లండన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు మరో సవాల్ ఎదురవనుంది. ట్విట్టర్‌ను ఢీకొట్టేందుకు మెటా తాజాగా థ్రెడ్స్ అనే యాప్‌ను సిద్ధం చేసింది. యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్‌లోఇది కనిపిస్తోంది. ట్విట్టర్‌లో మాదిరిగానే దీనిలోనూ టెక్ట్స్ రూపంలో మెసేజీలను లైక్ చేయవచ్చు. షేర్, కామెంట్ కూడా చేయవచ్చని యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్‌ను బట్టి తెలుస్తోంది.
ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు లింకై ఉన్న ‘టెక్ట్స్ బేస్డ్ కన్వర్జేషన్ యాప్’. ‘నేటి నుంచి రేపటి ట్రెండింగ్‌లో ఉండే అన్ని అంశాల వరకు చర్చించుకునే సమూహాల కోసమే థ్రెడ్స్’ అని మెటా తెలిపింది. ఇన్‌స్ట్రాగామ్ యూజర్లు అదే అకౌంట్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని చెబుతున్నారు. దీనిపై మెటా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాన్ మస్క్ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చేపట్టిన పలు మార్పులపై యూజర్లు అసంతృప్తితో ఉన్న సమయంలో మెటా ‘థ్రెడ్స్’ను తేనుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment