దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్‌పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్‌లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.
ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్‌గ్రేడ్‌లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్‌లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్‌పాడ్‌లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.
ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రా
తమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.
యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment