కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!
క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్‌లు, మోమోస్, సాండ్‌విచ్‌లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్‌ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.
మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?
మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.
మాయోతో నష్టాలు
మయోన్నీస్‌రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్‌లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్‌నేటివ్స్
ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.
క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment