కంటిచూపు కూడా! | Jamapandu good for health | Sakshi
Sakshi News home page

కంటిచూపు కూడా!

Published Fri, May 5 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

కంటిచూపు కూడా!

కంటిచూపు కూడా!

గుడ్‌ఫుడ్‌

ఉదయం వేళ కావాల్సిన మలవిసర్జన సరిగా కాకపోయినా... ఒక వ్యక్తి మలబద్దకంతో బాధపడుతున్నా స్వాభావికంగానే ఆ పరిస్థితిని నయం చేసే ఔషధ ఫలం జామపండు. ఆపిల్‌ కంటే చాలా రెట్లు ఎక్కువగా మేలు చేస్తుందన్న పేరు పొందిన పండు జామ. దాని ప్రయోజనాల్లో కొన్ని...

►క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు  నియంత్రణలో ఉంటుంది. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువ, చక్కెర పాళ్లు తక్కువ. అందుకే స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.

►దీనిలో విటమిన్‌–ఏ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే మంచి కంటిచూపు కావాలనుకున్నవారు దీన్ని తినడం మేలు. పైగా క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది.

►జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇందుకు దోహదపడతాయి.

►జామలో విటమిన్‌–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది విటమిన్‌–సి లోపించడం వల్ల వచ్చే స్కర్వీ వంటి వ్యాధులకు విరుగుడుగా కూడా పనికి వస్తుంది.

►థైరాయిడ్‌ వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడే పండు... జామ.

►జామపండును క్రమం తప్పకుండా తినేవారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. విటమిన్‌–బి6, విటమిన్‌ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం... మెదడులోని న్యూరాన్ల పనితీరుకు పై విటమిన్లు అవసరం కావడమే దీనికి కారణం.

►రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గించడానికి జామ ఉపకరిస్తుంది. అంతేకాదు... ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది.
∙జామపండ్లను కొరికి తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement