న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు.
పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment