
ముంబై: ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరని మహారాష్ట్ర డిప్యూటీ అజిత్ పవార్ అన్నారు. వచ్చే 2024 సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు.
‘ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు ఎవరూ లేరు. అటువంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి, రెండు విషయాలను దృష్టి పెట్టుకొని బీజేపీ అదిష్టానం నిర్ణయం తీసుకోదు’ అని ఆయన అన్నారు.
మీరే చాలా వరకు ఈ విషయంపై ప్రచారం కల్పిస్తున్నారని మీడియా ఉద్దేశించి అన్నారు. అయితే దేశంలో ఎవరి పాలన సురక్షితం, భద్రంగా, దృఢంగా ఉంటుందో. ఎవరు ప్రపంచ వేదికలపై మన దేశ గుర్తింపును పెంచుతారో అదే చాలా ముఖ్యమని అన్నారు. అయితే తాము ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఫలితాలు చూశామని తెలిపారు. అంచనాలకు తగినట్టు ఫలితాలు రావని అన్నారు. కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment