అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి, ప్రత్యామ్నాయ శక్తికి కేంద్రంలో అధికారం అప్పగించాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.
కొచ్చి: అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వా న్ని తరిమి కొట్టి, ప్రత్యామ్నాయ శక్తికి కేంద్రంలో అధికారం అప్పగించాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. యూపీఏ సర్కారును గద్దె దింపేందుకు గాను ప్రత్యామ్నాయ శక్తికి 100 శాతం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఇక్కడ జరిగిన 3 రోజుల ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రతిని ధుల సమావేశం చివరి రోజైన ఆదివారం సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ జోషి పాత్రికేయులతో మాట్లాడారు. సరిహద్దు భ్రదత, ఆర్థికం, రక్షణ నిబంధనలు సహా అన్ని అంశాల్లోనూ యూపీఏ విఫలమైందన్నారు.