్పిస్తుందట. కూ: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దేశీయ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ. ఇది 200 దేశాల్లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉంది. తమకిష్టమైన భాషలో వ్యక్తీకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సామాజిక వార్తలు, కొత్త అప్డేట్స్ను, ట్రెండింగ్ పోస్ట్‌లు చూడొచ్చు. మిలియన్ల కొద్దీ క్రియేటర్లు, సెలబ్రిటీలు లేదా టాపిక్‌లను కూ యూజర్లు ఫాలో అవ్వొచ్చు. ఇండియాలో చాలా ప్రభుత్వ శాఖలు, అధికారులు కూయూజర్లుగా ఉన్నారు. ఇటీవల వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కూ యాప్‌లో చేరారు. మాస్టోడాన్ : దాదాపు ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్. ఇన్‌స్టాన్స్ అనే మాస్టోడాన్ నోడ్ల ద్వారా అందించే మైక్రోబ్లాగింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో కూడా యాడ్స్ ఉండవు.ప్రవర్తనా నియమావళి, సేవా నిబంధనలు, సెక్యూరిటీ ఆప్షన్స్, నియంత్రణ విధానాలు ఇందులో ఉన్నాయి. అలాగే 500 అక్షరాల లిమిట్, ఎమోజీలకు సపోర్ట్ చేస్తుంది. 10 లక్షలకుపైగా యాక్టివ్ యూజర్లు దీని సొంతం. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మస్క్- ట్విటర్ టేకోవర్ తరువాత దాదాపు 500,000 మంది కొత్త వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంది. టంబ్లర్: 2007లో లాంచ్ అయిన సోషల్ మీడియా వెబ్సైట్ టంబ్లర్. ఇందులో ఫోటోలు, GIFల లాంటి వాటితోపాటు, లాంగ్ పోస్ట్‌లు కూడా చేసుకోవచ్చు. మల్టీమీడియా, ఇతర కంటెంట్‌ను బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇతరుల బ్లాగ్లనూ ఫాలోకావచ్చు. డైరెక్ట్ మెసేజ్ ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు. క్లబ్‌హౌస్: కోవిడ్ కాలంలో పాపులర్ అయింది. క్లబ్‌హౌస్. క్లబ్‌హౌస్ లైవ్ ఆడియో చాట్రూమ్లలకు అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో చాట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులోని రూమ్స్ ద్వారా ఒక వినియోగదారు ఆడియో చాట్రూమ్ని ప్రారంభించవచ్చు. ఏ అంశంపైనైనా చర్చించవచ్చు. ఇన్వైట్ ఆప్షన్ ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ పొందే వీలుంది. కోహోస్ట్: ఎలాంటి యాడ్స్ లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోహోస్ట్. ఇందులో పోస్ట్‌లు ట్విటర్ లాగానే మన టైమ్‌లైన్‌లో వరుసగా ఉంటాయి. కోహోస్ట్ సబ్స్క్రిప్షన్స్ మొదలు పెడతామని కంపెనీ ఇటీవల ప్రకటించింది. పార్లర్: నాష్విల్లే బేస్ట్డ్ పార్లర్ 2018లో ఆవిష్కృతమైంది. అమెరికాలో కన్సర్వేటివ్ ఫావేరెట్గా పాపులర్ అయింది. కంటెంట్ మోడరేషన్‌కు ప్రాధాన్యమిచ్చే పార్లర్..వినియోగదారులు పోస్ట్‌లపై జోక్యం చేసుకోదు. అలాగే ఫేస్బుక్, ట్విటర్ వ్యతిరేకించే వారిలో ఎక్కువ ఆదరణ పొందింది. ట్రైబల్ సోషల్: ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో, ఆండ్రాయిడ్‌లో ఇది అందుబాటులో ఉంది. యూజర్లు వివిధ ట్రెండింగ్ అంశాలపై నిపుణులను ఇక్కడ కనుగొనవచ్చు. ట్రైబెల్ యూజర్ పోస్ట్‌లకు ఎన్ని లైక్లువచ్చాయో ట్రాక్ చేసి, జనాదరణ పొందిన పోస్ట్‌లు ,కంట్రిబ్యూటర్లను ర్యాంక్లిస్తుంది. ట్రూత్ సోషల్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్.ఒక అమెరికన్ స్థాపించిన ఇది అమెరికా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూసింక్: ఈ ప్లాట్ఫారంలో స్టోరీలు, వీడియోలు, ఫోటోలతోపాటు, బ్లాగ్లోలా లాంగ్ కంటెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. ఈవెంట్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది యూజర్లనుంచి ఫీజు వసూలు చేస్తుంది. -
స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల దన్ను
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్‌లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్).. స్టార్టప్లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో ఏఐఎఫ్‌లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్‌లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్‌బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్‌సైడ్ వెంచర్స్ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. -
ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు
భూమిలోని క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? • సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది.. • భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ అయిపోతే..? • మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా? • ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం.. •పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్.. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్‌లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో 82 శాతం ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్‌లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్‌కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్‌ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. -ఈవీ బాలాజీ, సాక్షి -
మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?
ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ– అమిత్ షా ద్వయం మమతా బెనర్జీని ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. ఈడీ, సీబీఐ దాడులతో సహా అష్టదిగ్భందం చేశారు. ఏకాకిగా మారినా... సువేందు అధికారి, ముకుల్‌రాయ్‌లతో సహా సన్నిహితులందరూ దూరమైనా... మమత మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచారు. 294 సీట్లలో ఏకంగా 213 స్థానాల్లో నెగ్గి ‘హ్యాట్రిక్’ కొట్టారు. మూడోసారి సీఎంగా పదవిని చేపట్టారు. అంతే బెంగాల్ సివంగి పేరు జాతీయ రాజకీయ యవనికపై మార్మోగిపోయింది. బలమైన నాయకుడు మోదీని, బీజేపీ ‘ఢీ’ కొట్టి నిలిచే దమ్మున్న నాయకురాలిగా ఆమెను రాజకీయ పండితులు కీర్తించారు. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మమత కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కన్నేసి బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికగా మూడో కూటమిని నిర్మించే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. భావ సారూప్యత కలిగిన వ్యక్తుల భేటీల పేరిట రాజకీయపక్షాలనే కాకుండా, వివిధ రంగాల్లోని మేధావులు, ఉద్యమకారులను కలుస్తూ... తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. బుధవారం రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశాక... ‘ఇక యూపీఏనే లేదు’ అంటూ ప్రకటించి... బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమిని నాయకత్వం వహించాలనే తన ఆకాంక్షను విస్పష్టంగా బయటపెట్టారు. దేశవ్యాప్త రాజకీయ ఉనికిని, వందేళ్లకు పైగా చరిత్ర కలిగి జనసామాన్యంలో గుర్తింపును, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీని... బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే స్థానం నుంచి తప్పించే సామర్థ్యం ‘దీదీ’కి ఉందా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాగలదా? బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగలదా? దాదాపు 200 స్థానాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను కాదనుకొని మమతా వెనుకనడిచే విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఎన్ని? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇళ్లు చక్కదిద్దుకోండి... సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని ఏడాదికి పైగా నడుపుకొస్తున్నారు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి. భావినేతగా భావించిన రాహుల్‌గాంధీ సత్తా ఏంటో తేలిపోయింది. పోరాటపటిమ లోపించిందని, రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరనే ముద్ర పడిపోయింది. పైగా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్లతో కూడిన జి–23 గ్రూపు అధినాయకత్వాన్నే ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పంజాబ్‌లో పరువుబజారున పడింది. అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగపెట్టడంతో ఆయన సొంత పార్టీనే స్థాపించారు. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసినా... పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నిత్యం ఏదో ఒక తలనొప్పి తెస్తూనే ఉన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ కుమ్ములాటలు ఏంటని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ వర్గాల మ ధ్య ఆధిపత్యపోరు అందరికీ తెలిసిందే. చత్తీస్‌గఢ్‌లోనూ భూపేష్ బఘేల్‌పై అసంతృప్తి చాలాకాలంగా రగులుతోంది. దీదీ ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌నే లేవనెత్తుతున్నారు. ఇంటిని చక్కదిద్దుకోలేని వాళ్లు... ఇతరులకు ఏం నాయకత్వం వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరెవరు ఉన్నారు...? మోదీ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు/ రాహుల్‌కు లేనపుడు మరెవరున్నారు? శరద్ పవార్‌కు 80 ఏళ్లు, రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నారు. ఒకప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కల చెదిరి ఎన్డీయే పంచన చేరిపోయారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... బీసీ నాయకుడిగా (కుర్మీ) నితీశ్‌కు ఉన్న ఇమేజి నుంచి లబ్దిపొందేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునేందుకు కమలదళం ఆయనకు సీఎం పీఠం అప్పగించింది. 21 ఏళ్లుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ (75 ఏళ్లు) ఎన్డీయే నుంచి వైదొలిగినా... ఇరుపక్షాలకు సమదూరం పాటిస్తూ తటస్థ వైఖరితో ఉన్నారు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు లేదు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తానన్న ఒకప్పటి బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌ను దాటి ప్రభావం చూపలేకపోయారు. వెనుకడుగు వేయకపోవడమే దీదీ బలం రాజకీయాల్లో చేరినప్పటి నుంచే మమతకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. పోరాటమే ఆమె ఊపిరి. ఎట్టి పరిస్థితుల్లో, ఎంతటి ప్రతికూలతలు ఎదురైనా తలవంచని నైజం. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో ఆమె ధీరత్వం మరింత ప్రస్పుటమైంది. మోదీని ఢీకొట్టే శక్తి ఆమెకే ఉందని జనబాహుళ్యంలో అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు విపక్షాలకు రోజురోజుకు కాంగ్రెస్‌పై నమ్మకం సడలుతోంది. ఈ రెండింటినీ తనకు అనుకూలాంశాలుగా మలచుకొని... మోదీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మమత. యూపీ (80), మహారాష్ట్ర (48) తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మూడోరాష్ట్రం బెంగాల్, 2019లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో (43.39 శాతం ఓట్లతో) 22 సీట్లు సాధించిన మమత... తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్లశాతాన్ని 47.94 శాతానికి పెంచుకోగలిగారు. 2024కు వచ్చేసరికి బెంగాల్లో 42 సీట్లలో కనీసపక్షం 35 గెలిచినా... ఒకటి, రెండు లోక్‌సభ స్థానాలుండే ఈశాన్యరాష్ట్రాలు, గోవా లాంటి చోట్ల విస్తరిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్‌తో పొసగని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే ప్రస్తుతం మమతతో సన్నిహితంగా మెలుగుతోంది. 2024 ఇంకా సమయం ఉంది కాబట్టి ఇతర ప్రాంతీయ పార్టీలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తాయి. ఆలోపు మాత్రం కాంగ్రెస్‌ను వీలైనంతగా దెబ్బతీసి... తనను తాన ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం మమత సీరియస్‌గా చేస్తున్నట్లు కనపడుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆమె అడుగులు, ఎత్తుగడలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వీలైనంతగా విపక్షనేతలను కలిసి వారితో సంబంధాలు నెరుపుతున్నారు. వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈశాన్యంలో విస్తరణపై దష్టి అఖిల భారత మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్ (అస్సాం)ను టీఎంసీలో చేర్చుకున్నారు. రాజ్యసభకు పంపారు. రాయిజోర్ దళ్ నేత, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్‌ను ఆయన పార్టీని టీఎంసీలో విలీనం చేయాలని కోరారు. అస్సాం అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే తమకు ముఖ్యమని, అందుకే విలీనానికి అంగీకరించలేదని, తృణమూల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని దష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలలుగా త్రిపురలో బలపడటానికి మమత గట్టి ప్రయత్నమే చేశారు. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 334 స్థానాలకు గాను బీజేపీ 329 చోట్ల నెగ్గి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సీట్లు రాకున్నా త్రిపురలో ఎంట్రీ ఇచ్చిన కొద్దినెలల్లోనే టీఎంసీ దాదాపు 20 శాతం ఓట్లను తెచ్చుకోవడం గమనార్హమని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మేఘాలయలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను మమత గట్టి దెబ్బకొట్టారు. నవంబరు 24న మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో సహా 12 ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అక్కడ టీఎంసీ ప్రతిపక్షపార్టీగా అవతరించింది. 2022 ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే గోవా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన టీఎంసీ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం లుజిన్హో ఫలేరోను, భారత టెన్నిస్ దిగ్గజం లియాండ్ పేస్‌ను మమత అక్కున చేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే లుజిన్హో ఫలేరోను బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపారు. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు. మేఘాలయ, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తృణమూల్‌కు రాష్ట్ర పార్టీగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ కీర్తీ ఆజాద్, రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న అశోక్ తన్వర్‌లు గత వారమే టీఎంసీలో చేరారు. జి–23 నేతల్లోనూ చాలామందితో ఆమె టచ్‌లో ఉన్నారనేది తెరపైకి వస్తున్న మరో కొత్త అంశం. ఇటీవలే జీ–23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితులైన నలుగురు మాజీ కశ్మీర్ మంత్రులతో సహా 20 మంది కాంగ్రెస్ గుడ్‌బై కొట్టారు. సుస్మితాదేవ్, లుజిన్హో ఫలేరోలను పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్ నేతలకు తాను సముచిత స్థానం, గౌరవం ఇస్తానని మమత సంకేతాలు పంపుతున్నారు. అఖిలపక్షానికీ దూరం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సోమవారం (నవంబరు 29) రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో అఖిలపక్ష భేటీ జరిగింది. దీనికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉండటం గమనార్హం. ఆప్ కూడా డుమ్మా కొట్టింది. అలాగే 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై నిరసనల్లోనూ టీఎంసీ... కాంగ్రెస్‌కు దూరం పాటించింది. లోక్‌సభలో వాకౌట్ కూడా చేయలేదు. రాజ్యాంగంలో రాసుందా? నవంబరు 22న మమత ఢిల్లీకి వచ్చారు. మూడురోజులు దేశరాజధానిలో ఉన్నారు. బెంగాల్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారని అంతా భావించినా... అలాంటిదేమీ జరగలేదు. ఇదే విషయాన్ని 24న ఓ విలేకరి ప్రశ్నిం చగా... మమత సహనం కోల్పోయారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ సోనియాను కలవడం తప్పనిసరా? అలాగని రాజ్యాంగంలో రాసుందా? అంటూ సదరు విలేకరిని ఎదురు ప్రశ్నించారు. నేనెవరి అపాయింట్‌మెంట్‌నూ కోరలేదు... వారు పంజాబ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. వారి పార్టీ కోసం వారిని పనిచేసుకోనివ్వండి’ అని అన్నారు. దీదీకి కాంగ్రెస్ పొడగిట్టడం లేదని ఆమె మాటలు స్పష్టం చేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
వాట్సాప్‌కు షాక్ : కొత్త దేశీ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ షాకిచ్చేలా కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. సందేశ్ పేరుతో ఆవిష్కరించ నున్న ఈ యాప్ టెస్టింగ్ ప్రక్రియిను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరీక్షకు అందుబాటులో ఉంచింది వాట్సాప్ లాంటి యాప్‌ను ఆవిష్కరించే ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించింది. జిమ్స్ (జీఐఎంఎస్) అనే పేరుతో ఈ ప్రభుత్వ యాప్‌ను లాంచ్ చేయనుందనే అంచనాలు వెలువడ్డాయి. కానీ దేశీయంగా ‘సందేశ్’ పేరుతో తీసుకురానుందట. ఈ నేపథ్యంలోనే దీన్ని వినియోగానికి కూడా సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నట్టు సమాచారం. అంతర్జత సమాచారం మార్పిడి కోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఒక నివేదికలో బిజినెస్ స్టాండర్డ్ సోమవారం తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ అధీకృత ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటీపీ ఆధారిత లాగిన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ సహా ఆధునిక చాటింగ్ చాప్‌ల ఫీచర్లతో ఐఓఎస్,ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలకు మద్దతునిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, (ఎన్ఐసీ) బ్యాకెండ్ సపోర్టు అందిస్తోంది. -
పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా...
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరో కొన్ని చైనా యాప్స్ వల్ల ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం వాటిని కూడా బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో టిక్టాక్లాగా అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ, లూడో గేమ్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పబ్జీ ప్రియులకు గుబులు మొదలైంది. పబ్జీలేకపోతే అలాంటి గేమ్స్ ఏమున్నాయా అని వెతికే పనిలో పడ్డారు. పబ్జీలాగు ఉండే కొన్ని ఆన్లైన్ గేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫోర్ట్‌నైట్: పబ్జీకి, ఫోర్ట్నైట్కు మధ్య ప్రారంభం నుంచే పోటీ కొనసాగుతుంది. ఈ రెండు ఆటలు రాయల్యుద్ద శైలి మీద ఆధారపడి ఉంటాయి. ఇవి రెండూ కూడా శక్తిమంతమైన యూజర్ బేస్‌ను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్జీలా కాకుండా, ఫోర్ట్‌నైట్ గేమ్ గ్రాఫిక్స్ మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి. గేమ్ ఆడటానికి విభిన్న పాత్రలు ఉంటాయి. ఇందులో ఆటగాళ్ళు వుడ్స్, మెటల్ , మరిన్ని విభిన్న వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించడం ద్వారా వివిధ నిర్మాణాలను కట్టవచ్చు. అదేవిధంగా శత్రువులు చేసే దాడి నుంచి కాపాడుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ: ఇది మరో ప్రసిద్ధ యుద్ధ-రాయల్ గేమ్ అదేవిధంగా పబ్జీ మొబైల్ గేమ్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో బాటిల్ రాయల్ మోడ్ ఉంటుంది. ఇక్కడ 100 మంది చివరి వరకు పోరాడవచ్చు. ఇందులో మీరు షీల్డ్లాంటి వస్తువులను ఉపయోగించవచ్చు. వినియోగదారులు మ్యాచ్ సమయంలో హెలికాప్టర్లు, మరెన్నో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్యాప్చర్ ది ఫ్లాగ్ - గోల్డ్ ఎడిషన్ కూడా ఈ గేమ్‌లో ఉంది. ఈ మోడ్‌లో, ఆటగాళ్ళు జెండాను పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరొక మోడ్ కిల్ కన్ఫర్మ్డ్. ఇందులో 5 వర్సస్ 5 టీం డెత్‌మ్యాచ్ వుంటుంది. స్నిపర్ వర్సస్ స్నిపర్ బాటిల్ ఫీల్డ్ కూడా ఉంది. గరేనా ఫ్రీ ఫైర్: ఇది పబ్జీ మొబైల్‌కు దేశీ ప్రత్యామ్నాయం. ఈ ఆటలో ఉండే ఉత్తమమైన విషయం ఏంటంటే ఇందులో గేమ్ ప్లే చిన్నది, అంతేకాకుండా క్రిస్ప్‌గా వుంటుంది. ఇందులో ప్రతి మ్యాచ్‌లో, 50 మంది ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా మ్యాచ్ 10 నిమిషాల్లోనే ముగుస్తుంది. ఇది తొందరగా మ్యాచ్‌లు ఆడాలనుకునే వారికి బాగుంటుంది. ఆటగాళ్ళు స్క్వాడ్లతో పాటు సోలోలో కూడా ఆడవచ్చు. బ్యాటిల్ లాండ్స్ రాయల్: ఇతర బాటిల్‌ఫీల్డ్ ఆటలతో పోలీస్తే ఈ ఆట చిన్నదిగా ఉంటుంది. బ్యాటిల్ ల్యాండ్స్ రాయల్ అనేది ప్రతి ఒక్కరూ ఆస్వాదించడానికి వీలుగా ఉండే ఒక సాధారణమైన తుపాకీ ఆట. కొన్నిసార్లు పబ్జీ కన్నా దూకుడుగా అనిపిస్తుంది. 32 మంది ఆటగాళ్ళు, 3-5 నిమిషాల యుద్ధాలతో, ఇది గేమ్‌లో నాన్-స్టాప్ మారణహోమాన్ని సృష్టిస్తుంది. చదవండి: పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే.. -
మోదీ ‘రియల్’ బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడించారు. రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్సీఎల్టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికీ ఏఐఎఫ్ ద్వారా నిధులివ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సీతారామన్ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉ న్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్ ఫండ్స్ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. కొనుగోలుదారులకు ఉపశమనం ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్ పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది. – అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్ చైర్మన్ సమస్యకు పరిష్కారం ఇళ్ల కొనుగోలుదారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం తో పాటు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. తొలుత ప్రకటన(సెప్టెంబర్ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్పీఏ లేదా ఎన్సీఎల్టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ -
‘పెట్రోలియం’కు జీవ ఇంధనమే సరైన ప్రత్యామ్నాయం
వాషింగ్టన్: మొక్కల ఆధారిత జీవ ఇంధనం విమానయా న రంగంలో ఇంధనం గా వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్ప త్తులకు సరైన ప్రత్యామ్నా యం అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డా రు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు విజయవం తమైతే గనుక భవిష్యత్తులో విమానయాన రంగంలో ఇంధనంగా దీనిని వాడుకోవచ్చన్నారు. విమానయాన రంగం రోజుకు 50 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని వాడుకుంటోంది. రోడ్డు రవాణాతోపాటు ఇళ్లు, పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధ నాల వైపు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న సాంకేతికతతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించడం విమానయాన రంగంలో కుదరని అంశం. దీంతో కేవలం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రిక్ విమానాలను తయారు చేయడం వంటిది అతిపెద్ద సవాలుతో కూడుకోవడంతో ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో ద్రవీకృత జీవ ఇంధనాలే విమానయాన రంగానికి సరైన ప్రత్యామ్నాయం కానున్నాయని లారెన్స్ బర్క్లీ నేషనల్ ల్యాబోరేటరి పరిశోధకులు కోర్నీ స్క్వాన్ వెల్లడించారు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
డేంజర్ జోన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఏడు నుంచి తొమ్మిది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. పనితీరుపై ఆరా ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. -
ప్రత్యామ్నాయమే పరమావధి
సందర్భం ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. వర్తమాన తెలంగాణలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందించిన చైతన్యం వెలుగులో రాజకీయాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉన్నది. సరళీకరణ నేపథ్యంలో రాజకీయాలు వికృతరూపాన్ని సంతరించుకున్నాయి. అధికారం వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి పెట్టుబడి లేని వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వాధికారాన్ని గుప్పెడుమంది కలసి వనరులను కొల్లగొట్టడానికి సాధనంగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు పరి మితమై సాగలేదు. సరళీకరణ రాజకీయాలనే ఈ ఉద్యమం వ్యతిరేకించింది. సమష్టి సంపద ప్రజలందరికీ ఉపయోగపడాలని, ఆ విధంగా వనరులను ప్రజల అవసరాలు తీర్చే విధంగా వినియోగంలోకి తేవాలని తెలంగాణ వాదం తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు అందరి కోసం పనిచేయాలి. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు అధికారాన్ని ఉపయో గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమం బలంగా విశ్వసించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చరిత్రాత్మక పంథాలో ఉద్యమం సాగించిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. తరువాత ఉద్యమం నడిపిన సంస్థే రాజకీయ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి ప్రభుత్వపరంగా నిలబెట్టవలసిన ప్రజా స్వామిక విలువలకు వ్యతిరేకంగా సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు పాలకులు మారిపోయారు. కానీ పాలనలో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి నిరంకుశంగా, రాచరిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారు. అన్ని పాలనా వ్యవస్థలు, అన్ని సంస్థలు కుప్పకూలిపోయాయి. సచివా లయం నిరర్థకమైంది. నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి నివాసంలో జరుగు తాయి. మంత్రులతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఆయా శాఖల వ్యవహారాలను సమీక్షిస్తారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తారు. శాసన సభ్యులు, మంత్రులే ముఖ్యమంత్రి దర్శనం కోసం పడిగాపులు పడి ఉండ వలసిన పరిస్థితి. ఇక సాధారణ ప్రజలకు ముఖ్యమంత్రిని కలుసుకునే వెసు లుబాటు ఎక్కడ దొరుకుతుంది? ఇక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి కాగ్ బోలెడంత సమా చారం ఇచ్చింది. విద్య, వైద్య రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు. ఇది అవాంఛనీయ పరిణామం. కానీ ఆ తక్కువ కేటాయింపులను కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం మంజూరైన నిధులలో సగం కూడా ఖర్చు కాలేదు. పెట్టుబడి వ్యయంలో 80 శాతం దాకా రోడ్లు, ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు వినియోగమ య్యాయి. అయితే అవీ దారి మళ్లాయి. ఎక్కడ బడా కాంట్రాక్టర్లు ఉన్నారో, అక్కడే ఖర్చయినాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చయితే, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన నిధులు మురిగిపోయాయి. చెరువుల మరమ్మతుల విషయంలో పూడిక తీత పనులు సగం కూడా పూర్తికాలేదు. ప్రశ్నిస్తే తప్పేమిటి? తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిదంటూ ఆక్రోశిస్తున్న జనసమూహా నికి ముందు నిలబడి వారి ఆకాంక్షల కోసం పనిచేసిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ ప్రభుత్వంలోకి ప్రవేశించిన తరువాత అదే సంస్థ ప్రవర్తిస్తున్న తీరు విస్తుపోయేటట్టు ఉంటున్నది. ఉద్యమ సంస్థ పాలనలో ప్రశ్నించడాన్ని భరించలేని వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాలనలోని అవకతవకల గురించి గొంతెత్తిన వారిని అణచివేయడానికే తెరాస ప్రభుత్వం పూను కున్నది. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద చిరకాలం నుంచి ఉన్న ధర్ణా చౌక్‌ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసివేశారు. బహిరంగ సభల నిర్వహణకు వేదికలు లేవు. సెక్షన్ 30, సెక్షన్ 144లను అనేక జిల్లాలలో విచ్చ లవిడిగా ఉపయోగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి ఆలోచనల వ్యక్తీకరణకు రోడ్ల మీదకు వచ్చిన వారిని అందరినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా జైలు పాలవుతున్నారు. అధికారం సొంత ఆస్తి అయినట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నాటి రాజులు భావించిన తీరులోనేæ ప్రజలకు హక్కులు ఉండవనీ, పాలకులకు వారు లొంగి ఉండి వారి అధికారాన్నీ అదేశాలనూ శిరసావహించడమే ప్రజలు బాధ్యతగా స్వీక రించాలనీ ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. నిరంకుశ పాలనా రీతులను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. ఒక వ్యక్తి ఆధిపత్యం సరికాదు, పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజ వనరులు సమష్టి ప్రయోజనాలకే ఉపయో గపడాలి తప్ప గుప్పెడుమంది పాలకుల సొంత ఆస్తి కాకూడదని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిరంకుశ పాలనకు మధ్య సంఘర్షణ తలెత్తింది. ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో, అదీ సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో రాజకీయాలు ప్రజల ఆకాంక్షల వ్యక్తీక రణకు ఉపయోగపడాలి. అంతేతప్ప ప్రజాస్వామిక సంప్రదాయాలను, ఉద్యమ ఆకాంక్షలను అణచడానికి దారితీస్తే తెలంగాణ సమాజం అంగీకరిం చదని చరిత్ర చెబుతున్నది. అనేకానేక సమస్యలు ఇవ్వాళ అపరిష్కృతంగా ఉన్నాయి. వ్యవసా యంలో మిగులు లేదని, నష్టాలపాలై పోతున్నామని ఆవేదన చెందుతున్న రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. డిగ్రీ దాకా చదివిన యువతీ, యువకుల్లో అతి ఎక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రాలలో అస్సాం, జమ్మూ కశ్మీర్ తరువాత మనది మూడవ స్థానం. అయినా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విధానాలు తయారు కాలేదు. ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ స్థాయిలోను చర్యలు లేవు. వృత్తులను కాపాడటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేయనే లేదు. నాలుగేళ్లలో కనీస వేతనాలను సవరించే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు రాలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య అపరిష్కృతంగానే ఉన్నది. ఖాయిలా పడిన నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలే లేవు. ఈ లోపాలు సరి చేయడానికి తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసినాయి. కానీ ఫలితం దక్కలేదు. అభివృద్ధి నమూనాపై చర్చిం చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రభుత్వ వైఖరికి మూలకారణం అధికారపార్టీ రాజకీయాలే మూలమనేది స్పష్టం. ప్రత్యామ్నాయం కోసం యత్నం సమాజంలో వ్యవస్థల నిర్మాణానికి పునాది వేసేది రాజకీయాలు. అన్ని వనరుల పంపిణీని రాజకీయాలే నిర్ధారిస్తాయి. మార్పునకు మార్గ నిర్దేశన చేసేవే రాజకీయాలు. రాజకీయాలు జవాబుదారీతనంతో, ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన జరిగితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాంట్రా క్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కేంద్రంగా రాజకీయాలు సాగితే అప్పుడు ప్రజల ఆకాంక్షలకు గుర్తింపు ఉండదు. మార్పును సాధించగల రాజకీయ నాయకులు పైసల ఆశతో సంతలో పశువులు అమ్ముడు పోయినట్లు అమ్ముడు పోతున్నారు. చాలామంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగి మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నం చేయ వలసి వస్తున్నది. అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలపట్ల జవా బుదారీ తనంతో వ్యవహరించకపోతే, సమష్టి ప్రయోజనాల కోసం ప్రభు త్వాన్ని నడిపించే ప్రయత్నం చేయకపోతే సమాజ రుగ్మతలకు పరిష్కారం దొరకదు. కంచె చేను మేసినట్లు, పాలించేవాడే ప్రజలను విస్మరిస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవు. ఆచార్య జయశంకర్ బాటలో ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యే కంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. రాజకీయరంగంలో ప్రజల ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరించగలిగిన వేదిక లేకపోతే అన్ని ప్రయ త్నాలు, ఉద్యమాలు సంపూర్ణ ఫలితాలను సాధించలేవు. రాజకీయ రంగాన్ని విస్మరిస్తే అన్ని ఉద్యమాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ అనుభవాల నుంచే తెలంగాణ జేఏసీ గాని, ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలను పాదుకొల్పే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో రాజకీయాలను పునర్ నిర్వ చించాలి. ఉద్యమ కాలంలో ప్రజలు రాజకీయాలను శాసించారు. తమ వెంట రాని నాయకుల వెంటపడినారు. తెలంగాణ సాధన కోసం నాయకులు కదిలి వచ్చేటట్టు చేయగలిగినారు. ఇవ్వాళ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకై రాజ కీయాలలో మార్పు తేవాలి. ప్రజలందరూ గౌరవంతో జీవించగల, ప్రజలు కేంద్రంగా కల అభివృద్ధి కోసం మనం రాజకీయాలను మార్చాలి. దాని కోసం తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేస్తున్నాం.ప్రత్యామ్నాయ రాజకీయాలే తెలంగాణ జనసమితి లక్ష్యం. జనం కోసమే జన సమితి–ప్రగతి కోసమే పాలన అన్న నినాదం మాకు మార్గదర్శకం. ప్రొ‘‘ యం. కోదండరాం వ్యాసకర్త తెలంగాణ జన సమితి అధ్యక్షులు